Sunday, January 16, 2011

వంటగదికి సంబంధించిన చిట్కాలు

చిట్కాలు
వంటగదికి సంబంధించినవి
  • అప్పడాల్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు
  • ఆకుకూరలను ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకండి.
  • ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
  • ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్‌ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి.
  • ఉప్పు డబ్బాలో ఏవైనా రెండు ఎండు గింజలను వేస్తే ఉప్పు ముద్ద కాకుండా తేలికగా చల్లుకోవటానికి వీలుగా ఉంటుంది.
  • ఉల్లిపాయ పొట్టు తీసి ఉప్పు నీటిలో కొంచెం సేపు ఉంచి తింటే నోరు వాసన రాదు.
  • ఉల్లిపాయ ముక్కల మీద కొంచెం ఉప్పు చల్లి తడి అయ్యే దాకా మెదిపి వాటిని పిండిలో కలిపి వేసిన పకోడీలు కరకరలాడుతాయి.
  • ఉల్లిపాయలు తరిగే సమయంలో నోట్లో చూయింగ్ గమ్ ఉంచుకోండి, ఉల్లిఘాటు మీ కళ్ళనుండి నీటిని రప్పించలేదు. మీ కళ్ళు మండవు కూడా.
  • ఎండు మిరపకాయలు కారం ఆడించే సమయంలో ఆవనూనె 4 చుక్కలు వేశారంటే కారానికి మంచి రంగు వస్తుంది.
  • ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలవ వుంటుంది.
  • ఎగ్స్ బాయిల్ చేసే సమయంలో పై షెల్స్ క్రాక్ అవ్వకుండా ఉండేందుకు కొంచెం ఉప్పు వేయండి చాలు.
  • ఒకవేళ అన్నం మాడిపోయి మాడువాసన వస్తుంటే, కొంచెం ఉప్పువేస్తే చాలు వాసన పోతుంది.
  • కాఫీ పొడిని ఫ్రిజ్ లో పెడితే సువాసన పోదు.
  • కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేస్తే కారం ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది.
  • కిచెన్లో ఉపయోగించే పాత నాప్కిన్‌ని వెనిగర్‌లో ముంచి ఫ్రిజ్ లోపలి భాగం శుభ్రం చేస్తే పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయి.
  • కొన్ని దోస తొక్కలను వంటింట్లో ఉంచితే చీమలు దరిదాపులకు రావు.
  • కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరి త్వరగా ఊడి రావాలంటే కొన్ని గంటలు కొబ్బరి చిప్పను ఫ్రీజర్‌లో ఉంచాలి.
  • కోడిగుడ్దు ఆమ్లెట్ వేయడానికి ముందు పెనం మీద టేబుల్ సాల్ట్ తో తుడిస్తే ఆమ్లెట్ అంటుకోకుండా చక్కగా వస్తుంది.
  • క్యాబేజీ ఉడికించేటప్పుడు నీటిలో చిన్న అల్లం ముక్క వేస్తే ఘాటైన వాసన రాదు. రుచి కూడా బాగుంటుంది.
  • గోరువెచ్చని నీటిలో కత్తిని ముంచితే కత్తితో డ్రై ఫ్రూట్స్ ను తేలిగ్గా కట్ చేయవచ్చు.
  • గ్యాస్ బర్నర్‌ని పెట్రోలుతో శుభ్రం చేస్తే నీలం మంటతో చక్కగా మండుతుంది.
  • చక్కెర గడ్డ కడితే డబ్బా మూతకి ఒక తడిబట్ట కట్టి రాత్రంతా ఉంచండి.
  • చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, ఇంగువ, ఉప్పు నీటిలో కలిపి నీటిని చింతపండు పై చిలకరించి చింతపండును బాగా ఎండలో ఆరబెట్టాలి. ఆరాక మంచి కంటెయినర్లో ఉంచుకుంటే ఎంత కాలమైనా చింతపండు నిల్వ ఉంటుంది.
  • చింతపండుని మిక్సీలో యధాతధంగా వేయకండి. మిక్సీ బ్లేడ్స్ పాడయిపోతాయి. రసం పిసికి రసం పోయండి.
  • జాం గట్టిగా మారితే సీసాను కాసేపు వేడి నీళ్ళలో ఉంచితే జాం వాడుకోవడానికి అనువుగా తయారవుతుంది.
  • జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వంటి డ్రైఫ్రూట్స్ ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉండాలంటే, వాటి మధ్య నాలుగు లవంగాలు ఉంచాలి.
  • టీ తయారు చేసే సమయంలో రోజ్ వాటర్ ఎసెన్స్ ఒక్క డ్రాప్ వేయండి. టీ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది.
  • తక్కువ పాలతో చిక్కటి టీ కావాలి. టీ రడీ అయ్యాక, బిస్కెట్ పొడి కాస్త పలచని టీ లో కల్పండి అంతే చిక్కని టీ రడీ.
  • తేనెసీసాలో రెండుమూడు మిరియాలు వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది, చీమలుకూడా పట్టవు.
  • తోడుపెట్టిన పాలల్లో చిన్న కొబ్బరి ముక్కవేస్తే పెరుగు కమ్మగా ఉంటుంది.
  • దుంపలను ఉప్పు కలిపిన నీటిలో పావుగంట నానబెట్టి తర్వాత ఉడికించండి. త్వరగా ఉడుకుతాయి.
  • దోసకాయ ముక్కలు క్రష్ చేసి కిచెన్ చుట్టు ప్రక్కల ఉంచారంటే, బొద్దింకలు దూరం దూరం.
  • నిమ్మకాయ రసం పిండివేశాక, నిమ్మడిప్పల్ని పారవేయకుండా వాటితో ప్లాస్టిక్ సామానును రబ్ చేయండి. మురికిపోయి అది మెరిసిపోవటాన్ని మీరు గుర్తించగలుగుతారు.
  • నిమ్మకాయల్ని తడిబట్టలో చుట్టి పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
  • నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరువెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయట పెట్టాలి.
  • నూనెలో కాని, నెయ్యిలో కాని కొంచెం బెల్లం ముక్కని వేస్తే దానిని గడ్డ కట్టకుండా ఆపుతుంది.
  • నెయ్యి బాగా మరగించి, దాన్ని నిల్వ ఉంచితే చాలా కాలం నిల్వ ఉంటుంది.
  • నెయ్యి మరిగించే సమయంలో రెండు చిటికెలు ఉప్పు దానిలో వేశారంటే నెయ్యి చాలా కాలం నిల్వ ఉంటుంది.
  • పచ్చిమిరపకాయలు పండకుండా ఉండాలంటే గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి ఎండ తగిలేలా ఉంచాలి.
  • పప్పు ధాన్యాలు చెడిపోకుండా నిల్వ ఉండాలంటే పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే చాలు! పప్పులకు పురుగుపట్టదు. ఎంతకాలమైనా నిల్వఉంటాయి.
  • పాత చేతి రుమాళ్ళు రెండింటిని తీసుకొని మూడు పక్కల కలిపి కుట్టి ఒక పక్క వదిలేయాలి. సంచిలా తయారైన దీనిని తడిపి అందులో ఆకుకూరలు పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
  • పిల్లలు టీ త్రాగుతామంటే, లైట్ గా టీ తయారు చేసి దాంట్లో బ్రిటానియా బిస్కెట్ పొడి కొట్టి వేయండి. వెరైటీ టేస్టు వారు ఎంజాయ్ చేస్తారు.
  • పుట్టగొడుగులు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే వాటిని ప్లాస్టిక్ కవర్ లో కాకుండా చక్కగా పేపర్లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  • ఫ్రిజ్ లో అక్కడక్కడ పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
  • ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టుకునే షల్ఫ్‌లో అడుగున పేపర్ వేసి ఉంచితే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
  • వంటగదిలో మంటలు రేగితే కొద్దిగా సోడా బైకార్బొనేట్ చల్లండి. మంటలు, పొగ వ్యాపించకుండా అది నిరోధిస్తుంది.
  • వంటింటి గట్టు, డైనింగ్ టేబుల్ ను ఉప్పు నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. చీమలు, పురుగుల బెడద ఉండదు.
  • వేడి నీరు, అమోనియా కలిపిన ద్రావణంలో గ్యాస్ స్టవ్ బర్నర్లను నానబెట్టాలి. ఒక వైర్ బ్రెష్ తో బర్నర్ రంధ్రాలను శుభ్ర్రపరిచి ఎండబెడితే స్టవ్ మంట బాగా వస్తుంది.
శుభ్రతకు సంబంధించినవి
  • ఇత్తడి బకెట్లు, ఇత్తడి వస్తువుల్ని కడిగేటప్పుడు నిమ్మ చెక్కని వాడితే తెల్లగా వస్తాయి.
  • ఉప్పునీటి మూలంగా స్టీలు బక్కెట్ల అడుగున తెల్లగా పొరలా పేరుకుంటుంది. కిరోసిన్ చుక్కలు వేసి గంట తర్వాత సబ్బునీటితో కడిగేయాలి.
  • ఏ పాత్రపై అయినా తుప్పు మరక పడితే, ఆలివ్ ఆయిల్లో కార్క్ ముంచి రుద్దితే మరక పోతుంది.
  • ఒక పెద్ద టబ్ లో చెంచా సర్ఫ్ వేసి నీళ్లు పోయండి. వంటకాలకు ఉపయోగించిన పాత్రలన్ని ఆ టబ్ లో వేసి నానబెట్టండి. ఇది రాత్రి పూట చేస్తే మంచిది. మరుసటి రోజు కొంచెం రుద్ది నీటితో కడిగేస్తే చాలు తళతళలాడే పాత్రలు సిద్ధం.
  • ఒక స్పూన్ డెట్టాల్, ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్, కలిపి కిచెన్ టైల్స్ తుడిస్తే, అవి శుభ్రంగా ఉండటమే కాదు.. తళతళ లాడిపోతాయి.
  • గిన్నెలపై ఉన్న మచ్చలు పోయి అవి తళతళ లాడాలంటే వాటిని కాసేపు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో ఉంచాలి.
  • స్టెయిన్ లెస్ స్టీల్ సింకులో పడిన మరకలను వెనిగర్‌లో ముంచిన గుడ్డతో తుడిస్తే పోతాయి.

No comments: