కొన్ని వందల ఏళ్ళ క్రిందట ఇటలీ దేశంలోని ఒక పట్టణం లో ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. అతని దురదృష్టం కొద్దీ ఒక వడ్డీ వ్యాపారికి పెద్ద మొత్తంలో సొమ్ము బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలై వాడైనా మంచి జిత్తుల మారి. అతనికి తనకి బాకీ ఉన్న వ్యాపారి కూతుర్ని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతని కూతుర్ని తనకిచ్చి వివాహం జరిపిస్తే అప్పు మొత్తాన్నీ మాఫీ చేస్తానని ప్రతిపాదన చేశాడు. ఆ వ్యాపారి, అతని కూతురికీ ఈ ప్రతిపాదన వినగానే చాలా భయం వేసింది.
ఆ వడ్డీ వ్యాపారి పందెం ఇలా ఉంది. అతను ఒక ఖాళీ సంచీ లో ఒకే పరిమాణం, ఆకృతిలో ఉండే ఒక తెల్ల రాయి, ఒక నల్ల రాయి వేస్తాడు. ఆ అమ్మాయి ఆ రెండు రాళ్ళలో ఒకటి బయటికి తీయాలి. ఒక వేళ ఆమె నలుపు రాయి బయటికి తీస్తే అతన్ని పెళ్ళి చేసుకోవాలి. ఆమె తండ్రి అప్పు చెల్లించనవసరం లేదు. ఒక వేళ ఆమె తెల్ల రాయి బయటికి తీస్తే ఆమె అతన్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదు కానీ తండ్రి బాకీ పడ్డ సొమ్ము చెల్లించనక్కర్లేదు. కానీ ఆమె రాయి తీయనంటే మాత్రం ఆమె తండ్రి జైలు పాలు కావాల్సి ఉంటుంది.
వాళ్ళు ముగ్గురూ వ్యాపారి ఇంట్లో ఉన్నారు. వాళ్ళు నిల్చున్న దారిలో రకరకాల రాళ్ళున్నాయి. వాళ్ళలా మాట్లాడూతూ వెళుతుండగా ఆ వ్యాపారి రాళ్ళు తీసుకోవడానికి కిందికి వంగాడు. అలా తీస్తుండగా అతను రెండూ నల్ల రాళ్లనే తీసుకుని సంచిలో వేయడం ఆ అమ్మాయి గమనించింది. తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక రాయిని బయటికి తీయాల్సిందిగా కోరాడు.
ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న అవకాశాలు ఇవి.
“అయ్యయ్యో.. రాయి కింద పడిపోయింది” అంది ఆమె బాధ నటిస్తూ.
“కానీ నేనేం రంగు రాయి తీశానో తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఇప్పుడీ సంచీ లో ఉన్న రాయిని తీసి చూస్తే అదే రంగులో ఉంటుందో అందుకు వ్యతిరేకంగా ఉన్న రాయి నేను తీసినట్లు లెక్క” అంది ఏ మాత్రం తొణక్కుండా…
సంచీలో ఇక మిగిలింది కూడా నల్ల రాయే కాబట్టి, ఆమె తీసింది ఖచ్చితంగా తెల్లరాయేనని ఒప్పుకుని తీరాలి. ఆ వడ్డీ వ్యాపారి తను మోసం చేశానని ఒప్పుకునే ధైర్యం లేదు. విధిలేక అతను తన బాకీ మొత్తం రద్దు చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
అతను తనను పెళ్ళి చేసుకోకుండా చూడటం, తండ్రి అప్పును మాఫీ చేయడం ఒకేసారి చేయడం దాదాపుగా అసాధ్యం. చూశారా తెలివితేటలతో ఆ అమ్మాయి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందో…

- ఒక వేళ ఆ అమ్మాయి రాయి తీయనని నిరాకరిస్తే తండ్రి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది.
- ఆ అమ్మాయి రెండు రాళ్ళనీ బయటికి తీసి అందరికీ చూపించి అతన్ని మోసగాడని నిరూపించడం.
- ఏదో ఒక రాయిని (నలుపు) బయటికి తీసి అతన్ని పెళ్ళి చేసుకుని తండ్రిని అప్పుల్లోంచి కాపాడటం
- .
“అయ్యయ్యో.. రాయి కింద పడిపోయింది” అంది ఆమె బాధ నటిస్తూ.
“కానీ నేనేం రంగు రాయి తీశానో తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఇప్పుడీ సంచీ లో ఉన్న రాయిని తీసి చూస్తే అదే రంగులో ఉంటుందో అందుకు వ్యతిరేకంగా ఉన్న రాయి నేను తీసినట్లు లెక్క” అంది ఏ మాత్రం తొణక్కుండా…
సంచీలో ఇక మిగిలింది కూడా నల్ల రాయే కాబట్టి, ఆమె తీసింది ఖచ్చితంగా తెల్లరాయేనని ఒప్పుకుని తీరాలి. ఆ వడ్డీ వ్యాపారి తను మోసం చేశానని ఒప్పుకునే ధైర్యం లేదు. విధిలేక అతను తన బాకీ మొత్తం రద్దు చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
అతను తనను పెళ్ళి చేసుకోకుండా చూడటం, తండ్రి అప్పును మాఫీ చేయడం ఒకేసారి చేయడం దాదాపుగా అసాధ్యం. చూశారా తెలివితేటలతో ఆ అమ్మాయి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందో…
No comments:
Post a Comment