Sunday, January 23, 2011

64 కళలు

ఇతిహాసాములు
ఆగమములు
కావ్యములు
అలంకారములు
నాటకములు
గానం
కవిత్వం
కామశాస్త్రం
దురోదరం
దేశభాష విజ్ఞానం
లిపి కర్మ
వాచకము
సర్వ విధ అవధానములు
స్వర శాస్త్రము
శకున శాస్త్రము
సాముద్రికము
రత్న శాస్త్రము
రథ కౌశలము
అశ్వ కౌశలము
గజ కౌశలము
మల్ల శాస్త్రము
సూద కర్మ
దోహదము
గంధవాదము
ధాతు వాదము
ఖని వాదము
రస వాదము
జల వాదము
అగ్ని స్తంభనం
ఖడ్గ స్తంభనం
జల స్తంభనం
వాక్ స్తంభనం
వయః స్తంభనం
వశీకరణం
ఆకర్షణము
మోహనము
విద్వేశము
ఉచ్చాటనము
మారణము
కాల వంచనము
పరకాయ ప్రవేశము
పాదుకా సిద్ధి
వాక్సిద్ది
ఇంద్ర జాలము
అంజనము
పర దృష్టి వంచనము
పర వంచనము
మణీ మంత్రౌశాధ సిద్దులు
చొర కర్మం
చిత్ర కర్మ
లోహ క్రియ
అస్మ క్రియ
మృత క్రియ
దారు క్రియ
వేణు క్రియ
చర్మ క్రియ
అంబర క్రియ
అదృశ్య కరణం
దండ కరణం
వాణిజ్యము
పాశుపల్యము
కృషి
ఆసవ కర్మ
లావకుక్కుట మేషాది యుద్ధ కారక కౌశలము

Saturday, January 22, 2011

మధుమేహానికి ఆయుర్వేద వైద్యం

ఆయుర్వేదం గుర్తించిన అనారోగ్య కారకాలలో మొదటిది వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గుండెజబ్బులు వంటి తదితర వ్యాధులు. వంశపారంపర్యంగా కాకుండా ఆరోగ్యపుటలవాట్లలో తేడావల్ల తలెత్తే వ్యాధులు ఉన్నాయి. నేటి ఆధునిక జీవితంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం.

ఆయుర్వేదం ప్రకారం కఫంలో తేడావల్ల మధుమేహం వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతులున్నాయి. మొదటగా ఆహారపుటలవాట్లు మార్చాలంటుందీ శాస్త్రం.

చక్కెర, పిండి పదార్థాలను ఆపి, ముడి బియ్యం, గోధుమ, ఓట్‌ల వంటి పదార్థాలను తినమంటుంది. మధుమేహం వచ్చిందని తెలియగానే చక్కెరలు, బియ్యం, బంగాళాదుంపలు, బెల్లం, చెరకు, తియ్యని పండ్లు వంటివన్నీ తీసుకోవడం తగ్గించాలి.

బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి, మరుసటి రోజు తేనెతో కలిపి రెండు మూడు దఫాలుగా తినాలి. జామ, జామ విత్తన పొడి తీసుకోవచ్చు. తాజా ఆకు కూరలు, పెసలు, సోయాను ఆహారంలో తీసుకోవచ్చు.

మెంతిపొడి రెండు స్పూన్లను పాలలో వేసుకుని తాగాలి. 15 నుంచి 20 తాజా మామిడాకులు ఒక గ్లాసు నీటిలో మరిగించి, ఆ రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున తాగాలి. శరీరానికి పొటాషియం, విటమిన్ సి, ఇ, బి కాంప్లెక్సులు ఎక్కువగా చేరేలా ఆహారపదార్థాలు తీసుకోవాలి.

అదేవిధంగా ప్రతి రోజూ ముదిరిన కరివేపాకు ఆకులు పదింటిని తినాలి. ఇలా మూడు నెలలపాటు పాటిస్తే... వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా చేసుకోవచ్చు. మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పసుపు, కలబంద జిగురులను కలిపి తీసుకుంటే క్లోమం, కాలేయ గ్రంథుల క్రియలు నియంత్రించబడతాయి. కాకర రసం లేదా నిమ్మ రసం తాగినా మేలు కలుగుతుంది.

తెలుగు సంవత్సరములు

తెలుగు సంవత్సరములు 60.

1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మధ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్రవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధీ
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్రవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్తి
53. సిధార్థ
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ

Tuesday, January 18, 2011

రాష్ట్ర చిహ్నాలు

రాష్ట్ర చిహ్నాలు
ఇది మన రాష్ట్రం "ఆంధ్ర ప్రదేశ్".
రాష్ట్ర గీతం "మా తెలుగు తల్లికి..."
రాష్ట్ర పుష్పం కలువ పువ్వు
రాష్ట్ర ముద్ర పూర్ణకుంభం
రాష్ట్ర మృగం కృష్ణ జింక
రాష్ట్ర పక్షి పాల పిట్ట

జాతీయ చిహ్నాలు

జాతీయ చిహ్నాలు
ఇది మన దేశం "భారతదేశం"
జాతీయ గీతం "జన గణ మన"
జాతీయ పుష్పం తామర పువ్వు
జాతీయ చిహ్నం మూడు సింహాలు
జాతీయ మృగం పులి
జాతీయ పక్షి నెమలి
జాతీయ జెండా
మూడు రంగుల జెండా

పిల్లలు నేర్చుకోవలసిన కొన్ని మంచి అలవాట్లు

చిన్న పిల్లలకు నేర్పవలసిన (పిల్లలు నేర్చుకోవలసిన) కొన్ని మంచి అలవాట్లు
  • వేకువ(తెల్లవారు) జామునే లేవటం.
  • లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం.
  • శుభ్రంగా పళ్ళు తోముకోవటం
  • శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం.
  • శుభ్రమైన బట్టలు ధరించటం.
  • చక్కగా తల దువ్వు కోవటం.
  • బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
  • బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి.
  • వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం.
  • బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి.
  • ఉపాధ్యాయులను గౌరవించటం.
  • సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం.
  • ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం.
  • ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి.
  • ఇంటి పని (హొం వర్క్) సరిగ్గా చేయటం.
  • ఇంటి పని (హొం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి.
  • అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం.
  • ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం.
  • భోజనం చేసే ముందు చేతులు కడుగుకోవటం.
  • భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం.
  • తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం.
  • ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి.
  • టి.వి. చూసేటప్పుడు టి. వి. కి దగ్గరగా కూర్చోవద్దు.
  • నీళ్ళు వృధా చేయవద్దు.
  • నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి.
  • రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
  • ఆటలు ఆడుకునేటప్పుడు మిగిలిన వారితో గొడవ పడకూడదు.
  • పెద్దలను గౌరవించటం.
  • పెద్ద వారు ఎదురైనప్పుడు నమస్కారం చేయటం.
  • ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం.
  • పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం.
  • నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు.
  • గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు.
  • కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు.
  • ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి.
  • పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి.
  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం.
  • అసత్యం ఆడకూడదు.
  • ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము.
  • ఒకరి మీద చాడీలు చెప్పరాదు.
  • జీవహింస చేయరాదు.
  • తనను తాను పొగడు కొనరాదు.
  • తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు .
  • విద్య చెప్పిన వారిని మరువరాదు.
  • పెద్దల మాటలు వినవలెను.
  • పేదల మీద దయ ఉంచవెలెను.
  • స్వామి యందు భక్తి నుంచుము.
  • సజ్జనులతో స్నేహము చేయవలెను.
  • ఎల్లప్పుడూ దైవచింతన చేయుము.
  • నమ్మిన వారిని మోసం చేయరాదు.

బార్ కోడ్స్

మనం నిత్యం వాడుకొనే రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్ లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను చూస్తూ ఉంటాం. ఆ నల్లని గీతలు ఏంటి, ఎలా వస్తాయి, ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
  • రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్‌లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను 'బార్ కోడ్స్' అంటారు.
  • వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి.
  • ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి. స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి.
  • బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి. బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్) 12 అంకెల్లో ఉంటుంది.
  • ఇందులో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశపు కోడ్‌ను, తర్వాత అయిదు అంకెలు ఉత్పత్తిదారు కోడ్‌ను, ఆ తర్వాత అయిదు అంకెలు వస్తువు వివరాలను తెలుపుతాయి. చివరి అంకె ఆ కోడ్ కచ్చితత్వాన్ని చెబుతుంది. కంప్యూటర్‌లోకి ముందుగానే ఎక్కించిన వివరాలన్నీ ఈ కోడ్‌ను స్కానర్ చదవగానే తెరపై కనిపిస్తాయి.
  • ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేరువేరుగా చూసుకోవడం, వాటి ధరలను విడివిడిగా రాయడం వంటి పనులు తప్పి సమయం ఆదా అవుతుంది. రోజు మొత్తం మీద ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో, ఆదాయమెంతో లాంటి వివరాలు కూడా కచ్చితంగా క్షణాలమీద తెలుస్తుంది.

పిల్లల పేర్లు(ఆడ)

అ,ఆ
అంకిత, అంగన, అంజన, అంజనా కుమారి, అంజలి, అంజలీ దేవి, అంబుజేశ్వరి, అక్షత, అక్షిత, అక్షిణ, అఖిల, అఖిలేశ్వరి, అగ్రణి, అచిరహాస, అచ్చమ్మ, అచ్యుత, అజిత, అతిరమ్య, అతులిత, అత్యుజ్వల, అత్రి, అనంత, అనంత నాగిని, అనంత వల్లి కుమారి, అనంత హర్ష, అనన్య, అనల్ప, అనసూయ, అనామిక, అనిత, అనీష, అనుఙ్ఞ, అనుపద్య, అనుపమ, అనుప్రియ, అనురంజని, అనురక్త, అనురాగ, అనులేఖ, అనుష్క, అనూజ, అనూరాధ, అనూష, అన్నపూర్ణ, అన్మిష, అన్వేష, అపరంజి, అపర్ణ, అపూర్వ, అప్సర, అబిదా, అబ్దిజ, అభిన, అభిసారిక, అభీష్ట, అమరకుమారి, అమరాంబిక, అమరేశ్వరి, అమల, అమిత, అమృత, అమృతవల్లి, అమ్మణ్ణి, అమ్రేషి, అరణి, అరవింద, అరుంధతి, అరుణా, అరుణిమ, అర్చన, అర్పణ, అర్పిత, అర్బుదా, అలంకృత, అలకా నంద, అలిమేలుమంగ, అలివేణి, అలేఖ్య, అలోత్తమ, అల్తియా, అల్పన, అవంతి, అవతరిణి, అవధి, అశేష, అశ్వినీకుమారి, అశ్విని, అషిత, అష్మిత, అహిరేశ్వరి, ఆకర్షిణి, ఆకాంక్ష, ఆకృతి, ఆదర్శ, ఆదర్శ లక్ష్మి, ఆదిలక్ష్మి, ఆనంద చంద్రిక, ఆనందినీ, ఆమని, ఆరతి, ఆర్తి, ఆశ, ఆశా గీతి, ఆశా జ్యోతి, ఆశారాణి, ఆశారేఖ, ఆశాలత, ఆశ్రిత, ఆశ్లేషని, ఆష, ఆహ్లాదినీ.
ఇ,ఈ
ఇంతి, ఇందిర, ఇందిరావతి, ఇందిరామణి, ఇందీవరాక్షి, ఇందు, ఇందుబాల, ఇందుమణి, ఇందుముఖి, ఇందులత, ఇందులేఖ, ఇందువదన, ఇందుశేఖరి, ఇందుజ, ఇందుభోగావతి, ఇందుమతి, ఇందుముఖి, ఇందుమైత్రి, ఇందురమణి, ఇందులక్ష్మి, ఇందులలిత, ఇందువాణి, ఇందూరాణి, ఇంద్రగమన, ఇంద్రజాల , ఇంద్రనీల, ఇంద్రమ్మ, ఇంద్రాణి, ఇంద్రాయణి, ఇంద్రి, ఇంద్రేశ్వరి, ఇతిహాస, ఇనముక్త, ఇనశేఖరి, ఇష్ట, ఇష్మ, ఈక్షిత, ఈశ్వరమ్మ, ఈశ్వరాంబ, ఈశ్వరి, ఈశ్వరీ దేవి, ఈశ్వరీవదన, ఈషానంద.
ఉ, ఊ
ఉజాలా, ఉజ్వల, ఉజ్వలరేఖ, ఉత్కళ, ఉత్తర, ఉత్ప్రేక్ష, ఉత్సాహిత, ఉత్సాహిని, ఉదయ, ఉదయకుమారి, ఉదయభాను, ఉదయరేఖ, ఉదయబాల, ఉదయరాణి, ఉదయరూప, ఉదయలక్ష్మి, ఉదయశోభ, ఉదయసుధ, ఉదయసూర్య, ఉదయాభిరామి, ఉదయిని, ఉదయేశ్వరి, ఉదిత, ఉదయలక్ష్మి, ఉదయశోభ, ఉదయసుధ, ఉదయసూర్య, ఉదయాభిరామి, ఉదయిని, ఉదయేశ్వరి, ఉద్యమ, ఉద్యరంజని, ఉన్నత, ఉన్నతి, ఉన్నిత, ఉపమన్యు, ఉపేక్ష, ఉభయకుమారి, ఉమాంగిని, ఉమాకాంత, ఉమానాయకి, ఉమామహేశ్వరి, ఉమారమ్య, ఉమాలత, ఉమాశంకరి, ఉర్విజ, ఉల్పియ, ఉషశ్విని, ఉషాసంధ్య, ఉషాబాల, ఉషాభాను, ఉషారాణి, ఉషారోహిణి, ఉషాశాలిని, ఉషాశోభ, ఉషాసుందరి, ఉషేశ్వరి, ఉషోదయ, ఊర్మిక, ఊర్మిళ, ఊర్వశి, ఊర్షిల, ఊహ.
ఋ నుంచి ఔ
ఋచిత, ఋతు, ౠత్యూష, ౠషిత, ౠష్యుక్త, ఎరీన, ఎర్రమ్మ, ఎల్లమ్మ, ఎల్లోర, ఎస్తర్, ఏంజలినా, ఏకదీప, ఏకదేవి, ఏకతా, ఏకదంతేశ్వరి, ఏకాంత, ఏకావళి, ఏకేశ్వరి, ఏక్త, ఏక్రామేశ్వరి, ఏలావని, ఏలిష, ఐక్య, ఐశ్వర్య, ఐరావతి, ఐశ్వర్యారాయ్, ఒనితా, ఓంకారమాలిని, ఓం కారమంజరి, ఓం హారిక, ఓంకారి, ఓంకారిణి, ఓంకుమారి, ఓంశాంతి, ఓజశ్విని, ఔషది.
క నుంచి గ వరకు
కనక, కుసుమ, కనకదుర్గ, కనకబాల, కనకరత్న , కనకరేఖ, కనకం, కనకవల్లి, కనకాంజలి, కన్నమ్మ, కన్య, కన్య కుమారి, కన్యక, కన్యకాంబ, కన్యకాపరమేశ్వరి, కమనీయ, కమల, కమలదీప, కమలాక్షి, కరిష్మ, కరుణ, కర్న, కల్పలత, కల్పవల్లి, కళాప్రియ, కళాంజలి, కళావల్లి, కవిత, కస్తూరి, కాంచన, కాంతం, కాంతమ్మ, కాంతి, కాత్యాయని, కాదంబరి, కామాక్షి, కామిని, కామేశ్వరి, కారుణ్య, కాళిక, కాశ్వీర, కిన్నెర, కిరణ్మయి, కిషోరి, కీర్తిక, కుంజల, కుంతల, కుందన, కుమారి, కుముద, కుయలి, కుశల, కుశాలి, కుష్బూ, కుసుమదుర్గా, కృప, కృపాలత, కృపాలిని, కృష్ణ, కృష్ణ కుమారి, కృష్ణ ప్రియ, కృష్ణజ, కృష్ణవేణి, కేతిక, కేదారేశ్వరి, కేళని, కేసరిరమ్య, కైకేయి, కొమిల్లా, కోకిల, కోటమ్మ, కోటేశ్వరి, కోమల, కోమలాలత, కోమలి, కోవిద, కౌమారి, కౌలంబి, కౌసల్య , ఖండిత, ఖ్యాతి.
గంగ, గంగన, గంగమ్మ, గంగాప్రియ, గంగాళమ్మ, గంగోత్రి, గంభీర, గజకేసరి, గజలక్ష్మి, గజల్, గజాల, గమన, గాంధర్వి, గాంధారి, గాజులమ్మ, గాయత్రి, గాయని, గారవి, గాలవ్య, గిరిజ, గిరిజానందిని, గిరిజాబాల, గిరిదుర్గ, గిరిదేవి, గిరీశ్వరి, గీత, గీతగోవిందం, గీతబాల, గీతమాలిక, గీతాశ్రీ, గీతాంజలి, గీతామల్లిక, గీతారంజని, గీతాలత, గీతావని, గీతిక, గీర్వాణి, గుండమ్మ, గుణ, గుణప్రియ, గుణరత్న, గుణవతి, గుణశీలి, గుణసుందరి, గుణాళి, గురుకృప, గురువర్దని, గొంగేశ్వరి, గోకర్ణ, గోదాదేవి, గోదావరి, గోపబాల, గోపాంబిక, గోపాలరమ్య, గోపాలి, గోపిక, గోపికానందిని, గోపికారాణి, గోపిచందన, గోపెమ్మ, గోమతి, గోమతీలత, గోవర్దని, గోవిందమ్మ, గౌతమి, గౌతమిదేవి, గౌరవల్లి, గౌరి, గౌరినాయకి, గౌరిలక్ష్మి, ఘటిక, ఘనతన్వి, ఘనప్రియ.
చ నుంచి జ వరకు
చంచల, చంచిత, చంటీ, చండిక, చండీప్రియ, చందన, చందనాంజలి, చందిని, చంద్ర, చంద్రశేఖరి, చంద్రకాంత, చంద్రధార, చంద్రముఖి, చంద్రసుధ, చంద్రా, చంద్రాకలి, చంద్రిక, చంప, చంపకరత్న, చంబలరాణి, చకోరి, చక్ర, చక్రి, చరణి, చరిత, చరిత్ర, చర్చిత, చాందిని, చాతురి, చామంతి, చామరి, చాముండి, చాముండేశ్వరి, చాయ, చారుమతి, చారుశీల, చారుహాస, చార్మి, చింతన, చింతాణి, చింతామణి, చిందేశ్వరి, చిట్టి, చిట్టిబాల, చిత్ర, చిత్రమేఖల, చిత్రాంగి, చిత్రావతి, చినబాల, చిలకమ్మ, చెంచులక్ష్మి, చెండేశ్వరి, చెల్లమ్మ, చేతన, చైతన్య, చైతన్యలక్ష్మి, చోడి, చౌడేశ్వరి, ఛాయని, ఛాయాదేవి, ఛాయాలత.
జక్కమ్మ, జగదాంబ, జగదీశ్వరి, జగ్గమ్మ, జనప్రియ, జనమిత్ర, జమీల, జమున, జయ, జయ కుమారి, జయంతి, జయంతీదేవి, జయచిత్ర, జయదీప, జయనరసి, జయపద్మ, జయప్రద, జయప్రియ, జయభారతి, జయమాల, జయమ్మ, జయరాణి, జయలక్ష్మీ, జయవర్ణ, జయవర్ధిని, జయవాణి, జయశీల, జయశ్రీ, జయశ్రీచిత్ర, జయసునీత, జయసురేఖ, జరీనా, జలజ, జలసుందరి, జశ్వంతి, జస్మిత, జాగృతజ్యోతి, జాగృతి, జానకి, జానక్య , జాస్మిన్, జాహ్నవి, జీవనజ్యోతి, జీవిత, జెహానా, జైనీ, జోగేశ్వరి, జ్ఞానప్రసూన, జ్ఞానాంబిక, జ్ఞానజ్యోతి, జ్ఞానేశ్వరి, జ్యోతి, జ్యోతిక, జ్యోతిరాత్మ, జ్యోతిర్లత, జ్యోతిష్య, జ్వాల, జ్వాలరేఖ, ఝష్ణ, ఝాన్సీ, ఝాన్సీరాణి, ఝుమా.
టుంటుం, టేనా, ట్వింకిల్, టాన్యా, ట్యాసి, టస్లి, ట్రేసి, ట్రిమా, టోకియా, టింపుల్, టాముర్నియా.
డాలీ, డింపుల్, డయానా, డోరిస్, డైసీ, డెల్లా, డింకి, డార్నిల్, డోరియా, డెలిలా.
నుంచి న వరకు
తనూజ, తనూజాత, తనూభవ, తనూలత, తన్మయత, తన్మయి, తపతి, తమన్నా, తమలి, తరంగణి, తరీక, తస్వీర, తానూజిని, తాన్య, తాపసి, తాయారమ్మ, తారక, తారకరామి, తారకలీల, తారకేశ్వరి, తారా, తారాజ్యోతి, తారాదేవి, తారాబలి, తారామతి, తారాయిణి, తిరుమల, తిరుమలమ్మ, తిరుమలేశ్వరి, తిరువనంత, తిలోత్తమ, తీయ, తీర్ధ, తులశమ్మ, తులసి, తులసిమోహిని, తులసీబృంద, తులసీలత, తుషార, తృప్తి, తృష్ణ, తేజస్విని, తేజస్విని కుమారి, తేజోవతి, తేజ్వంతి, తోరణి, త్రయంబిక, త్రినేత్ర, త్రినేత్రిక, త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, త్రివేణి, త్రివేదిక.
దమయంతి, దర్పణ, దర్శన, దాక్షాయిణి, దానమ్మ, దానవతి, దిగ్న, దిలీప, దివ్య, దివ్యభారతి, దివ్యజ్యోతి, దివ్యదిలీప, దివ్యదీప, దివ్యనయన, దివ్యభాను, దివ్యమంజరి, దివ్యమంజుల, దివ్యరమ, దివ్యరాణి, దివ్యవందన, దివ్యవదన, దివ్యవాణి, దివ్యసుందరి, దివ్యాంజలి, దివ్యానంత, దిసుమతి, దీనమ్మ, దీనా, దీప, దీపకుమారి, దీపజ్యోతి, దీపనందిని, దీపవిత్ర, దీపసుందరి, దీపాంజలి, దీపిక, దీపికామణి, దీపికాముంజు, దీప్తి , దీమ, దుర్గమ్మ, దుర్గా, దుర్గానందిని, దుర్గాభాయి, దుర్గాలీల, దుర్గాశంకరి, దుహిత, దేదీప్య, దేవయాని, దేవి, దేవిక, దేవిబాల, దేవిశ్రీ, దేవీప్రియ, దేవేరి, ద్రౌపతి, ధనమ్మ, ధనలక్ష్మి, ధన్య, ధన్యసుధ, ధరంధరి, ధరణి, ధరణిబాల, ధరమిత్ర, ధరిత్రి, ధర్మి, ధాత్రి, ధారణి, ధీరజ, ధీరబాల, ధీరసుధ, ధృవతార, ధృవిత, ధైర్యలక్ష్మి.
నంద, నందన, నందనారాయణి, నందాదేవి, నందిత, నందిని, నగ్మా, నజరానా, నజియ, నటవసంత, నటాషా, నమిత, నమ్రత, నయన, నర్మద, నలంద, నళిన, నవత, నవనీత, నవమ్మ, నవీన, నవీనలత, నవ్య, నవ్యతేజ, నవ్యాధర్మ, నాంచారి, నాగజమున, నాగజ్యోతి, నాగదుర్గ, నాగప్రియ, నాగమణి, నాగమల్లి, నాగమ్మ, నాగరత్నం, నాగరాణి, నాగరోజా, నాగలక్ష్మి, నాగలింగేశ్వరి, నాగవరలక్ష్మి, నాగవల్లి, నాగవసంత, నాగశ్రీ, నాగసీత, నాగిని, నాగేంద్రమ్మ, నాగేశ్వరమ్మ, నాగేశ్వరి, నారమ్మ, నారాయణమ్మ, నారాయణి, నాళిక, నిఖిత, నిఖిల, నిజీమ్, నిత్య, నిత్యతేజ, నిమీష, నిమ్మి, నిమ్షిత, నిరంజని, నిరీక్షణ, నిరుపమ, నిరుపమలీల, నిరూప, నిరోష, నిర్జల, నిర్మల, నిర్మిత, నిర్మోహన, నివేదన, నివేదిత, నిశాంతి, నిషా, నిషిత, నిషిమి, నిహాల్, నీత, నీతిక, నీరజ, నీరజాంబ, నీరా, నీల, నీలమణీ, నీలవతి, నీలవేణి, నీలాంబరి, నీలాంబిక, నీలాక్షి, నీలిమ, నూకాలమ్మ, నూకాలు, నేత్ర, నేహ, నైత్రిక, నైవేదిత, నోయెల.
నుంచి మ వరకు
పంకజం, పద్మ, పద్మకేసరి, పద్మజారాణి, పద్మాదేవి, పద్మానంద, పద్మావతి, పరమేశ్వరి, పరిమళ, పరీక్షిత, పల్లవి, పల్లవిక, పల్లవికుమారి, పవిత్ర, పాండురంగమ్మ, పాదుక, పాప, పాపమ్మ, పాపాయమ్మ, పార్వతి, పావనశ్రీ, పావని, పుల్లమ్మ, పుష్పమాల, పుష్పలత, పుష్పావతి, పుష్య, పూజా, పూజిత, పూనం, పూర్ణ, పూర్ణరేఖ, పూర్ణమ్మ, పూర్ణవేఖరి, పూర్ణిమ, పెరియమ్మ, పేరమ్మ, పౌర్ణమి, ప్రకృతి, ప్రగతి, ప్రజ్ఞ , ప్రణతి, ప్రణవ, ప్రణవకుమారి, ప్రతిభ, ప్రతిభాకుమారి, ప్రతిమ, ప్రదీపిక, ప్రపూర్ణ, ప్రబుద్ది, ప్రమీల, ప్రమోదిని, ప్రవళిక, ప్రవీణ, ప్రవీణిత, ప్రశాంతి, ప్రసన్న, ప్రసూన, ప్రసూనాంబ, ప్రియంవద, ప్రియదర్శిని, ప్రియవందన, ప్రియవర్ధని, ప్రీతి, ప్రీతిజంగానియ, ప్రీతిజింత, ప్రేమ, ప్రేమకుమారి, ప్రేమదేవి, ప్రేమలత, ఫణి, ఫణిదీపిక.
బంగారమ్మ, బందన, బందిని, బదనిక, బబిత, బలదేవనందిని, బసంతి, బసవమ్మ, బానూ, బాపనమ్మ, బాల, బాలకోటమ్మ, బాలగంగ, బాలత్రిపురి, బాలమణి, బాలమ్మ, బాలరంజని, బాలరత్న, బాలరత్నం, బాలాత్రిపుర, బాలామణీ, బిందు, బినీత, బిబూతి, బీనా, బృంద, బైదేహి, బోనిత, బోస్కి, బ్రమర, బ్రాహ్మి, భగవతి, భగవతిమిత్ర, భజన, భద్ర, భద్రావతి, భరణి, భవాని, భవానిదుర్గ, భవానీకుమారి, భవ్య, భాగవతి, భాగ్య, భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి, భాను, భానుమతి, భామా, భామామణి, భామిని, భారతి, భార్గవి, భావన, భావనకుమారి, భావనరత్న, భావనలత, భావి, భువనమోహన, భువనేశ్వరి, భైరవి, భ్రమరగీత.
మంగ, మంగతాయారు, మంగళ, మంజీర, మంజుబాయి, మంజుల, మంజులత, మంజూష, మమత, మహిమ, మైన, ముగ్ద, ముక్త, మైత్రి, మౌష్మి, మనోజ్ఞ, మరాళి, మిధుల, మేఖల, మేఘల, మోహిత, మౌక్తిక, మృదుల, మంగళ, మందిర, మానస, మేఘన, మాధురి, మాధుర్య, మౌనిక, మైత్రేయ, మంజరి, మాణిక్యం, మణి, మాల్యద, మౌనిక, మౌనిష, మహంతి.
య నుంచి ఱ వరకు
యక్షణ, యక్షిణి, యమున, యల్లమ్మ, యవ్వని, యశస్విని, యశోద, యశోధర, యశ్వంత, యాగ్నిక, యాఘ్న, యాదగిరమ్మ, యాదమ్మ, యామిని, యామినీపుష్ప, యువతి, యువరాణి, యోగకుసుమ, యోగప్రియ, యోగమల్లిక, యోగలక్ష్మి, యోగవల్లి, యోగానందిత, యోగిత, యోగిని, యోగేశ్వరి.
రంగ, రంగమణి, రంగమ్మ, రంజని, రంభ, రక్షా, రచిత, రజనీప్రియ, రజనీవందన, రజిత, రజిని, రతి, రతీకుమారి, రత్న, రత్నాంబ, రాధ, రమ, రమణి, రమాదేవి, రమాప్రభ, రమ్య, రమ్యకృష్ణ, రమ్యరస, రవళి, రాకేషి, రాగిణి, రాఘవమ్మ, రాజకుమారి, రాజమ్మ, రాజశ్రీ, రాజ్యం, రాజ్యలక్ష్మి, రాణి, రాధా, రాధాదేవి, రాధిక, రామప్రియ, రామరత్న, రామలక్ష్మి, రామలింగేశ్వరి, రామిని, రాములమ్మ, రామేశ్వరి, రావమ్మ, రాశి, రిచా, రిత్యా, రీన, రీనా, రూప, రూపచిత్ర, రూపవతి, రూపిని, రేఖ, రేణుక, రేవతి, రేష్మ, రోజా, రోజామణి, రోజారమణి, రోషి, రోషిణి, రోహిణి.
లకుమా, లకుమాదేవి, లక్కీ, లక్య, లక్ష్మణకుమారి, లక్ష్మి, లక్ష్మికళ, లక్ష్మిచంద్ర, లక్ష్మిదేవమ్మ, లక్ష్మిదేవి, లక్ష్మినరసమ్మ, లక్ష్మిరమ్య, లక్ష్మీకనక, లక్ష్మీకాంత, లక్ష్మీకాంతి, లక్ష్మీదీప, లక్ష్మీదుర్గ, లక్ష్మీరంజని, లక్ష్మీవాణి, లక్ష్మీహేమ, లక్ష్య, లత, లతంగి, లతాంగి, లతిక, లలిత, లలితమ్మ, లలితాంజలి, లలితాంబ, లలితాంబిక, లలితాదేవి, లలితారమ, లలితాసాగరి, లాచిన, లాలస, లాలిత్య, లావణ్య, లావణ్యజ్యోతి, లిఖిత, లీలావతి, లిల్లీ, లీనా, లీలమ్మ, లీలా, లీలాకుమారి, లీలాగోవింద, లీలాజ్యోతి, లీలాపద్మజ, లీలాబృంద, లీలాభాస్కర, లీలామంగళ, లీలామల్లిక, లీలారమ, లీలావతి, లీలావని, లీలాసరస్వతి, లీలాసుధ, లీస, లేఖ, లైలా, లోకవందిత, లోకేశ్వరి, లోచన, లోచని, లోలకి, లోలిత.
వందన, వత్సల, వనకమల, వనజ, వనపద్మ, వనమాలి, వనరఖ, వరమ్మ, వరలక్ష్మి, వరాలు, వల్లభవసంత, వసుధ, వసుమతి, వహిదా, వాసంతి, వాసవి, వాసవిదత్త, వాహిని, విఘ్నేశ్వరి, విజయ, విజయలక్ష్మి, విజయదుర్గ, విజయవర్ధని, విజయశాంతి, విజయశ్రీ, విజయసాగరి, విజయేశ్వరి, విజేత, విద్య, విద్యాభారతి, విద్యావతి, విద్యావాహిని, విద్యావిజయ, వినయ, వినీల, వినూత్న, వినోదిని, విన్ని, విభూతి, విమల, విమ్మి, వివేక, విశాలి, విష్ణుప్రియ, విహారి, వీణా, వెంకటపద్మ, వెంకటమ్మ, వెన్నెల, వేదవతి, వైజయంతి, వైదేహి, వైవిజయ, వైశాలి, వైష్ణవి.
శంకరమ్మ, శంకరి, శకుంతల, శతావరి, శబరి, శమంత, శరణ్య, శర్వాణి, శశి, శశి ప్రభ, శశిరేఖ, శశివదన, శాంతమ్మ, శాంతి, శాంతి ప్రియ, శారద, శార్వాణి, శాలిని, శిరీష, శివ ప్రియ, శివలీల, శీల, శుభనయన, శుష్మ, శృతి, శేషాంబ, శేషు, శైలజ, శోధన, శోభ, శోభన, శోభిత, శ్యామ, శ్రద్ధ, శ్రావణి, శ్రావ్య, శ్రీకన్య, శ్రీజ, శ్రీనిథి, శ్రీలత, శ్రీలేఖ, శ్రీవల్లి, శ్రీవాణి, శ్రీవాసవి, శ్రీహిత, శ్వేత.
షామిలి, షబీన, షర్మిల, షహిద, షాలిని.
సత్య, సత్యకమల, సత్యదీప, సత్యమణి, సత్యముత్తు, సత్యవతి, సత్యసుందరి, సత్యాంబకి, సరోజనమ్మ, సరోజని, సర్వమ్మ, సాయి, సాయిసుధ, సింగారి, సింధు, సింధూర, సింధూరి, సినీల, సిమ్రాన్, సీత, సీతమ్మ, సీతామహాలక్ష్మి, సీతారావమ్మ, సీతాలత, సీతాలు, సీమ, సుజాత, సుజిత, సుధ, సునీత, సుబ్బరత్నం, సుబ్బరామి, సుమతి, సుమతీనంద, సుమిత్ర, సూరమ్మ, సోని, సోమ, సోమలత, సౌజన్య.
హంస, హంసగామి, హంసవాహిని, హరిత, హర్షి, హర్షిణి, హర్షిత, హానిక, హారతి, హారిక, హాస, హాసిక, హాసిని, హిందూజ, హిత, హిమ, హిమజ, హిమజ్వాల, హిమద, హిమబిందు, హిమవతి, హిమాబాల, హీరా, హృదయ.

నక్షత్రాలు

అశ్విని - చూ - చే- చో - ల
భరణి - లి - లూ - లే - లో
కృత్తిక - ఆ - ఈ- ఊ - ఏ
రోహిణి - ఓ - వా - వీ - వూ
మృగశిర - వే - వో - కా - కి
ఆరుద్ర - కూ - ఖం - జ - చ్చా
పునర్వసు - కే - కో - హా - హీ
పుష్యమి - హూ - పే - హో - డా
ఆశ్లేష - డి - డు - డె - డో
మఖ - మా - మీ - మూ - మే
పుబ్బ - మో - టా - టీ - టూ
ఉత్తర - టే - టో - పా - పీ
హస్త - పూ - ష - ణా - ఠా
చిత్త - పే - పో - రా - రీ
స్వాతి రూ రే - రో - త
విశాఖ - తీ - తూ - తే - తో
అనూరాధా - నొ - నీ - నూ - నే
జ్యేష్ఠ - నో - యా - యీ - యూ
మూల - యే - యో - బా - బి
పూర్వాషాఢ - బూ - ధా - భా - ధా
ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ
శ్రవణం - జూ - జే - జో - ఖా
ధనిష్ట - గా- గీ - గూ - గే
శతభిషం - గో - సా - సీ - సూ
పూర్వాభాద్ర - సే - సో దా - దీ
ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా
రేవతి - దే - దో - చా - చీ

జుట్టుకు, తలకు సౌందర్య పోషణ

సౌందర్య పోషణ
జుట్టుకు, తలకు
  • ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
· ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
· ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.
· గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.
· తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకుని, మృదువైన షాంపూ తో తలస్నానం చేయండి. జుట్టు పొడిబారటం తగ్గుతుంది.
  • తలకు గోరింటాకు పెట్టుకునే ముందుదానిలో కొద్దిగా బీట్ రూట్ రసాన్ని కలిపితే జుట్టుకు మంచి మెరుపుతో పాటు రాగిరంగు ఛాయ వస్తుంది.
· నీళ్ళలో కలిపిన ఆపిల్ జూస్ ను తరచూ తలకి రుద్దుకుంటే చుండ్రు పోతుంది.
· పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలా పావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.
  • పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.
· పారిజాతం గింజల్లోని పప్పును వేరు చేసి బాగా దంచి తలకు పట్టించాలి. పావు గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రుతగ్గిపోతుంది.
· పలుచని జుట్టు తరచూ రాలిపోయే జుట్టుతో బాధపడేవారు గోరువెచ్చటి ఆలివ్ లేదా బాదం నూనెతో మర్దన చేసుకుంటే సరి.
  • బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
  • మెంతికూర ఆకుల్ని మెత్తగా నూరి దానిని తలకుట్టిస్తుంటే జుట్టు బాగా పెరుగుతుంది. నల్లటి రంగు నిలబడుతుంది.
  • వారానికి ఒకసారి తలకు పుదీనా పేస్ట్ రాసుకుని ఇరవై నిముషాల పాటు ఉంచుకుని కడిగేస్తే చుండ్రు పోతుంది.
· సీకాయ పొడిలో కాస్త మజ్జిగ కలిపి తలంటుకుంటే జుట్టుకు మంచిది.

ముఖానికి సౌందర్య పోషణ

సౌందర్య పోషణ
ముఖానికి
  • మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుమానుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది.
  • కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
  • ఒక కప్పు పుదీనా ఆకులను రెండు కప్పుల నీళ్లలో ఉడికించి చల్లారిన తరువాత ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం తెల్లబడుతుంది.
  • ముల్లంగి రసం, పెరుగు కలిపి ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి రెండుసార్లు ముఖానికి, చేతులకీ రాసుకుంటే ఎండ వల్ల వచ్చిన నలుపుదనం పోతుంది.
  • మిగిలిపండిన టమోటా రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకుని 20 నిముషాల తరువాత కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
  • పాలలో నానేసిన గులాబీరేకులను ముఖం మీద రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత కడుక్కుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
  • బంగాళదుంప ముక్కతో తరచుగా ముఖాన్ని, ముఖ్యంగా కళ్ల కింది భాగంలో రాసుకుంటుండాలి. ఇలా రాసుకుని కొద్దిసేపటి తరువాత చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల కళ్ల కింది నల్లని వలయాలు మాయమై ముఖం మెరుపు లీనుతుంది.
  • కొద్దిపాటి ఆముదాన్ని తేనెలో కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మొటిమలు తగ్గే అవకాశం ఉంది.
  • పుచ్చకాయరసాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చన్నీళ్ళతో కడుక్కుంటే చర్మం తాజాగా ఉంటుంది.
  • చక్రాల్లా తరిగిన కీరా ముక్కలతో ముఖమంతా రుద్దాలి. ఐదు నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ముఖంపై మురికి తొలగిపోయి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
  • టమాటా గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌లా పని చేస్తుంది.
  • రెండు చెంచాల బాదంపొడి, అరచెంచా నిమ్మరసం, రెండుచెంచాల తేనెను బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
  • రాత్రి పడుకునే ముందు తాజా నిమ్మరసాన్ని ముఖానికి మర్దన చేసి ఐదు నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి. నిమ్మ మంచి యాస్ట్రింజెంట్ గా... బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.
  • ముఖంపై ముడతలు పోవాలంటే గిoజలు లేని ద్రాక్ష చక్కని పరిష్కారం. సగం కోసిన ద్రాక్ష ముక్కను ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.
  • అరటిపండు గుజ్జుకు సరిపడా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, కురులకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే కొత్త మెరుపు వస్తుంది.
  • ఉప్పు, పంచదార సమపాళ్ళలో తీసుకోవాలి. ఈ రెండు కరిగేలా కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ సమస్యకు ఇది సులువైన పరిష్కారం.
  • ఉసిరిరసం, పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముడతలు పడిన చర్మానికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
  • ఆపిల్ గుజ్జు తీసుకొని తేనె లేదా పాలు కలిపితే అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారవుతుంది.
  • అరటి గుజ్జు, తేనె లేదా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. చర్మం నునుపు తేలుతుంది.
  • చర్మంపై ముడతలను పోగొట్టడానికి క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జులో బాదం ఆయిల్, తేనె కలిపి రాయాలి.
  • నిమ్మకాయ రసం చర్మంపై ముడతలను, తలలో చుండ్రును పోగొడుతుంది.
  • చాలా సౌందర్య చికిత్సల్లో ఉల్లిని వాడతారు. ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
  • ఆలు ఉడకబెట్టి గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం అందంగా తయారవుతుంది.
  • టేబుల్ స్పూన్ తేనెకు పావు చెంచా క్యారెట్ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తీసేయాలి. దీనివల్ల ముడతలు పోవడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది.
  • ఎండకు ముఖ చర్మం కములుతుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టమాట రసం, నాలుగు టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకుని రెండిటిని బాగా కలిపి కమిలిన ప్రాంతాల్లో రాయాలి. అరగంటాగి చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితముంటుంది.
  • ఆలోవెరాకు చిటెకెడు గంధంపొడి కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల తాలూక మచ్చలు, ముడుతలు పోయి ముఖం నునుపుతేలుతుంది.
  • మెత్తగా పండిన అరటి పండు గుజ్జును ముఖానికి ప్యాక్ లా వేసుకుని అరాక చల్లని నీటితో కడిగేయండి. ముడతలకిది చక్కని పరిష్కారం.
  • ఎండలో బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు టమాటా రసం తాగితే వేడి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
  • చెంచా టమాటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ పై రాసుకున్నా చక్కని ఫలితం ఉంటుంది.
  • టమాటాకు కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి రాసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
  • టమాటా రసానికి కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి చక్కటి పరిష్కారం.
  • ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి... తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని మొఖానికి పట్టిస్తే...మొటిమలు మటుమాయం.
  • వేసవి ఎండలో బయట తిరిగే వారు రోజూ రెండు మూడు సార్లు మంచి ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి.
  • కాస్మటిక్ స్పాంజ్లు, మేకప్ బ్రష్ లను రెండు నెలలకోసారి మార్చాలి. లేకపోతే వాటి మీద బ్యాక్టీరియా తయారై చర్మానికి హాని చేస్తుంది. మేకప్ బ్రష్ లను కూడా నెలకోసారి మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి. నీడపట్టునే తడి ఆరిపోయేదాకా ఉంచి ఆ తర్వాత వాడుకోండి.
  • రోజు రెండు, మూడు సార్లు ముఖాన్ని మంచి నీటితో కడగాలి. ముఖాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునేముందు తప్పకుండా మంచి ఔషధ గుణాలున్న సబ్బు నురగను సబ్బుతో మచ్చలపై మృదువుగా రాసి కడగాలి.
  • అప్పుడప్పుడు ఫేషియల్స్ చేయించుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గి చర్మం నునుపుతేలుతుంది.
  • ముఖాన మొటిమలుంటే ముందుగా రోజ్ వాటర్, కర్పూరం కలిపిన నీటితో కడగాలి. టమాటాని అడ్డంగా కోసి ఆ సగం చక్క తో ముఖమంతా రుద్దాలి. దాంతో జిడ్డుతగ్గుతుంది. ఇప్పుడు గంధం పొడిలో కొంచం కర్పూరం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే హాయిగా ఉంటుంది.
  • పొడిబారినట్లున్న చర్మానికి తేనె, ఆలివ్ నూనె, పసుపు, గంధంపొడి కలిపి రాసి ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి.
  • గంధం పొడి, పసుపు, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం మెరిసి పోతుంటుంది.
  • బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్ లా వేసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైంలు చర్మంలో మృతకణాలను తొలగించి మీ చర్మానికి కొత్త కాంతి నిస్తాయి.
  • ముల్తాన మట్టికి కొంచెం పెరుగు కలిపి మాస్క్ వేసుకుంటే ముఖానికి సరికొత్త మెరుపు వస్తుంది.
  • సాధారణ చర్మతత్వం ఉంటే చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కాస్త ద్రాక్ష గుజ్జు, రెండు చుక్కల రోజ్ వాటర్ బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాలాగి కడిగేయాలి.
  • జిడ్డుగా ఉంటే...చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కొద్దిగా కీరాదోస లేదా క్యారెట్ గుజ్జు, రెండు చుక్కల నిమ్మ రసం...వీటన్నిటినీ కలిపి ముఖానికి పటించాలి. చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.
  • ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకోవాలనుకునే వారు ఇలా ప్రయత్నిస్తే సరి... నిమ్మరసం, కమలా పండు రసం ఒక్కో చెంచాడు చొప్పున తీసుకోవాలి. టమాటా గుజ్జులో ఈ రసాలను కపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకోవాలి.కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి.
  • చెంచాడు పాలపిండిలో తేనె కలిపి పేస్టులా చేసి దానిని మొహానికి రాసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడుతలు పోతాయి.
  • కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి.
  • క్యారెట్ ఉడికించిన నీళ్ళతో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది.
  • ఫేస్ స్క్రబ్ సహాయంతో చర్మంపైన మృత కణాలను ఎప్పటికప్పుడు తొలిగించుకోవాలి. అయితే స్క్రబ్తో గట్టిగా వత్తకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. ఒకవేళ చర్మం కందిపోయినట్లు అయితే వెంటనే స్క్రబ్ వాడటం ఆపేయాలి.

చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ

సౌందర్యపోషణ
చర్మ సంరక్షణకు
  • తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.
  • మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
  • వెల్లుల్లి రసం తెగిన, కాలిన గాయలను, మచ్చలను తగ్గిస్తుంది.
  • దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది.
  • కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
  • పావుకప్పు ఓట్లు, పాలపొడి, చిక్కటి గంజి తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా కలుపుకోవాలి. స్నానానికి ఇరవై నిముషాలముందు శరీరమంతా పట్టించుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • మీ చర్మం ముడతలు, పగుళ్ళు గా ఉన్నట్లయితే మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి.
  • మొదట ఒక మంచి చర్మ వ్యాధుల నిపుణుని కలవండి. మీకున్న సమస్య చిన్నదేనా లేదా ప్రమాదకరమైనదా అనేది నిర్ధారించుకోవాలి. క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనప్స్ చేయించుకుంటుంటే మంచిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి.
  • వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.
  • స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.
  • మాయిశ్చరైజర్ ఉన్న సబ్బును వాడాలి. స్నానం చేసిన అనంతరం మాయిశ్చరైజ్ లోషన్‌ను పూసుకుంటే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.
  • పోషక విలువలున్న ఆహార పదార్ధాలతో సమతుల ఆహారం తీసుకుంటే అది చర్మానికి అందాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక చర్మసంబంధిత వ్యాధులకు గురికాకుండా రక్షిస్తుంది.
  • చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
  • శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం చేయడం కూడా చర్మసౌందర్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది.
పొడి చర్మం అయితే ఇలా చేయాలి
  • ఎప్పుడూ కాటన్ దగ్గర పెట్టుకొని ముఖాన్ని తుడుచుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాక్టీరియా చాలా తొందరగా ఈ చర్మం పై చేరుతుంది. వయసు ప్రభావం వల్ల, చర్మం పలుచదనం వల్ల తొందరగా సూర్యకిరణాల తాకిడికి, పొగకు, కాలుష్యానికి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొడిచర్మం ఉన్నవారిలో లోపల ఉన్న తేమకూడా త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి అలాంటి చర్మం కలవారు వెంటనే మాయిశ్చరైజ్ చేయించుకోవాలి.
  • నూనె, నీరు కొన్ని ఇతర ఔషధాలు కలిపిన ద్రవపదార్ధంతో మాయిశ్చరైజ్ చేసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ సంరక్షణలో ప్రధాన పాత్రను పోషిస్తూ ముడుతలు, పొడిబారటం, మంట, పగుళ్ళు లేకుండా చేయడంతోపాటు చర్మానికి ఒక ఆరోగ్యమైన సహజసిద్దమైన మెరుపును అందిస్తుంది.

చిట్కాలు(ఇంటికి సంబంధించినవి)

చిట్కాలు
ఇంటికి సంబంధించినవి
  • అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.
  • ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే, ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి.
  • ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావు.
  • ఇల్లు తుడిచే స్పాంజి (ఫ్లోర్ మాప్స్) లను నీళ్ళలో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి.
  • ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఎండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి.
  • ఎలుకలు విసిగిస్తుంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి.
  • కిటికీల గుండా తలుపు సందుల గుండా చీమలు బారులు తీరి వేంచేస్తున్నాయా? చిన్న దాల్చినచెక్క ముక్కను దారిలో ఉంచితే చాలు చీమలు దారిలోంచి పరుగోపరుగు.
  • కొద్దిగా సబ్బునీటిలో పాత వార్తాపత్రిక ముక్కలు వేయాలి. నీటిని ఫ్లాస్క్ లో పోసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత బాగా కదిపి నీటిని పారబోసి మంచి నీటితో శుభ్రపరచాలి. ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.
  • కొబ్బరినూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు ఆవనూనె కలపాలి.
  • క్యాండిల్ హొల్డర్స్‌కి అంటిన మైనంకరగాలంటే వాటిని వేడి నీళ్ళలో ముంచి కాసేపు ఉంచితే సరి.
  • కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది.
  • కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా, కాంతిగా వెలుగుతాయి.
  • గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు, చిమటలు ఆదరికిరావు.
  • గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్పేస్ట్ తో రుద్దితే సరి.
  • చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే భాగానికి పెరుగుపూసి ఒక రాత్రంతా ఉంచండి. తెల్లవారి ఎండిన పెరుగు దులిపి పాదరక్షలు ధరించండి.
  • జార్ లేదా బాటిల్ మూత తీయడం కష్టంగా ఉందా? వేడి నీటి పంపు క్రింద కొంచెం సేపు ఉంచండి చాలు.
  • టర్పెన్ టైన్ ఆయిల్ లో తడిపిన పత్తిని ఇంటి మూలల్లో, బీరువాల కిందా ఉంచితే ఎలుకలు రావు.
  • డర్టీగా, మాసిపోయిన ఎలక్ట్రిక్ స్విచ్చులను...కిరోసిన్లో ముంచిన కాటన్ తో తుడవండి.
  • తుప్పుపట్టిన స్క్రూలకు కాస్త వెనిగర్ రాయండి. కొద్దిసేపటితర్వాత సులువుగా ఊడదీయవచ్చు.
  • నిమ్మనూనెలో రెండుచుక్కలు వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే చక్కటి సువాసన ఇల్లంతా పరచుకోవడమే కాక దోమలూ రావు.
  • నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయను పలచని వస్త్రంలో కట్టి డబ్బాలో వేస్తే సరి.
  • ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి.
  • ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరి! రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది.
  • ఫ్లవర్ వాజ్ లో పూలు తాజాగా ఉండడానికి వాజ్ లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
  • బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం లో పెడితే వాసన రాకుండా ఉంటుంది.
  • బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్ పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి.
  • బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది.
  • మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
  • రూం ఫ్రెషర్ తో అద్దాలు కూడ క్లీన్ చేయవచ్చు కూడా.
  • లెదర్ పర్సుకు కొద్దిగా ఆలివ్ నూనె రాయాలి. అర గంట తర్వాత మృదువైన వస్త్రంతో తుడిస్తే కొత్త దానిలా మెరుస్తుంది.
  • లెదర్ తో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు నీటిలో తడిస్తే వెంటనే గదిలో ధారాళంగా గాలివచ్చే చోట ఉంచి నీడపట్టునే ఆరనివ్వాలి. అంతేకానీ వాటిని ఎండలో పెడితే సహజకాంతిని కోల్పోతాయి. మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా అనిపిస్తాయి.
  • వంటింటి సింకులో నుంచి వాసన వస్తోంటే రెండు కప్పుల బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపి రాత్రి పూట సింకులో పోసి వదిలేయాలి.పొద్దున్నే బాగా నీరు పోస్తే శుభ్రమవుతుంది.
  • వాడేసిన ఇయర్ బడ్స్ దూదిని తీసి స్థానంలో కాటన్ ఊలు చుడితే ఆడియో టేప్ లాంటివి శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి.
  • వెనిగర్ కలిపిన నీటితో వంట గదిలో గట్టును తుడిస్తే చీమలు రావు.
  • వార్డ్ రోబ్ లో ఒక మూల ఎండుమిరపకాయలు పెడితే తోకపురుగులు రాకుండా ఉంటాయి.
  • వాష్ బేసిన్ రంధ్రాలు మూసుకుపోతే ఉప్పు కలిపిన వేడినీళ్ల ని పోస్తే శుభ్రపడతాయి.
  • స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు.
  • లిప్ స్టిక్ విరిగిపోతే రెండు ముక్కల కొనలని నిప్పుమీద కొన్ని సెకన్లు వేడిచేసి దగ్గరికి నొక్కి, ఫిజ్ లో పెడితే గట్టిపడుతుంది.