Tuesday, December 28, 2010

ఆలూ సెనగపిండి బోండా తయారీ విధానం

ఆలూ సెనగపిండి బోండా తయారీ విధానం

కావలసినవి :

ఆలు: రెండు
బఠానీలు (పచ్చివి): అర కప్పు ( సగం గుప్పెడు )
ఉల్లిపాయలు: 1 (మీడియం)
కొత్తిమీరి, పుదీన: 1-2 స్పూన్ల తురుము.
సెనగపిండి: 4 స్పూన్లు .
ఉప్పు: రుచికి
పచ్చిమిర్చి: 2 ( సన్నగా తరుకోండి)
నూనె: వేయించడనికి కావల్సినంత.

చేసే విధానం:

ముందుగా ఆలు ఉడికించుకోవాలి.
ఒక గిన్నెలో ఈ ఉడికించిన ఆలు ముద్ద చేసుకొని , అందులో సెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు , బఠానీలు , పచ్చిమిర్చి , పుదీన, కొత్తిమీర, సెనగపిండి అన్నీ వెసుకొని గట్టిగా కలుపుకోవాలి.


ఆ పిండిని చిన్న చిన్నగా ఉండలు చేసుకొని సన్నటి నూనె సెగలో వేయించుకోవాలి. టమాటా సాస్ తో తింటే బావున్నాయి.

Monday, December 27, 2010

అటుకుల ఉప్మా తయారీ విధానం

అటుకుల ఉప్మా తయారీ విధానం

ముందుగా ఒక్క గిన్నెలో (చిల్లుల గిన్నె ఐతే బెటర్) అటుకులూ (2 గ్లాసులు), మరమరాలు(ఒక్క గ్లాసు) పోసి నీళ్ళతో కడిగండి. చిల్లుల గిన్నె ఐతే అందులోనే ఉంచండి, నీళ్ళు వాటంతటే క్రిందకు జారిపోతాయి. మామూలు గిన్నె ఐతే అటుకులు, మరమరాలు పిండి ప్లేటులో పెట్టుకోండి.

వేరే గిన్నెలో నూనె, తిరగమోత(పోపు) వెయ్యండి. కొంచెమ్ సేపటి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పొటేటో చిప్స్ (ఉంటే నలిపి వెయ్యండి), చిటెకెడు పసుపు, ఉప్పు, స్పూన్ కారమ్ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత స్టవ్ సిమ్ చేసి, అటుకులు మరమరాలు వేసి కలపండి. బాగా కలిసిన తర్వాత ఓ స్పూనుతో టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెమ్ జల్లండి.

ఓ పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపెయ్యండి.

అంతే
ముగ్గురికి సరిపడ అటుకులుప్మా తయారు.

సుమతీ శతకము

* అక్కఱకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ!

* అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ!

* అడియాస కొలువుఁ గొలవకు
గుడిమణియము సేయఁబోకు , కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ !

* అధరము గదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !

* అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!

* అప్పుగొని చేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపరాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ !

* అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

* ఆఁకలి యడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేఁకల పాఁడియును రోఁత మేదిని సుమతీ!

* ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొండక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

* ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చినదే మగతనంబు , సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు , వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!

* ఇమ్ముగఁ జదువని నోరును
"నమ్మా"యని పిలిచి యన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !

* ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మిఁ బాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిలఁబురుషార్ధపరుఁడు గావలె సుమతీ !

* ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా
నెత్తిచ్చి కఱగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ !

* ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడనున్న వృషభముఁ
జదువని యా నీచుఁ జేరఁ జనకుర సుమతీ !

* ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

* ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱుకు కైవడినే పో
నెపములు వెదకును గడపటఁ
గపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ !

* ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

* ఎప్పుడు దప్పులు వెదికెడు
నప్పురుషుని కొల్వగూడ దదియెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ !

* ఎప్పుడు సంపదకల్గిన
నప్పుడె బంధువులువత్తురది యెట్లన్నన్
దెప్పలుగఁ జెరువు నిండినఁ
గప్పలు పదివేలుచేరుఁ గదరా సుమతీ!

* ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ !

* ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక నొగిఁ దఱచైనన్
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ !

* ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ !

* ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁగలిమిలేమి వసుధను సుమతీ !

* కడు బలవంతుండైనను
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ బుట్టినయింటిన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికిఁ దానె పంపుట సుమతీ !

* కనకపు సింహాసమున
శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం
దొనరఁగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

* కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుఁడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!

* కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమతమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులగుట తధ్యము సుమతీ!

* కరణము సాధై యున్నను
గరి మదముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గర మరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!

* కరణముఁ గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేఁడు సుమీ
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

* కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁ జుమీ
యిరుసునఁ గందెనఁ బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ!

* కవిగాని వాని వ్రాఁతయు
నవరస భావములు లేని నాతుల వలపున్
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ !

* కసుగాయఁ గఱచి చూచిన
మసలక దనయొగరు గాక మధురంబగునా?
పసగలుగు యువతు లుండగఁ
బసిబాలలఁ బొందువాఁడు పసరము సుమతీ!

* కాదన్నవాడె కరణము
వాదడచినవాడె పేడి వసుధేశుకడన్
లేదన్నవాడె చనవరి
గాథలు పెక్కాడువాడె కావ్యుడు సుమతీ!

* కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ !

* కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుఁడు గవయ గూడుటయెల్లన్
బ్రేమమునఁ జెఱకుపిప్పికి
జీమలు వెస మూఁగినట్లు సిద్ధము సుమతీ!

* కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణములేని బూరెయు
వీరణమునులేని పెండ్లి వృథరా సుమతీ !

* కులకాంత తోడనెప్పుడు
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటినుండ నొల్లదు సుమతీ !

* కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !

* కొంచెపు నరు సంగతిచే
నంచితముగఁ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

* కొక్కోకమెల్లఁ జదివినఁ
జక్కనివాఁడైన రాజు చంద్రుండైనన్
మిక్కిలి రొక్కంబీయక
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ!

* కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియెకాదు తండ్రి గుణములఁ జెరచున్
జెఱకు తుద వెన్ను పుట్టిన
జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ!

* కోమలి విశ్వాసంబును
బాములతోఁ జెలిమి యన్య భామలవలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !

* గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుఁగులిడుదు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడపీనుఁగ వచ్చెననుచు నగుదురు సుమతీ !

* చింతింపకు గడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియె మతముర సుమతీ !

* చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!

* చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁద్రవ్యంబు గలుగఁగదరా సుమతీ !

* చేతులకుఁదొడవు దానము
భూతలనాథులకుఁదొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ !

* తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁగార్యం బగునే?
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ !

* తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!

* తనకలిమి యింద్రభోగము
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తనచావు జగత్ ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ !

* తనయూరి తపసితనమును
దన పుత్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు ముందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ !

* తనవారు లేని చోటను
జనమించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ !

* తములము వేయని నోరును
విమతులతో జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలఁకును
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ !

* తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ!

* తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ
దల దడివి బాసఁ జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ !

* తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను బ్రాణవల్లభునైనన్
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోనఁ దిరముగ సుమతీ!

* తాననుభవింప నర్థము
మానవపతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ
గానల నీఁగలు గూర్చిన
తేనియ యొరుఁజేరినట్లు తిరముగ సుమతీ!

* దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ!

* ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారి కెంత కలగిన
దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ !

* ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ!

* నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

* నమ్మకు సుంకరిఁ జూదరిఁ
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
నమ్మకు మంగడివానిని
నమ్మకుమీ వాహహస్తు నవనిని సుమతీ!

* నయమునఁ బాలుం ద్రావరు
భయమ్మున విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ!

* నరపతులు మేరఁ దప్పినఁ
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌను గాని మానదు సుమతీ!

* నవరస భావాలంకృత
కవితా గోష్ఠియును మధుర గానంబును దా
నవివేకి కెంతఁ జెప్పినఁ
జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ!

* నవ్వకుమీ సభ లోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

* నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువులకెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!

* పగ వలదెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

* పతి కడకుఁ దన్ను గూర్చిన
సతికడకును , వేల్పుకడకు , సద్గురు కడకున్
సుతు కడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు , నీతి మార్గము సుమతీ !

* పనిచేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దన భుక్తియెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండ నగురా సుమతీ!

* పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరులు దను బొగడ నెగడియు
పరులలిగిన నలుగ నతడు పరముడు సుమతీ !

* పరసతి కూటమిఁగోరకు ,
పరధనముల కాసపడకు పరునెంచకుమీ ,
సరిగాని గోష్ఠి సేయకు,
సరి చెడిఁ జుట్టుంబుకడకుఁ జేరకు సుమతీ !

* పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁడు గాంగేయుడైన భువి నిందబడున్
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ !

* పరు నాత్మఁ దలఁచు సతిఁ విడు
మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ
వెఱపెఱుఁగని భటు నేలకు
తఱచుగ సతిఁ గవయఁబోకు తగదుర సుమతీ!

* పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెప్పుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
యెఱిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ !

* పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యుబ్బకు మదిలో ,
గర్వింప నాలిఁ బెంచకు,
నిర్వహణము లేనిచోట నిలవకు , సుమతీ !

* పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటి నిద్ర , తరుణులయెడలన్
పొలయలుక నాఁటి కూటమి,
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ !

* పాటెఱుగని పతి కొలువును ,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేఁటెత్తజేయు చెలిమియు
నేటికి నెదురీఁదినట్లు లెన్నగ సుమతీ !

* పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగాఁ
బాల చవిఁ జెఱచుఁ గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

* పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకున్
దేలగ్నిఁ బడఁగఁ బట్టిన
మేలెఱుఁగునె మీటుఁగాక మేదిని సుమతీ!

* పిలువని పనులకుఁ బోవుట
కలయని సతిరతియుఁరాజు , గానని కొలువుం
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ!

* పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

* పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ !

* పులిపాలు తెచ్చి యిచ్చిన
నలవడఁగా గుండెగోసి యఱచే నిడినన్
దల పొడుగు ధనముఁ బోసిన
వెలయాలికిఁ గూర్మి లేదు వినురా సుమతీ!

* పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!

* పొరుగునఁ బగవాఁడుండిన
నిరవొందఁగ వ్రాఁతగాఁడె యేలికయైనన్
ధరఁ గాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

* బంగారుఁ గుదువఁ బెట్టకు
సంగరమునఁ బాఱిపోకు సరసుఁడవైనన్
నంగడి వెచ్చము లాడకు
వెంగలితోఁ జెలిమి వలదు వినురా సుమతీ!

* బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!

* మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపుటేనుఁగు
తొండము లేకుండినట్లు దోఁచుర సుమతీ!

* మంత్రిగలవాని రాజ్యము
తంత్రము చెడకుండ నిలచుఁ దఱచుగ ధరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ!

* మది నొకనిఁ వలచి యుండఁగ
మదిజెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
అది చిలుకఁ బిల్లి పట్టినఁ
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

* మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

* మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెఁడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్లు యెఱుగుము సుమతీ!

* మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసిపోవుఁ గాని నెగడదు సుమతీ!

* రాపొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే?
దీపంబు లేని యింటను
జేపుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!

* రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ!

* లావు గలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

* వరి పంట లేని యూరును
దొరయుండని యూరును తోడు దొరని తెరువున్
ధరను బతిలేని గృహమును
నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ !

* వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!

* వలపింత సతికిఁ బుట్టక
బలిమినిఁ దమకించి విటుడు పైకొనుటెల్లన్
మలయజము సాన మీదను
జలముంచక తీసినట్టి చందము సుమతీ!

* వినఁదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ!

* వీడెము వేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జెందని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

* వెలయాలి వలనఁ గూరిమి
గలుగదు మఱిఁ గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడు తెరువునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

* వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలిపొందు వెలమల చెలిమిన్
గలలోనఁ గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినురా సుమతీ!

* వేసరఁపు జాతిగానీ
వీసముఁ దాఁ జేయనట్టి వెంగలి గానీ
దాసికొడుకైనఁ గానీ
కాసులు గలవాడె రాజు గదరా సుమతీ!

* శుభముల నొందని చదువును
నభినయమును రాగరసము నందని పాటల్
అభిలాష లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

* శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుపుట్ట నుడివెద సుమతీ!

* సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ!

* సిరి తాఁ వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తాఁ బోయిన బోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

* స్త్రీలయెడ వాదులాడకు
బాలురతోఁ జెలిమి సేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
యేలినపతి నిందసేయ కెన్నడు సుమతీ!

వేమన పద్యాలు

* అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెఋగకున్న నీశ్వరుడెఋగడా?
విశ్వదాభిరామ వినురవేమ

* అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ

* అగ్నిచేతబట్టి యా పరమేశుని
నిందచేసి నరులు నీరుకారె?
దక్షు క్రతవులోని తల్లడమెఋగరా?
విశ్వదాభిరామ వినురవేమ

* అధికుడైన రాజొకల్పుని జేపట్ట
వానిమాట చెల్లు వసుధలోన
గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ

* అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

* అనల మించుకైన గనలి మండునుగాని
చనువుగాని యొఱుక మనికి నిడదు
తనువు మఱచువాడె తత్త్వజ్ఞుడగునయా
విశ్వదాభిరామ వినురవేమ

* అనువుగాని చోట నధికులమనరాదు
కొంచమయిన నదియు గొదువ గాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభి రామ వినుర వేమ

* అన్నిదానముల కంటె నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ

* అభిజాత్యముననె యాయువున్నంతకు
దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక
మురికి భాండమునను ముసరునీగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ

* అలమెఱుగు యోధు డల్పుని జేరిన
మార్పుచేత బుధ్ధి మరిగి తిరుగు
మ్రానుమ్రాను తిరుగు మర్కట రీతిని
విశ్వదాభిరామ వినురవేమ

* అలయజేసి మలచి అడిగండ్లు మడిగండ్లు
తిరిపెమిడెడు కటిక దేబెలెల్ల
ఎలమి మన్నుదినెడు ఎర్రలౌదురు సుమీ
విశ్వధాభిరామ వినుమవేమ

* అల్పజాతివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల దొలగజేయు
చెప్పుతినెడు కుక్క చెఱుకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ

* అల్పబుధ్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడికుక్క చెఱకు తీపెఱుగున?
విశ్వదాభిరామ వినురవేమ

* అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ

* ఆడుదానిఁ చూడ నర్థంబుఁ జూడఁగా
బ్రహ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు
బ్రహ్మయాలి త్రాఁడు బండిరేవునఁ ద్రెంప
విశ్వదాభీరామ వినురవేమ

* ఆత్మ తనలోన గమనించి యనుదినంబు
నిర్గుణాత్మార్చనముజేసి నిత్యమమ్ర
ప్రత్యగాత్మను లోనెంచి ప్రబల్యోగి
సచ్చిదానంద పదమందు సతము వేమ

* ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ

* ఆలిమాటలు విని యన్నదమ్ములబాసి
వేరె పోవువాడు వెఱ్ఱివాడు
కుక్కతోకఁబట్టి గోదావరీదునా?
విశ్వదాభిరామ వినురవేమ

* ఆలు రంభయైన నతిశీలవతియైన
జారపురుషుడేల జాడమాను
మాలవాడకుక్క మఱగిన విడుచునా
విశ్వదాభిరామ వినురవేమ

* ఇంచుకంత బోన మీశ్వరార్పణమన్న
పుణ్యలోకమునకు పోవునతడు
అన్నదానమునకు నధిక దానములేదు
విశ్వధాభిరామ వినురవేమ.

* ఇంటి ఆలువిడిచి ఇల జాఱకాంతల
వెంట తిరుగువాడు వెఱ్ఱివాడు
పంటచేను విడచి పఱిగ యేఱినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ

* ఇంటిలోని జ్యోతి యెంతయు వెలుగగా
బొరుగువారి యగ్గి కరుగరెపుడు
తాను దైవమాయె, దైవము గొలుచునా?
విశ్వదాభిరామ వినురవేమ

* ఇచ్చకము భువి నవశ్యము
కుచ్చిత మిహిలోక నింద కోవిదునకు నీ
తచ్చననె హాని వచ్చును
మచ్చరమే తన్ను చెఋఅచు మహిలో వేమా

* ఇచ్చువాని వద్ద ఈని వాడుండిన
చచ్చుగాని ఈవి సాగనీడు
కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ

* ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ

* ఇన్ని జాతులందు నేజాతి ముఖ్యమన్
ఎఱుక గల్గువారె హెచ్చువారు
ఎఱుక లేనివార లేజాతినున్నను
హీనజాతియంచు నెఱుగు వేమ

* ఇహమునందుబుట్టి ఇంగిత మెరుగని
జనుల నెంచి చూడ స్థావరములు
జంగమాదులనుట జగతిని పాపంబు
విశ్వదాభిరామ వినురవేమ

* ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

* ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ వినుర వేమ

* ఊగియూగి లాగి యున్నది కనగోరు
సాగలాగి పట్టు సాక్షిగాను
యోగమమర ముక్తి నొందును ప్రాజ్ఞుండు.
విశ్వదాభిరామ వినురవేమ

* ఎంత చదువు చదివి యెన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ

* ఎంత సేవచేసి యేపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న
పాముతోడిపొందు పదివేలకైనను
విశ్వదాభిరామ వినురవేమ

* ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
మౌనిదెల్పవచ్చు మాసముననె
మొప్పెదెల్పరాదు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ

* ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ

* ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెరిగి చూడు వృత్తియందు
నేర్పులేనివాని నెరయోధుడందురా?
విశ్వదాభిరామ వినురవేమ

* ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ

* ఏది కులము నీకు? నేది స్థలంబురా?
పాదుకొనుము మదిని పక్వమెఱిగి
యాదరించు దాని నవలీల ముట్టరా
విశ్వదాభిరామ వినుర వేమ

* ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన
వాని నోరు మిత్తి వరుసగొట్టు
చేపపిండు బెద్ద చేపలు చంపును
చేపలన్ని జనుడు చంపు వేమ

* ఔర! యెంతవార లల్లరి మానవుల్
ప్రభువైన గేలిపరతు రెన్న
దా దెగించువాడు దండియౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ

* అంతరంగమందు అపచారములుచేసి
మంచివానివలెనె మనుజుడుండ
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా
విశ్వదాభిరామ వినురవేమ

* అంటుముట్టునెంచి యదలించి పడవైచి
దూరమందు జేరి దూఱుచుంద్రు
పుట్టి చచ్చు జనులు పూర్ణంబు నెఱుగరు
విశ్వదాభిరామ వినుర వేమ

* అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను
అంతరంగ మెఱుగ నార్యుడగును
అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి
విశ్వదాభిరామ వినురవేమ

* కండ చక్కెరయును గలియ బాల్పోసిన
తరిమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గంపెట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ

* కండ చక్కెఱయును గలియ బాల్పోసిన
తఱిమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గంపట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ

* కనగ సొమ్ము లెన్నొ కనకంబ దొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ.
విశ్వదాభిరామ వినురవేమ

* కన్నులందు మదము కప్పి కానరుగాని
నిరుడు ముందటేడు నిన్న మొన్న
దగ్ధులైనవారు తమకంటె తక్కువా?
విశ్వదాభిరామ వినురవేమ

* కన్నెల నవలోకింపగ
జన్నులపై ద్రుష్టి పాౠ సహజం బిలలో
కన్నుల కింపగు ద్రుష్టిని
తన్నెౠగుట ముక్తికిరవు తగునిది వేమా

* కర్మగుణములన్ని కడబెట్టి నడువమి
దత్త్వమెట్లు తన్ను దగులుకొనును?
నూనె లేక దివ్వె నూవుల వెల్గునా?
విశ్వదాభిరామ వినురవేమ

* కలియుగంబునందు ఘనతకు నైచ్యము
ఘనత నైచ్యమునకు గలుగుచుండు
శ్రధ్ధ భక్తులుడిగి జనులుంద్డ్రు కావున
విశ్వదాభిరామ వినురవేమ

* కలుష మానసులకు గాంపింప గారాదు
అడుసు లోన భాను డడగినట్లు
తేట నీరు పుణ్య దేహ మట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ

* కల్ల గురుడు గట్టు కర్మచయంబులు
మధ్య గురుడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు.
విశ్వదాభిరామ వినురవేమ

* కల్ల నిజముజేసి కపటభావముజేంది
ప్రల్లదంబులాడు భక్తిలేక
మాయలాడుఖలుడు మహితాత్ముసాటియా?
విశ్వదాభిరామ వినురవేమ

* కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ

* కసరు తినును గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచుజేయు బనులు
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ

* కసవును దినువాడు ఘనఫలంబుల రుచి
గానలేడుగాదె వానియట్లు
చిన్నచదువులకును మిన్నజ్ఞానమురాదు
విశ్వదాభిరామ వినురవేమ

* కసినిగల్గి పాపకర్ముల బీడింతు
రల్ల ప్రభులు యముని యల్లభటులు
వ్రుశ్చికంబుగన్న విడుతురే చంపక
విశ్వదాభిరామ వినురవేమ

* కస్తరి నటు చూడ గాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ

* కానివానితోడగలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ

* కులము కలుగువారు గోత్రంబు కలవారు
విద్యచేత విఱ్ఱవీగువారు
పసిడికల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమ

* కులము లేనివాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులము కన్న నెన్న గలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ

* కులములో నొకడు గుణహీనుడుండిన
కులముచెడును వాని గుణమువలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలినట్లు
విశ్వదాభిరామ వినురవేమ

* కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మృమములను చెప్పరాదు
పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు
విశ్వదాభిరామ వినురవేమ

* కూళ కూళ్ళుమేయు గుణమంత చెడనాడి
నెట్టివారు మెచ్చరట్టివాని
కొయ్యదూలమునకు గుదురునా జ్ఞానంబు?
విశ్వదాభిరామ వినురవేమ

* కైపుమీరువేళ గడకుజేరగరాదు
అనువుదప్పి మాటలాడరాదు
సమయమెరుగనతడు సరసుండుకాడయా?
విశ్వదాభిరామ వినురవేమ

* కొండగుహలనున్న గోవెలందున్న
మెండుగాను బూది మెత్తియున్న
దుష్టబుధ్ధులకును దుర్బుధ్ధి మానునా?
విశ్వదాభిరామ వినురవేమ

* కొండముచ్చు పెండ్లి కోతిపేరంటాలు
మొండివాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామ వినురవేమ

* కొండెగాడు చావ గొంపవాకిటికిని
వచ్చిపోదురింతె వగపులేదు
దూడ వగచునె భువిదోడేలు చచ్చిన
విశ్వదాభిరామ వినురవేమ

* కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ

* ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయు
భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లె
యెంత చెప్పి చివరనెసగిన బొసగునే?
విశ్వదాభిరామ వినురవేమ

* గంగపారుచుండ గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
అధికుడొర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ

* గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ

* గాడ్దెమేనుమీద గంధంబు పూసిన
బూదిలోన బడచుబొరలు మరల
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ

* గాడ్దెయేమెఱుంగు గంధపువాసన
కుక్కయేమెఱుంగు గొప్పకొద్ది
అల్పుడేమెఱుంగు హరుని గొల్చు విరక్తి
విశ్వదాభిరామ వినురవేమ.

* గుఱ్ఱమునకు దగిన గురుతైన రౌతున్న
గుఱ్ఱములు నడచు గురుతుగాను
గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ

* గొడ్డుటావుఁ బితుకఁ గుండఁ గొంపోయిన
బండ్ల నూడఁదన్నుఁ బాల నిడదు
లోభివాని నడుగ లాభంబు లేదయా!
విశ్వదాభిరామ! వినుర వేమ!


* గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన
విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు
జ్ఞానులైనవారి గర్హింతు రూరక
విశ్వదాభిరామ వినురవేమ

* చంపదగినయట్టి శత్రువుతనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలుచేసి పొమ్మనుటయేచాలు
విశ్వదాభిరామ వినురవేమ

* చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుధ్ధు లిట్లుండురా.
విశ్వదాభిరామ వినురవేమ

* చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండిగొట్ట దేలేమిచేయురా
విశ్వదాభిరామ వినురవేమ

* చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువుచదివి యింకజదువు చదివి
చదువుమర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ

* చదివి నతని కన్న చాకలియే మేలు
కులము వేల్పు కన్న కుక్క మేలు
సకల సురల కన్న జారభామిని మేలు
విశ్వదాభిరామ వినురవేమ

* చదువులన్ని చదివి చాల వివేకియౌ
కపటికెన్నడైన గలదెముక్తి?
నిర్మలాత్మకునకె నిశ్చలంపు సమాధి
విశ్వదాభిరామ వినురవేమ

* చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ

* చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ

* చిత్త సుద్ది కలిగి చేసిన పుణ్యంబు
కొంచమయిన నదియు గొదువ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకునెంత
విశ్వదాభిరామ వినురవేమ

* చెప్పులోన ఱాయి చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయ
విశ్వదాభిరామ వినురవేమ

* చెఱకు తీపిలేమి జెత్తనాబడునట్లు
పరగ గుణములేని పండితుండు
దూఱపడునుగాదె దోషమటుండగ
విశ్వదాభిరామ వినురవేమ

* చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన
కొంచమైన దాని గుణము చెడదు
ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు.
విశ్వదాభిరామ వినురవేమ

* ఛర్ధి పుట్టినపుడు సాపడసైపదు
నాతిగన్న యపుడు నీతి తగదు
చేటు మూడినపుడు మాటలు తోచవు
విశ్వదాభిరామ వినురవేమ

* జంత్ర మంత్ర మహిమ జాతవేదుడెఱుంగు
మంత్రవాది యెఱుగు దంత్ర మహిమ
తంత్రిణీక మహిమ దినువాడెఱుంగును
విశ్వదాభిరామ వినురవేమ

* జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడ
గుక్క విన్నివెంట కూయదొడగు
ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె
విశ్వదాభిరామ వినురవేమ

* జన్మములను మఱియు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలము కాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినురవేమ

* జాతి నీతి వేఱు జన్మం బదొక్కటి
రయ దిండ్లు వేఱె యౌను గాక
దర్శనములు వేఱు దైవమౌ నొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ

* ఝషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుండె నేని నిక్కి పడును
అండ తలగు నెడల నందఱి పని యట్లె
విశ్వదాభిరామ వినురవేమ

* టక్కరులను గూడి యొక్క సక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతిచెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి
విశ్వదాభిరామ వినురవేమ

* డీకొనంగ దగదు డెంద మెఱుంగక
యడుగ వచ్చి కొంత యనిన వాని
చెప్పునంత నినియు మెప్పుగా బలుకుమీ
విశ్వదాభిరామ వినురవేమ

* డెందమందు దలచు దెప్పరమెప్పుడు
నోర్వలేనిహీను డొరునికట్టె
తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ

* తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ

* తగదు తగదటంచు తగువారు చెప్పిన
వినడు మొఱకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మీర్నింతెకా
విశ్వదాభిరామ వినురవేమ

* తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన
మానవుండు ముక్తి మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు తోడగు
విశ్వదాభిరామ వినురవేమ

* తగిన కులజుడైన తన యెత్తు ధనమైన
పరపురుషుని నేల పట్ట వచ్చు?
పరమ సాధ్వి చూడ నొరుల నంటదు సుమా
విశ్వదాభిరామ వినురవేమ.

* తన కులగోత్రము లాకృతి
తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంట రావు నిజమిది
తన సత్యమె తోడవచ్చు దనతో వేమా

* తనకుగలుగు పెక్కు తప్పులటుండగా
పరులనేరుచుండు నరుడు తెలియ
డొడలెఋంగ డనుచు నొత్తి చెప్పంగవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ

* తనర న్రుపతితోడ దగ దుర్జనునితోడ
అగ్నితోడ బరుని యాలితోడ
హాస్యమాడుటెల్ల నగును ప్రాణాంతము
విశ్వదాభిరామ వినురవేమ

* తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని
సొమ్ములెఱవుదెచ్చి నెమ్మిమీఱా
నొరులకొరకుతానె యుబ్బుచునుండును
విశ్వదాభిరామ వినురవేమ

* తల్లి యున్నయపుడె తనదు గారాబము
లామె పోవ దన్ను నరయ రెవరు
మంచికాలమపుడె మర్యాద నార్జింపు
విశ్వదాభిరామ వినురవేమ

* తుమ్మచెట్టు ముండ్లు తోడనేపుట్టును
విత్తులోననుండి వెడలునట్లు
మూర్ఖునకును బుధ్ధి ముందుగాబుట్టును
విశ్వదాభిరామ వినురవేమ

* తేలుకుండును తెలియగొండి విషంబు
ఫణికినుండు విషము పండ్లయందు
తెలివిలేని వాండ్ర దేహమెల్ల విషంబు
విశ్వదాభిరామ వినురవేమ

* దాసరయ్య తప్పు దండంబుతో సరి
మోసమేది తన్ను ముంచుకున్న?
నీచుడై చెడునటు నీచుల నమ్మిన
విశ్వదాభిరామ వినురవేమ

* దుండగీడు కొడుకు కొండీడు చెలికాడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును కోతియె సరియగు
విశ్వదాభిరామ వినురవేమ

* దుష్టజనులు మీరి తుంటరిపనులను
శిష్టకార్యములుగ జేయుచుంద్రు
కూడదనెడువారి గూడ నిందింతురు
విశ్వదాభిరామ వినురవేమ

* దూరద్రుష్టిగనరు తూగిదనుకను
బారుపట్టెరుగౌ పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు
విశ్వదాభిరామ వినురవేమ

* నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు
బయల కుక్కచేత భంగపడును
స్థానబలిమికాని తనబలిమికాదయా
విశ్వదాభిరామ వినురవేమ

* నరకులమున దా బుట్టియు
నరకులమున దాను పెరిగి నరుడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని
హరకులమున దిరుగునేని హరుడౌ వేమా

* నిజము లాడు వాని నిందించు జగమెల్ల
నిజము బల్కరాదు నీచుల కడ
నిజ మహాత్ము గూడ నిజమాడ వలయురా
విశ్వదాభిరామ వినురవేమ

* నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ

* నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
ఎట్లు కలగు బర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినురవేమ

* నీళ్ళ బోసి కడిగి నిత్యంబు శోధించి
కూడుబెట్టి మీద కోకగట్టి
యేమి పాట్లబడుదురీ దేహమున కిల
విశ్వదాభిరామ వినుర వేమ

* నేరనన్నవాడు నెఱజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్తకాడు
ఊరకున్నవాడె యుత్తమోత్తముడయా
విశ్వదాభిరామ వినురవేమ

* నేరని జనులకును నేరముల్ నేర్పుచు
చక్కచేయరిల నసాధులెపుడు
ఒప్పు దుర్జనములు తప్పగనెంతురు
విశ్వదాభిరామ వినురవేమ

* నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె
మనసు భూతమువలె మలయగాను
శివుని గాంతు ననుచు సిగ్గేలగాదురా?
విశ్వదాభిరామ వినురవేమ

* పంకజాక్షి గన్న బంగరు బొడగన్న
దిమ్మపట్టియుండు తెలివియొప్పు
మనుజులకును తత్త్వ మహిమెట్లు కల్గురా
విశ్వదాభిరామ వినురవేమ

* పచ్చదనము చూచి ఇచ్చను కాముకుల్
చిచ్చులో బడుదురు క్షితితలమున
ఇచ్చ కలుగజేయు హెచ్చుగా మోహంబు
విశ్వదాభిరామ వినురవేమ

* పడతి మోసె నొకడు పడతి మేసె నొకండు
పడతి సురము జేర్చి బ్రతికె నొకడు
పడతి కొఱకె పెక్కు పాట్లను బడిరయా
విశ్వదాభిరామ వినురవేమ

* పడుచు నూఱకేల బాఱచూచెదరొక్కొ
ఎంత వారలైన భ్రాంతి చెంది
లోన మీఱు కాము లొంగజేయగలేక
విశ్వదాభిరామ వినురవేమ

* పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
బంగరమందు కూర్ప బరువు గనును
గాని ఇతరలోహమైన హీనము గాదె!
విశ్వదాభిరామ వినురవేమ

* పతి, సుతులిద్దరు పవ్వళింతురు
సతి యొద్దనే స్తనయుగళంబు
సుతు ముట్టిన పాలుబ్బును
పతి ముట్టిన నల్లతావి పదునగు వేమ

* పదుగురాడు మాట పాటియై ధరజెల్లు
నొక్కడాడు మాట యొక్క దెందు
ఊఱకుండు వాని కూరెల్లు నోపదు
విశ్వదాభిరామ వినురవేమ

* పనసతొనల కన్న పంచదారలకన్న
జుంటితేనె కన్న జున్ను కన్న
చెఱకు రసము కన్న చెలిమాట తీపిరా
విశ్వదాభిరామ వినురవేమ

* పరులు చదువజూచి నిరసనబుధ్ధితో
వట్టిమాటలాడు వదరుబోతు
అట్టి ఖలుని జాడలరయుట దోసము
విశ్వదాభిరామ వినురవేమ

* పాముకన్న లేదు పాపిష్టి యగు జీవి
యట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ

* పాలు పంచదార పాపరపండ్లలో
చాలబోసి వండ జవికిరావు
కుటిలమానవులకు గుణమేల కల్గురా?
విశ్వదాభిరామ వినురవేమ

* పొట్లకాయ రాయి పొదుగ ద్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుగు
కుక్కతోకగట్ట గుదురునా చక్కగా?
విశ్వదాభిరామ వినురవేమ

* బిడియ మింతలేక పెద్దను నేనంచు
బొంకములను బల్కు సంకఠునకు
ఎచ్చు కలుగదిచట జచ్చిన రాదట
విశ్వదాభిరామ వినురవేమ

* భాగ్యహీనులకును వరుసవేది దొరుక
నదియు నిల్వదపుడు వదులుగాక
వానతోడ వచ్చువడగండ్లు నిలుచునా
విశ్వదాభిరామ వినురవేమ

* మంచివారు లేరు మహిమీద వెదకిన
కష్టులెందఱైన గలరు భువిని
పసిడి లేదుగాని పదడెంత లేదయా
విశ్వదాభిరామ వినురవేమ

* మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు
తెలుప వచ్చు దన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ

* మాటలాడవచ్చు మనసు నిల్పగలేడు
తెలుపవచ్చు దన్ను తెలియలేడు
సురియ బట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ

* మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడత యొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను
విశ్వదాభిరామ వినురవేమ

* మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యన్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినుర వేమ

* మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యున్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినురవేమ

* మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడు లోన జురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమ

* ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు బనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ వినురవేమ

* మేడిపండుచూడ మేలిమై నుండు
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ

* మొగము జూచినపుడె మోహంబు ఘనమౌను
ధనము జూచినపుడె తగులు మనసు
కూలి నష్టమైన గొరునే కొఱగామి
విశ్వదాభిరామ వినురవేమ

* మ్రాను దిద్దవచ్చు మఱి వంకలేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహిమీద నెవరికి
విశ్వదాభిరామ వినురవేమ

* రాజసంబు చెంది రమణుల పొందాస
పడెడువాడు గురుని ప్రాపెౠగునె
విటుల మరుగు యువతి విభుభక్తి యెఱుగునా
విశ్వదాభిరామ వినురవేమ

* రూపులేని వనిత రూఢి పతివ్రత
నీటు లేనివాడు పోటు బంటు
తెలుపవచ్చు నెట్లు దేవరభంటుం
విశ్వదాభిరామ వినురవేమ

* రేగుపుచ్చకాయ రేయెల్ల దన్నిన
మురగ దంతకంత పెరుగుగాని
ఒరులు ఛీయన్నను నోగు సిగ్గెరుగునా?
విశ్వదాభిరామ వినురవేమ

* వంపుకఱ్ఱగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింపరాదు
విశ్వదాభిరామ వినురవేమ

* వలపు గలిగెనేని వనజాక్షి యధరంబు
పంచదారకుప్ప పాలకోవ
చూత ఫలరసంబు జున్నుసమానము
విశ్వదాభిరామ వినురవేమ

* వలపు తీరెనేని వనజాక్షి యధరంబు
ములక పంటి గిజరు ముష్టిరసము
చింత పోంత యగును జీడి సమానమౌ
విశ్వదాభిరామ వినురవేమ

* వాక్కు శుధ్ధిలేని వైనదండాలు
ప్రేమ కలిగినట్టు పెట్టనేల?
నొసట బత్తిజూపు నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినురవేమ

* వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ
జేరరాడు తాను చేటుదేడు
జ్ఞాని యగుచు బుధుడుఘనత బొందగజూచు
విశ్వదాభిరామ వినురవేమ

* వారకాంతలెల్ల వలపించి వత్తురు
బుధ్ధులెల్ల తొలగబుచ్చు కొఱకు
మాట రూఢిగాగ మగలెల్ల వత్తురు
విశ్వదాభిరామ వినురవేమ

* విద్యలేనివాడు విద్యధికుల చెంత
నుండినంత పండితుండుకాడు
కొలని హంసలకడ గొక్కెర యున్నట్టు
విశ్వదాభిరామ వినుర వేమ

* వెఱ్ఱివాని మిగుల విసిగింపగా రాదు
వెఱ్ఱివాని మాట వినగ రాదు
వెఱ్ఱి కుక్క బట్టి వేటాడగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ

* వేము బాలుపోసి వేయేండ్లు పెంచిన
జేదు విడిచి తీపి జెందబోదు
ఓగు గుణము విడిచి యుచితజ్ఞుడగు నెట్లు?
విశ్వదాభిరామ వినురవేమ

* వేరు పురుగుచేరి వృక్షంబు జెరుచు
చీడపురుగుచేరి చెట్టుజెరుచు
కుత్సితుండు చేరి గుణవంతు జెఱచురా
విశ్వదాభిరామ వినురవేమ

* శూద్ర యువతి కొడుకు శుధ్ధాంతరంగుడై
వేద వేద్యమైన పాదు దెలిసి
బ్రహ్మపదవి గన్న బ్రాహ్మణుడే గదా!
విశ్వదాభిరామ వినుర వేమ

* శూద్రతనము పోయె శూద్రుడుగానని
ద్విజుడనుకొనుటెల్ల దెలివిలేమి
ఇత్తడెసగు పసిడి కీడనవచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ

* శూద్రులనుచు భువిని శూద్రుల భోనాడు
మాలకన్నదుడుకు మహిని లేడు
నరకమునకు నేగు నష్టమైన వెనుక
విశ్వదాభిరామ వినుర వేమ

* సారవిద్యలందు సరణి దెలియలేక
దూరమందు జేరు దుర్జనుండు
పరముదెలియ నతడు భావజ్ఞుడెట్లగు?
విశ్వదాభిరామ వినురవేమ

తెలుగు సామెతలు

అంచు డాబే గానీ పంచె డాబు గాదు
అంటు, సొంటు లేని మేనమామ కొడుకు పొగడ చెట్టు కింద కూర్చుని పక్కలెగరేసాడట.
అంతా అయినోళ్ళేగానీ అన్నం పెడతానని ఒక్కరూ అనరు
అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు
అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట
అక్క మనదైతే బావ మనవాడా?
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
అగ్నికి వాయువు తోడైనట్లు
అగ్రహారాలన్నీ పోతే పోయాయి గానీ, ఆక్టు బాగా తెలిసిందన్నాడు
అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ
అటునుండి నరుక్కు రా
అడకత్తెరలొ పోకచెక్కలా
అడకత్తెరలో పోకచెక్క
అడగందే అమ్మ అయినా పెట్టదు
అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు
అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
అడుక్కుతినేవాడికి అర్ధరాజ్యమిచ్చినా అడుక్కుతినేచిప్ప కడుక్కుదాచుకున్నడట
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
అడుక్కున్నమ్మకు 60 కూరలట, వండుకున్నమ్మకు ఒకటే కూరట
అడుసు తొక్కనేల కాలు కడగనేల
అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
అతగాడే ఉంటే మంగలెందుకు
అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న
అతి రహస్యం బట్టబయలు
అతి వినయం ధూర్త లక్షణం
అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు.
అత్త సొమ్ము అల్లుడు దానం
అత్తకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దసరా పండగ అన్నాడంట
అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
అత్తా నీ పైట తొలగిందన్నా తప్పే తొలగలేదన్నా తప్పే
అత్తింటి కాపురం కత్తిమీది సాము.
అత్యాశ ఎప్పుడూ అనర్ధమే
అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.
అదృష్టం పండితే ఆరునూరవుతాయి.
అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
అద్దం అబద్ధం చెప్పదు
అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు.
అద్దం లో నీడకు ఆశ పడరాదు.
అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
అధికమైతే అమృతం కూడా విషమే
అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
అధికాశ లోకదరిద్రం.
అనగా అనగా రాగం తినగా తినగా రోగం
అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
అనుమానం పెనుభూతం
అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.
అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
అన్నదానం కన్నా విద్యాదానం మిన్న
అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు
అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.
అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.
అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.
అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
అన్నీ ఉన్నాయి, అంచుకు తొగరే లేదు
అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట
అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
అప్పిచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్లు
అప్పిచ్చువాడు వైద్యుడు
అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
అప్పు నిప్పులాంటిది...
అప్పుచేసి పప్పు కూడు
అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
అప్పులేనివాడు అధిక బలుడు.
అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల
అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.
అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
అభ్యాసము కూసువిద్య
అమరం నెమరుకు వస్తే కావ్యాలను కాల్చివేయనా
అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.
అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
అమెరికా ఎక్కడరా అంటె మెరక దాటితె అమెరికాయెరా అన్నాడట
అమ్మ అదృష్టాన నడిచే పిల్లలు పాకిరేరుట
అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
అమ్మ కన్న ఆరుగురూ సంగీత పాఠకులే
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
అమ్మబోతె అడవి కొనబోతె కొరివి
అమ్మాయి గడప దాటి చెడిద్ది,అబ్బాయి గడప దాటక చెడతాడు
అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనష్టమే .
అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
అయిన పెండ్లికి మేళమా?
అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
అయోమయం....జగన్నాథం!
అయోమయం.....అడవి పంచాంగం
అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం.
అయ్య వచ్చేవరకూ అమావాస్య ఆగుతుందా?
అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
అయ్యవచ్చే వరకు అమావాస్య ఆగుతుందా....
అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు
అయ్యవారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.
అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు
అరచేత్తో సూర్యుని కిరణాలు ఆపలేవు
అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
అరిచే కుక్క కరవదు
అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
అర్దరాత్రి మద్దెల దరువు
అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట
అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.
అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా
అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.
అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
అలిగిన ఆలు, తడిసిన మంచము బిగుసుకుంటవి.
అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
అల్పనరులకెల్ల నతివలపై చింత.
అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.
అల్పుడికి ఐశ్వరం వస్తే అర్ధరాత్రి గొడుగు తీసుకుని రమ్మన్నాడుట
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
అల్లుడి ఆశా తీరింది .. అత్త అప్పూ తీరింది
అసలు అయిదు మూరలు చాలు కొసరు పది మూరలు కావాలన్నాడట
అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి అట
అసలు లేని బావ కంటే గుడ్డి బావే మేలు
అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
అసలుకంటె కొసరే ముద్దు
అసలుకే ఎసరు పెట్టినట్లు
అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు
అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.
ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలబడలేదు
మిన్ను కురవక చేను పండదు....కన్ను కురవక బ్రతుకు పండదు
అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
అత్త కు ఆయసం ఎక్కువ ,కోడలి కి కోపము ఎక్కువ
అభ్యాగతి,ఆదివిష్ణు
అర చేతిలో బెల్లం పెట్టి మోచెయ్యి నాకించినట్టు
తానులో గుడ్డే
ఆలూలేదూ చూలూలేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్ ( ఇది లేటెస్టు సామెత)
తాను ముక్కే
మొద్దు లోదే పేడు
ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్లుంది
ఆంబోతులా పడి మేస్తున్నావు
ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గెరగదు
ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
ఆకలేస్తే రోకలి మింగు..అరగక పోతే తిరగలి మింగు
ఆకారపుష్టి నైవేద్యనష్టి
ఆకాశానికి హద్దే లేదు
ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
ఆడదాని వయసు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు
ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
ఆడబోయిన తీర్థమెదురైనట్లు
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు
ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు
ఆత్రగాడికి బుద్ది మట్టం
ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
ఆదిలోనే హంసపాదు
ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు
ఆపదలో మొక్కులు, సంపదలో మరపులు
ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
ఆమరకా ఈమరకా అడ్డగోడకి, మాటా మాటా పెద్దకోడలకి
ఆయనే ఉంటే మంగలి ఎందుకు?
ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
ఆరేసుకోబోయి పారేసుకున్నట్టు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆలస్యం అమృతం విషం
ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
ఆలి మరు కవాటం, ఇల్లు ఇరు కవాటం
ఆలి శుచి ఇల్లు చెపుతుంది
ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే, చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
ఆలూ మగల కలహం ఆకు వక్క నమిలినంత సేపే
ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు
ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా ?
ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
ఆవు నలుపైతే పాలు నలుపా?
ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నాయి .
ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
ఆవునిచ్చి పలుపుతాడు దాచినట్లు.
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
ఆశకి అంతం లేదు
ఆశకు దరిద్రానికి లంకె.
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
ఆశగా దోసెలేసుకుంటె అల్లుడొచ్చి లాక్కుతిన్నాడట
ఆసనాలు వేస్తే పాసనాలు పట్టాయట
ఆస్తి మూరెడు ఆశ బారెడు
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
ఇంటి పేరూ కస్తూరి వారు ఇంటినిండా గబ్బిలాల కంపు
ఇంటికన్నా గుడి పదిలం
ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు.
ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన.
ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు.
ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.
ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.
ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.
ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.
ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.
ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు.
ఇంటెద్దుకు బాడిగలేదు.
ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
ఇంట్లో పస్తు, వీధిలో దస్తు.
ఇంట్లో పిల్లి, వీధిలో పులి
ఇంట్లో మొగుడు కొడితే వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
ఇంతోటి పెళ్ళికీ ఒక్క మొగుడేనా
ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.
ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
ఇద్దరు ముద్దు, ఆపై వద్దు
ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
ఇరుగు ఇంగలం,పొరుగు మంగలం
ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
ఇల్లరికం అల్లుడు చెబితే వినడు..కొడితే ఏడుస్తాడు
ఇల్లలకగానే పండగకాదు
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చూరులో చుట్ట కాలి ఇంకోడు ఏడ్చాడుట
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.
ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
ఇసుకతో తాడు పేమి(/ని)నట్లు.
(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.
ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
ఊరుకి ఊరు ఎంత దూరమో, ఊరు నుంచి ఊరు అంతే దూరం
ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు) , దాతలెవరంటే చాకళ్ళు.
ఎద్దు ఎద్దు జోడు, అయితే చేను చేను బీడు.
కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
జొన్నకూటికా స్తోత్రపాఠం?
నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
మొహానికా సేరు పసుపు?
సంబడా(ళా)నికేనా ఇంత సంబరం?
ఈకలు లేవుగానీ, వింజమూరి పుంజే.
ఈకెలు తోకలు దులిపి, నూకలలో కలిపినట్లు.
ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
ఈడు చూసి పిల్లనివ్వాలి, పిడి చూసి కొడవలి కొనాలి
ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.
ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.
ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాక్కున్నట్టు
ఈత చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు
ఈతకు మించిన లోతు లేదు
ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు
ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.
ఈతవచ్చిన వానికే జలగండం.
ఈనగాచి నక్కలపాలు చేసినట్లు
ఈనాడు ఇంటిలో, రేపు మంటిలో .
ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
ఈనిన పులికి ఆకలెక్కువ.
ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది.
ఈవేళ చస్తే రేపటికి రెండు.
' (ఇవ్వు)అన్నది ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది.
ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు
ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
ఉంటే అమీరు లేదా పకీరు
ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు
ఉన్న మాటంటే ఉలుకెక్కువ
ఉన్న లోభి కంటే లేని దాత నయం
ఉన్న శాంతం ఊడ్చుకుపోయింది గానీ కోపమే లేదు.
ఉన్నదాన్ని వదిలి లేనిదానికోసం వెదుకులాడినట్లు
ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టె.
ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టును, లేనివాడూ ఉన్నవానికే పెట్టును .
ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినవాడు కాటికి పెద్ద.
ఉన్నవాడు ఖర్చు పెట్టకపోతే అంటారు, లేనివాడు ఖర్చు పెడితే అంటారు.
ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోయినట్లు.
ఉపాయం ఉన్నవాడు ఊరిమీద పడి బ్రతుకుతాడు.
ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడట.
ఉపాయం లేని వాడు, ఉపవాసంతో చచ్చాడు.
ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదు.
ఉప్పు పులుసు కారము తినే శరీరానికి ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది కామము.
ఉప్పుతినకురా..అప్పులపాలు కాకురా.
ఉప్పుతిన్న వాడు నీరు తాగక తప్పదు.
ఉప్పువాడూ ఏడ్చి పప్పువాడూ ఏడిస్తే కొబ్బరి బొండాలవాడు పొర్లి పొర్లి ఏడ్చేడుట
ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలి.
ఉయ్యాల్లో పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
ఉరిమిన మబ్బు తరిమిన పాము ఊరకే పోవు.
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
ఉలిపికట్టెకేలరా ఊళ్ళో పెత్తనాలు?
ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
ఊక ఊకే నూక నూకే!
ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
ఊపిరి పట్టితే బొజ్జ నిండునా?
ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట
ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టుకోను చోటులేదు
ఊరకున్న దేవుడికి ఉపారాధన లెట్లు వస్తాయి?
ఊరికళ గోడలే తెలుపుతాయి.
ఊరు ఉసిరికాయంత, తగవు తాటికాయంత.
ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
ఊరున్నది, చిప్ప ఉన్నది, నాకేంతక్కువ అన్నట్లు.
ఊరుమాసినా పేరు మాయదు.
ఊరులేక పొలిమేర ఉండునా?
ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
ఊళ్ళోవాళ్ళ ఉసురోసుకొని, నూరేండ్లు బ్రతకమన్నట్లు.
ఋణము, రణము ఒకటే.
ఋణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచరాదు.
ఋణానుబంధ రూపేణా,పశు పత్ని ఇత్యాదులు
ఎదురుగా వస్తున్నందుకే ఏడుస్తూ ఉంటే ఎత్తుకోమని మొత్తుకున్నట్లు ఉంది
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
ఎంగిలాకులు ఎత్తమంటే, వచ్చినవాళ్ళను లెక్కపెట్టినాడట.
ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
ఎంత చెట్టుకి అంత గాలి
ఎంత తిన్నా పరగడుపే
ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు.
ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే.
ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక.
ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే.
ఎంత ప్రాప్తో అంత ఫలం
ఎంత సంపదో అంత ఆపద.
ఎక్కడ వేసిన గొంగళి (/గొంగడి) అక్కడే ఉన్నట్లు
ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది.
ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు.
ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు.
ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు.
ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు.
ఎగిరెగిరి దంచినా అంతేకూలి, ఎగరక దంచినా అంతేకూలి.
ఎగిరే గాలిపటం వేలికి తగిలిందంట
ఎగిరే పిట్టకి మసాలా నూరినట్టు..
ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
ఎత్తిపోయే కాపురానికి కాలు పెడితేనేమి?
ఎత్తు పీట వేయడము
ఎత్తెత్తి అడుగు వేస్తే పుల్లాకు మీద పడిందిట.
ఎదుట లేకుంటే ఎదలో ఉండదు.
ఎదురుగుండా ఉన్నవాడే పెళ్ళికొడుకూ అందిట
ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
ఎద్దు పుండు కాకికి ముద్దు
ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
ఎద్దురా అంటే గిద్దెడు చాలన్నాట్ట
ఎన్ని గులాబీలో అన్ని ముళ్ళు
ఎరను చూపి చేపను పట్టినట్లు
ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి తన పట్టు వదలదు
ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు
ఎవరికి వారే యమునా తీరే
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు
ఎంతవారలైనా కాంత దాసులే.
ఎండకి గొడుగు పట్టాలన్నట్లు
చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
బాధ లేని వాడికి అన్నం తింటమే ఒక బాధ
మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
ఏడుస్తూ వ్యవసాయం చేస్తె తాళ్ళు మోకులు దొంగ లెత్తుకెళ్ళారుట
ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
ఏనుగు మీద దోమ వాలినట్లు
ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
ఏమండీ కరణంగారూ...? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట
ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది
ఏరు దాటి తెప్ప కాల్చే రకం
ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య
ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు
ఐరావతమంత మనిషే కానీ, ఆవగింజంత మనసు లేదు
ఐశ్వర్యానికి అంతము లేదు
ఒక దెబ్బకు రెండు పిట్టలు
ఒకరికి పుట్టే, ఇద్దరికి పుట్టే, అర్ధరాత్రివేళ అందరికీ పుట్టే
ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
ఒడ్డున కూర్చొని గడ్డలు వేసేవాడికి ఏం తెలుసు ఈదే వాడి బాధ
ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
ఓర్చినమ్మకు తేట నీరు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
అంగట్లో అరువు తలమీద బరువు
అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
అంచు డాబే కాని, పంచె డాబు లేదు
అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
అంత పెద్ద పుస్తకం చంకలో ఉంటే, పంచాంగం చెప్పలేవా అన్నాట్ట
అంతంత కోడికి అర్థశేరు మసాలా.
అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
అంతా మనమంచికే.
అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
అందని ద్రాక్ష పుల్లన
అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
అందరూ అంటారని ఆపసోపాలు పడ్డట్టు
అందరూ అందలమెక్కితే మోసేవారెవరు?
అందరూ శ్రీవైష్ణవులే- బుట్టలో చేపలన్నీ మాయం.
అందితే జుట్టు అందకపోతే కాళ్లు
అందితే తల, అందకపోతే కాళ్లు
అంధుడికి అద్దం చూపించినట్లు
అంధుని ముందు అందాలు ఒలకబోసినట్లు
అంబలి ఏరై వస్తోంది అత్తా అంటే కొలబుర్ర చేతిలోనే ఉంది కోడలా అందిట
అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకడు
అంబలి త్రాగేవాడికి మీసాలొత్తేవాడొకడు ()
కాకిలా కలకాలం ఉండేకంటే, హంసలా కొద్దికాలమున్నా మేలు
కడుపు తీపి, కన్న కడుపు తీయ దనము, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూచుట
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు
కంగారులో హడావుడి అన్నట్లు
కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
కంచేచేను మేసినట్లు
కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
కంటికి రెప్ప కాలికి చెప్పు
కంటికి రెప్ప దూరమా
కండలేని వానికే గండం
కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
కంపలో పడ్డ గొడ్డు వలె
కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
కణత తలగడ కాదు. కల నిజం కాదు
కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు
కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
కన్నొక్కటి లేదు గాని,కంతుడు కాడే?!
కన్య,కీర్తి,కనకం ఇవే మగవాడి వెంట పడాలి కానీ,మగవాడు వీటి వెంట పడకూడదు
కబళే కబళే, గోవిందా!
కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
కలసి ఉంటే కలదు సుఖం
కలిపి కొట్టరా!కావేటి రంగా!
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
కల్లు త్రాగిన కోతిలా
కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
కాకి కావ్ మంటే - కాంతుని కౌగిలించుకున్నట్లు
కాకి పిల్ల కాకికి ముద్దు
కాకిని తెచ్చి పంజరములో ఉంచితే చిలకవలె పలుకునా ?
కాకిముక్కుకి దొండపండు
కాగల కార్యం గంధర్వులే తీర్చారు
కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
కాలు కాలిన పిల్లిలా
కాలు జారితె తీసుకోగలము కాని, నోరు జారితె తీసుకోలేము
కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
కుక్క కాటుకి చెప్పు దెబ్బ
కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
కుక్కతోక వంకరన్నట్లు...!
కుట్టేవాడికి కుడి వైపు....చీదే వాడికి ఎడమవైపు ఉండొద్దన్నారు..
కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
కుమ్మర వీధిలో కుండలు అమ్మినట్లు
కూటికి లేకున్నా కాటుక మాననట్లు
కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
కూనను పెంచితే గండై కరవ వచ్చినట్లు
కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
కొండపైకి కట్టెపుల్లలు మోసుకెళ్లినట్లు
కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి
కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
కోటి విద్యలు కూటి కోసమే
కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
కోతిగంతులు...సాయిబు వసూళ్ళు
కోతీ కోతీ ఎందుకు పుట్టావ్ అంటే చక్కనోడిని వెక్కిరించడానికి అని చెప్పిందంట!
కోపం వస్తే కొట్టి చంపుతాడు, తాపం వస్తే కొరికి చంపుతాడు
కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
కోస్తే తెగదు కొడితే పగలదు
క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
క్షణం తీరికా లేదు, దమ్మిడీ ఆదాయం లేదు .
కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి పుట్టే' అందిట.
గంగిగోవు పాలు గరిటడైన చాలు
గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
గంతకు తగ్గ బొంత
గంతలు కట్టి,(= కట్టుకుని ) సూర్య నమస్కారములు అన్నట్లుగా
గచ్చకాయలకు తెచ్చిన గుర్రము అగడ్తదాటునా?
గజ ఈతగాడు గెడ్డలో పడి చచ్చాడట
గట్టు దాటే దాకా ఓడ మల్లన్న...గట్టు దాటాక బోడి మల్లన్న
గతి లేనమ్మకు గంజే పానకము
గాజుల బేరం భోజనానికి సరి
గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
గుంపులో గోవిందా
గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్లు
గుడిలో పిత్తకుండా ఉంటే నైవేద్యం పెట్టినంత ఫలితం
గుడ్డి కన్నా మెల్ల నయము కదా
గుడ్డి గుఱ్ఱానికి పళ్ళు తోముట
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
గుడ్డెద్దు చేలో పడినట్లు
గుడ్డోడికి కుంటోడి సాయం
గుడ్ల మీద కోడిపెట్టలా
గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
గురివింద గింజ తన నలుపెరగదంట
గురువుకి పంగనామాలు పెట్టినట్లు
గురువుని మించిన శిష్యుడిలా
గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
గూటిలో కప్ప పీకితే రాదు
గొడ్డు గోతిలో పడితే తలొక బెడ్డా విసిరినట్లు
గోటితో పోయేదానికి గొడ్డలి వాడినట్లు
గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
గోడకి చెవులుంటాయ్
గోడకేసిన సున్నం
గోతి కాడ నక్కలా
గోరంత ఆలస్యం కొండొంత నష్టం
గోరుచుట్టు మీద రోకలిపోటు
ఘంటా కర్ణుని వద్ద శంఖము ఊదినట్లు
ఘట కుటీ ప్రభాతము
ఘడియ తీరిక లేదు గవ్వ ఆమ్దానీ లేదు
చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
చక్కనమ్మ చిక్కినా అందమే
చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
చట్టిలో కూడు చట్టిలోనే ఉండాలి, బిడ్డ మాత్రం దుక్కగా ఉండాలి
చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
చద్దికంటె ఊరగాయ ఘనం
చనిపోయిన వారి కళ్ళు చారెడు
చల్లకొచ్చి ముంత దాచినట్లు
చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
చాప క్రింది నీరులా
చారలపాపడికి దూదంటి కుచ్చు
చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
చింత చచ్చినా పులుపు చావనట్టు
చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన
చిత్తశుద్ది లేని శివపూజలేల
చిన్న వాళ్ళు తింటే చిరుతిండి, పెద్దవాళ్ళు తింటే పలహారం
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
చిలికి చిలికి గాలి వాన అయినట్లు
చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
చూరు క్రింద నీరు త్రాగి, చల్ల త్రాగామని చెప్పినట్లు
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
చెట్టు మీద పిట్టవాలె పిట్టవాలితే పట్టుకొంటే పట్టుకొంటే గిచ్చుపెట్టే గిచ్చుపెడితే విడిచిపెడితి
చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
చెడపకురా చెడేవు
చెప్పుతినే కుక్క చెరకు తీపి ఎరుగునా
చెప్పేవాడికి వినేవాడు లోకువ
చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
చెముడా అంటే మొగుడా అన్నట్టు
చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు
చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
చెవిటి పెద్దమ్మా చాంతాడేది ? అంటే మా పుట్టిల్లు బెజవాడ అందిట !
చెవిటి ప్రియురాలికి ఆశుకవిత్వం చెప్పినట్లుంది
చెవిటోడి పెళ్ళికి మూగోడి కచేరీ
చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
చెవిలో జోరీగ
చేతకాని వాడు వేటకెళ్తే....పిట్ట బ్యాక్ చూపిందట
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ
చొప్పదంటు ప్రశ్న
ఛాయా, తోయం, వసన మశనం
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
జన్మకో శివరాత్రి అన్నట్లు
జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
జరిగినమ్మ జల్లెడు తోనైనా నీళ్ళు తెస్తుంది
జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి, కంటికో చూపు
జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
జుట్టు అంటూ ఉంటే జడైనా వేసుకొవచ్చు
జుట్టున్నమ్మ కొప్పు పెట్టినా అందమే
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
జోడు గుఱాలపై స్వారీ చేసినట్లు
జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
టోపీ పెట్టుకుని తోటలోకి వెళుతుంటే, తాటి ఇచ్చి అడుక్కోమన్నారు ఊరిలో జనం
డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
డబ్బు కోసం గడ్డి తినే రకం
డబ్బుకు లోకం దాసోహం
డబ్బూ పోయే శనీ పట్టే
డబ్బే దైవము
డౌలు డస్తు పగలు పస్తు
రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
తాటిపండు తింటావా తలకొట్టుకుంటావా
తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
తడి గుడ్డతో గొంతు కొయ్యడం
తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
తల ప్రాణం తోకకి వచ్చినట్లు
తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
తా వలచినది రంభ, తా మునిగింది గంగ
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
తాతకు దగ్గులు నేర్పినట్టు
తాదూర సందు లేదు, మెడకో డోలు
తానా అంటే తందానా అన్నట్లు
తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు
తాను దూర సందు లేదు తలకో కిరీటమట
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
తామరాకు మీద నీటిబొట్టులా
తాళ్ళపాక వారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత
తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయి
తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
తిట్టను పోరా గాడిదా అన్నట్టు
తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
తినకపోతే నీరసం...తింటే ఆయాసం..
తినగ తినగ వేము తియ్యగనుండు
తినబోతూ రుచులు అడిగినట్లు
తిన్నింటి వాసాలు లెక్కేయటం
తిమింగలాలకు చేప అయితే ఏమిటి?
తిరిగేకాలు తిట్టేనోరు ఊరుకోవు
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
తీయగా తీయగా రాగం, మూల్గ గా మూల్గ గా రోగం
తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
తేలు కుట్టిన దొంగలా
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
తోక తెగిన కోతిలా
తోక ముడుచుట
తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
తోటెమ్మ తొడకోసుకుంటే తాను మెడకోసుకుందిట
దంచినమ్మకు బొక్కిందే కూలిట
దండం దశగుణం భవేత్
దక్కేవి దక్కక మానదు... దక్కనివి ఎప్పటికీ దక్కవు
దప్పిక అయినపుడు బావి తవ్వటం మొదలెట్టినట్లు
దయగల భార్య తలుపు దగ్గరకు వేసి తిడుతుంది
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొడతాడట
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...
దాసుని తప్పు దండంతో సరి
దిక్కులేనివారికి దేవుడే దిక్కు
దిగితేనేగాని లోతు తెలియదు
దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
దున్నపోతు మీద వానకురిసినట్లు
దురాశ దుఃఖానికి చేటు
దూకు దూకు మనేవాళ్ళు గాని, దూకే వాడు ఒక్కడూ లేడు
దూరపుకొ౦డలు నునుపు
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అన్నట్టు
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడు అన్నట్టు
దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే!
దొంగకు తేలు కుట్టినట్లు
దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు
దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
దొరికితే దొంగలు లేకుంటే దొరలు
ధరణికి గిరి భారమా?!
ధర్మో రక్షతి రక్షితః
ధైర్యే సాహసే లక్ష్మి
నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
నలుగురితో నారాయణా
నల్ల బ్రాహ్మణున్ని, ఎర్ర కోమటిని నమ్మకూడదంట
నల్లటి కుక్కకు నాలుగు చెవులు
నవ్విన నాప చేనే పండిందంత
నవ్విన నాపచేనే పండుతుంది
నాగస్వరానికి లొంగని తాచు
నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
నిండా మునిగిన వానికి చలేంటి
నిండు కుండ తొణకదు
నిజం చెప్పులేసుకొనేలోగా అబద్ధం అవని చుట్టొస్తుంది
నిజం నిప్పులా౦టిది
నిజం నిలకడమీద తెలుస్తుంది
నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
నిప్పు ముట్టనిదే చేయి కాలదు
నిప్పులేనిదే పొగరాదు
నివురు గప్పిన నిప్పులా
నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
నీచేతిమాత్ర వైకుంఠయాత్ర
నీటిలో జాడలు వెతికినట్టు
నీటిలో రాతలు రాసినట్లు
నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
నూరు చిలుకల ఒకటే ముక్కు
నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
నేతిబీరలో నేతి చందంలా
నేల విడిచి సాము చేసినట్లు
నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
నోటికొచ్చిన మాట ముడ్డికొచ్చిన పిత్తు
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
నోరుంటే తలకాస్తుంది
పంచాంగం పోతే నక్షత్రాలు ఉండవా?
పాటిమీది గంగాలమ్మకి కూటిమీదే చింత
పొద్దల్లా బారెడు నేసేను దివ్వె తెండి దిగనేస్తా అన్నట్టు
పచ్చి కంకులే పుల్లయ్యా!" అంటే రాలిన కాడికే గోవిందా. " అన్నాడట
పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
పంచామృతములో పాలి (=వాటా)
పండంటి కొడుకును కంటాను అంటే వద్దనే అత్తగారు ఉంటుందా అన్నట్టు
పండగ నాడు కూడా పాత మొగుడేనా?
పండిత పుత్ర పరమ శుంఠ
పండితపుత్రుడు... కానీ పండితుడే...
పందికేంతెలుసు పన్నీరు వాసన
పక్కలో బల్లెం
పగవాణ్ని పంచాంగం అడిగితె మధ్యాహ్నానికి మరణం అన్నాట్ట
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టు
పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడు
పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయ్
పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
పళ్లూడగొట్టుకోడానికి రాయైతేనేమి?
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
పాలు, నీళ్ళలా కలిసిపోయారు
పావలా కోడికి ముప్పావలా దిష్టి
పిండి కొద్దీ రొట్టె
పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
పిచ్చోడి చేతిలో రాయి
పిచ్చోడికి పింగే లోకం
పిల్ల నచ్చింద అల్లుడూ అంటె...నువ్వె నచ్చావత్తా అన్నాదంట
పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
పిల్లికి బిచ్చం పెట్టనివాడు
పుండుకు పుల్ల మొగుడు
పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
పూచింది ఒకెత్తు,
కాచింది ఒక ఎత్తు.
పెట్టిన రోజు పెళ్ళి కూడు,పెట్టని రోజు పిండా కూడు
పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
పెనం మీద పెసరట్టు...పొయ్యిలో పడ్డట్టు
పెరటి (పెఱటి)చెట్టు వైద్యానికి పనికి రాదు
పెరుగుట విరుగుట కొరకే
పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
పేదవాడికి పెళ్ళామే ప్రియురాలు
పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
పేరు గొప్ప ఊరు దిబ్బ
పైన పటారం, లోన లొటారం
పొట్టోడికి పుట్టెడు బుద్దులు
పొమ్మనలేక పొగపెట్టినట్లు
పొయ్యి దగ్గర పోలీసు
పొరుగింటి పుల్లకూర రుచి
పోతూ పోతూ అత్తా నీకొడుకు ఆకలిగొట్టువాడు సుమా అన్నట్లు
పోనిలే అని పాత చీర ఇస్తే ఇంటి వెనుకల కి వెల్లి మోరలేసిందంట
బొండు మల్లెలు బోడి తలకెందుకు?
బట్ట తలకాయాకి పాపిట తియ్యమన్నట్లు
బట్టకి పెట్టినదీ బానిసకి పెట్టినదీ ఒకటి
బడాఇ బచ్చె కూడు లేక చచ్చె
బతకలేక బడి పంతులని
బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
బతికుంటే బస్టాండ్లో బటానీలు అమ్ముకోవచ్చు
బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందట
బలవంతుడికి గడ్డిపరక కూడా ఆయుధమే
బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
బాల వాక్కు బ్రహ్మ వాక్కు
బావిలో కప్పకి లోకమేమి తెలుసు
బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ
బుగ్గ గిల్లి జోల పాడటం
బూడిదలో పోసిన పన్నీరు
బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
బెల్లం చుట్టూ ఈగల్లా
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు
బ్రాహ్మణుడి నోరూ, ఏనుగు తొండమూ ఊరుకోవు
భక్తి మనదే! భుక్తి మనదే!
భక్తిలేని పూజ పత్రి చేటు
భాషలు వేరైనా భావమొక్కటే
భొజనానికి ముందు ఉండాలి,కొట్లాటలకు వెనుక ఉండాలి
మంగలిని చూసి గాడిద కుంటినట్లు
మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
మంచోళ్ళకు మాటలతోనూ, మొండోళ్ళకు మొట్టికాయలతోనూ చెప్పాలి
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
మసి పాత(లో ) ఉన్న మాణిక్యము
మహారాజా వారని మనవి చేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట!
మా ఇంటికొస్తే ఏమి తెస్తావ్...మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావ్.
మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
మాటలో చక్కెర,మనసులో కత్తెర
మాను పిల్లి అయినా, మట్టి పిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి(మార్జాలం).
మామగారు జానివాకర్ తాగితే అల్లుడుగారు చివాస్ రీగల్ తాగుతాడా?
మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
మింగ లేక మంగళవారం అన్నాడట
ముంజేతి కంకణానికి అద్దమేల ?
ముందు నుయ్యి వెనుక గొయ్యి
ముందుంది ముసళ్ళ పండుగ
ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
మొండివాడు రాజు కన్నా బలవంతుడు
మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
మొరిగే కుక్క కరవదు
మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
మోరెడు ముందుకు పోయి బారెడు వెనుకకి రాకూడదు
మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
మౌనం అర్ధాంగీకారం
యధార్ధవాదీ, బంధు విరోధీ
యెల్లమ్మను ఎంచనక్కరలేదు, పోలమ్మను పొగడనక్కరలేదు
రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
రాజుల సొమ్ము రాళ్ళ పాలు
రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?
రాతి కుండని చూసి మట్టికుండ పారిపోయిందన్నట్టు
రానివారిని పిలవ వేడుక....బోడితల అంట వేడుక
రామాయణంలో భీముడెందుకు లేడు అన్నాడంట
రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు
రుచిమరిగిన పిల్లి ఉట్టిమీద కెగిరినట్లు
రూపాన అరిష్ఠి, గుణాన పాపిష్ఠి
రెంటికీ చెడిన రేవడి చందాన
రెక్కాడితే గానీ డొక్కాడదు
రెడ్డొచ్చె మొదలాడు
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
రొయ్యకు లేదా బారెడు మీసం...
రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
రోషం లేని మూతికి మీసమెందుకు?
రోషానికి పోయి మీసాలు గొరిగించుకున్నాడంట
రౌతు కొద్ది గుర్రం
రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
లంఖణం పరమౌషధం
లక్క వంటిది తల్లి, రాయి వంటి ( రాయంటి) కొడుకు
లేడికి లేచిందే పరుగు
లేని దాత కంటే ఉన్న లోభి నయం
లోకం పోకడ
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
వంక పెట్టనిదే వెన్నపూస కూడా కొనరు
వంకరటింకర పోతుంది పాము కాదు
వంగుతున్న కొద్దీ ఇంకా వంచాలని చూస్తారు
వచ్చే దాక ఆరాటం,వచ్చిన తరువాత పోరాటం!
వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు
వనిత,విత్తం,పుస్తకం పరహస్తం గతం గత:
వయసులో వున్న గాడిద కూడా అందంగా కనిపిస్తుందట
వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
వస్తే కొండ పోతే వెంట్రుక
వాడికి సిగ్గు నరమే లేదు
వానరాకడ,ప్రాణం పోకడ ఎవరికి తెలుసు
విగ్రహపుష్టి నైవేద్యనష్టి
విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
విద్య లేని వాడు వింత పశువు
విధం చెడి వీటివాడితోపోతే బ్రతుకంతా మద్దెల వాయించవలసి వచ్చింది
వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
వినేవాడు వెర్రోడైతే ఒంటె కూడా వేదం చెపుతుంది
వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
వీపు విమానం మోత మోగుతుంది
వేగం కన్నా ప్ర్రాణం మిన్న
వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
వేపకాయంత వెర్రి
వేలుకు గోరడ్డం
వేలెడంత వాడు వచ్చి, జానెడంత వాణ్ణి చూసి, "మూరెడంత వాళ్ళు ఉన్నారు లేవోస్!" అన్నాడట
వైద్యోనారాయణోహరి
వ్రతం చెడ్డా ఫలితం దక్కింది
శూద్రుని పొట్ట తమలపాకుల కట్ట ఎప్పుడు తడుపుతు ఉండాలి
శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
శతకోటి లింగాలలో బోడిలింగం
శస్త్రుల వారింట పుట్టి, సోమయాజుల వారింట మెట్టి, లవణమంటే దూడ రేణమని (పేడని) ఎఱుగనా అన్నదిట
శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
శీలములేని సౌందర్యము తావిలేని పువ్వు వంటిది
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
శెట్టి సింగారించే సరికి పట్నం పాడైనట్లు.
శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
సిరికొద్దీ చిన్నెలూ, మొగుడుకొద్దీ వన్నెలూ
సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
సంతులేని ఇల్లు చావడి కొట్టం
సంతోషమే సగం బలం
సంపదలో మరపులు ఆపదలో అరుపులు
సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
సంసారం చేద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది
సకలం కుశలమే కానీ పైసలవసరం
సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
సత్రం భోజనం, మఠం నిద్ర
సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
సింగడు అద్దంకి వెళ్లినట్టు
సింగినాదం జీలకర్ర
సింగినాదం,జీలకర్ర ఏం కాదూ!
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది
సొమ్మొకడిది సోకొకడిది
హనుమంతుడి ముందా కుప్పిగంతులు?
హనుమంతుడు... అందగాడు
హరిశ్చద్రుడి నోట అబద్ధం రాదు, నా నోట నిజం రాదు
హేమా హేమీలే ఏట్లో కొట్టుకుపోయేరు, ఎంపలో దుంపా నీగతేంకాను
క్షణం చిత్తం, క్షణం పిత్తం
క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదు