Sunday, January 16, 2011

వంటల తయారికి సంబంధించిన చిట్కాలు

చిట్కాలు
వంటల తయారికి సంబంధించినది
  • ఆలూ చిప్స్ ఇంట్లో చేసేటప్పుడు నల్లబడి పోకుండా ఉండాలంటే పలచని మస్లిన్ వస్త్రంలో కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి దాని ముక్కల్ని ఉడికించే నీటిలో ముంచి తీయాలి.
  • ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి.
  • ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే ఇడ్లీలు చాల మృదువుగా ఉంటాయి.
  • ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది. ఇడ్లీ చప్పగా కాకుండ రుచిగా ఉంటాయి.
  • ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి.
  • ఉడికించే నీటిలో కొద్దిగా వంటనూనె వేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి.
  • ఊరగాయ పాతబడి ఎండిపోతే అరస్పూను చెరుకురసం కలిపి చూడండి.
  • కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది.
  • కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే అధిక పసుపును అది పీల్చేసుకుంటుంది.
  • కేక్ తయారు చేసే సమయంలో పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే కేక్ చాలా రుచిగా ఉంటుంది.
  • కేరెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది.
  • కేరెట్ తో కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి. ఇదే పద్దతిని గ్రీన్ పీస్ తో చేసే కూరలకు కూడా.
  • గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి.
  • గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.
  • గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జాంలు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
  • చింతపండు చెట్నీకి కాస్త బెల్లం, కాసిని టమోటాలు కల్పారంటే, చింతపండు చెట్నీ రుచే వేరుగా ఉంటుంది.
  • చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి .
  • టమోటా చారు పొయ్యిమీద నుంచి దింపేటప్పుడు కాస్త నిమ్మరసం పిండండి. అది మాంచి రుచిగా ఉంటుంది.
  • టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి.
  • టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి.
  • దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది.
  • పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి బియ్యంతో పరమాన్నం చేయాలి.
  • ప్రూట్ కేక్స్ పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి.
  • పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి , పూరీ పిండి తయారు చేసుకోండి.
  • ఫ్రూట్ కేక్ తయారయ్యాక పొడి పొడిగా వుంటే ఒక టవల్ మడతపెట్టి కేక్ చల్లారే వరకు దానిమీద కప్పితే మెత్తగా అవుతుంది.
  • ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.
  • బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ లో ఉంచితే కరకరలాడతాయి.
  • బజ్జీలకు శనగపిండి కలిపే సమయంలో పిండిలో కాస్త బియ్యపు పిండి కలపండి. కాస్త వేడి నూనే కూడా పిండికి కలిపి , పిండితో
  • మిరపకాయ బజ్జీలు వేసి, వేడి వేడిగా తిని చూడండి. ఎంత రుచిగా ఉంటాయో?
  • మిగిలి పోయిన నిమ్మకాయ ఊరగాయను పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది.
  • బత్తాయి పండ్లని అయిదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే తొక్క కింద ఉండే తెల్లటి పొరని తేలిగ్గా వలిచేయవచ్చు.
  • లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి.
  • వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి.
  • శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
  • సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి తరువాత దానిపై దోశలు వేస్తే నాన్స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి.
  • సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.

No comments: