చిట్కాలు
ఇంటికి సంబంధించినవి
- అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.
- ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే, ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి.
- ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావు.
- ఇల్లు తుడిచే స్పాంజి (ఫ్లోర్ మాప్స్) లను నీళ్ళలో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి.
- ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఎండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి.
- ఎలుకలు విసిగిస్తుంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి.
- కిటికీల గుండా తలుపు సందుల గుండా చీమలు బారులు తీరి వేంచేస్తున్నాయా? చిన్న దాల్చినచెక్క ముక్కను ఆ దారిలో ఉంచితే చాలు చీమలు ఆ దారిలోంచి పరుగోపరుగు.
- కొద్దిగా సబ్బునీటిలో పాత వార్తాపత్రిక ముక్కలు వేయాలి. ఈ నీటిని ఫ్లాస్క్ లో పోసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బాగా కదిపి ఆ నీటిని పారబోసి మంచి నీటితో శుభ్రపరచాలి. ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.
- కొబ్బరినూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు ఆవనూనె కలపాలి.
- క్యాండిల్ హొల్డర్స్‌కి అంటిన మైనంకరగాలంటే వాటిని వేడి నీళ్ళలో ముంచి కాసేపు ఉంచితే సరి.
- కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది.
- కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా, కాంతిగా వెలుగుతాయి.
- గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు, చిమటలు ఆదరికిరావు.
- గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్పేస్ట్ తో రుద్దితే సరి.
- చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే ఆ భాగానికి పెరుగుపూసి ఒక రాత్రంతా ఉంచండి. తెల్లవారి ఎండిన పెరుగు దులిపి పాదరక్షలు ధరించండి.
- జార్ లేదా బాటిల్ మూత తీయడం కష్టంగా ఉందా? వేడి నీటి పంపు క్రింద కొంచెం సేపు ఉంచండి చాలు.
- టర్పెన్ టైన్ ఆయిల్ లో తడిపిన పత్తిని ఇంటి మూలల్లో, బీరువాల కిందా ఉంచితే ఎలుకలు రావు.
- డర్టీగా, మాసిపోయిన ఎలక్ట్రిక్ స్విచ్చులను...కిరోసిన్లో ముంచిన కాటన్ తో తుడవండి.
- తుప్పుపట్టిన స్క్రూలకు కాస్త వెనిగర్ రాయండి. కొద్దిసేపటితర్వాత సులువుగా ఊడదీయవచ్చు.
- నిమ్మనూనెలో రెండుచుక్కలు వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే చక్కటి సువాసన ఇల్లంతా పరచుకోవడమే కాక దోమలూ రావు.
- నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయను పలచని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి.
- ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి.
- ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరి! రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది.
- ఫ్లవర్ వాజ్ లో పూలు తాజాగా ఉండడానికి వాజ్ లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
- బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం లో పెడితే వాసన రాకుండా ఉంటుంది.
- బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్ పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి.
- బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది.
- మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
- రూం ఫ్రెషర్ తో అద్దాలు కూడ క్లీన్ చేయవచ్చు కూడా.
- లెదర్ పర్సుకు కొద్దిగా ఆలివ్ నూనె రాయాలి. అర గంట తర్వాత మృదువైన వస్త్రంతో తుడిస్తే కొత్త దానిలా మెరుస్తుంది.
- లెదర్ తో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు నీటిలో తడిస్తే వెంటనే గదిలో ధారాళంగా గాలివచ్చే చోట ఉంచి నీడపట్టునే ఆరనివ్వాలి. అంతేకానీ వాటిని ఎండలో పెడితే సహజకాంతిని కోల్పోతాయి. మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా అనిపిస్తాయి.
- వంటింటి సింకులో నుంచి వాసన వస్తోంటే రెండు కప్పుల బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపి రాత్రి పూట సింకులో పోసి వదిలేయాలి.పొద్దున్నే బాగా నీరు పోస్తే శుభ్రమవుతుంది.
- వాడేసిన ఇయర్ బడ్స్ దూదిని తీసి ఆ స్థానంలో కాటన్ ఊలు చుడితే ఆడియో టేప్ లాంటివి శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి.
- వెనిగర్ కలిపిన నీటితో వంట గదిలో గట్టును తుడిస్తే చీమలు రావు.
- వార్డ్ రోబ్ లో ఒక మూల ఎండుమిరపకాయలు పెడితే తోకపురుగులు రాకుండా ఉంటాయి.
- వాష్ బేసిన్ రంధ్రాలు మూసుకుపోతే ఉప్పు కలిపిన వేడినీళ్ల ని పోస్తే శుభ్రపడతాయి.
- స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు.
- లిప్ స్టిక్ విరిగిపోతే రెండు ముక్కల కొనలని నిప్పుమీద కొన్ని సెకన్లు వేడిచేసి దగ్గరికి నొక్కి, ఫిజ్ లో పెడితే గట్టిపడుతుంది.
No comments:
Post a Comment