Sunday, January 16, 2011

సౌందర్య పోషణ (కన్నులకు)

సౌందర్య పోషణ
  • కనుబొమ్మలను బాగా వెలుతురు ఉన్న ప్రాంతంలో కూర్చొని షేప్ చేయించుకోవాలి.
  • ఐ షాడో కలర్ మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే బ్రష్ ని ముందుగా నీటితో తడపాలి.
  • కళ్లు మెరుస్తూ చురుగ్గా ఉండాలంటే పేరిన నెయ్యి రెండు బొట్లు కళ్లలో వేసుకోవాలి.
  • కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకోవాలి.
  • కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
  • ఎక్కువ సేపు లిప్ స్టిక్ నిలిచి ఉండాలంటే రెండు సార్లు లిప్ స్టిక్ వేసుకుంటే సరి! ఒకసారి వేసుకున్నాక టిష్యూపేపర్తో మృదువుగా అద్దాలి. తర్వాత మరో సారి వేసుకోవాలి.
  • తేనే నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపు పోతుంది.
  • పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండాలంటే వారానికోసారి టేబుల్ సాల్ట్ తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి.
  • ఆరంజ్ తొక్కల పొడికి కొద్దిగా ఉప్పు కలిపి దాంతో పళ్ళు తోముకుంటే ముత్యాల్లాగా మెరుస్తాయి.
  • ఉల్లిపాయను మెత్తగా నూరి చిగుళ్ళకు, పళ్ళకు మర్ధనా చేస్తే చిగుళ్ళ వ్యాధులు పోతాయి.
  • నొప్పిగా ఉన్న పంటిమీద చిన్న ఇంగువ ముక్కని వుంచితే ఫలితముంటుంది.
  • గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి బుగ్గన ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.
  • వాముని నలిపి, వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. కొంచెం వాముని నీటీలో వేసి మరిగించి తయారు చేసిన డికాషన్‌లో కాస్త ఉప్పు కలుపుకొని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
  • తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
  • లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
  • దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
  • పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
అందమైన, ఆరోగ్యమైన గోళ్ళు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. గోళ్ళ సంరక్షణకు కొన్ని టిప్స్ తెలుసుకుందాము.
  • గోళ్ళు మిల మిల మెరవడానికి నెయిల్ నరిషింగ్ క్రీం అని దొరుకుతుంది అది ఒక చుక్క గోరు మొదట్లో వేసి మెల్లగా మర్దన చేయాలి.
  • నెలలో కొద్ది రోజులు రంగు వేయకుండా గోళ్ళను అలాగే సహజంగా వదిలేయాలి.
  • బాగా తడిసి ఉన్నప్పుడు గోళ్ళను కత్తిరించే కార్యక్రమం పెట్టుకోవాలి. ఇలాగైతే విరగకుండా సులభంగా ఒక పద్దతి ప్రకారం కత్తిరించుకోవచ్చు.
  • గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్‌ని పూయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్‌తో మెల్లగా కత్తిరించాలి.
  • గోళ్ళకు రంగువేసుకునేటప్పుడు బేస్ కోట్, పాలిష్, టాప్ కోట్ వేసుకోవాలి. అప్పుడు గోళ్ళరంగు అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
  • మొదటి కోటింగ్ వేసిన తర్వాత పది నిమిషాలు ఆరనిచ్చి రెండవ కోట్ వేయాలి. టాప్ కోటింగ్ వేసేటప్పుడు కూడా గోళ్ళను పది నిమిషాలు ఆరనిచ్చి రెండవ కోట్ వేయాలి. టాప్ కోటింగ్ వేసేటప్పుడు కూడా గోళ్ళను పది నిముషాలు ఆరనివ్వాలి.
  • గోళ్ళపై ముదురు రంగులు వేసుకుంటే కనీసం 45 నిముషాలు చేతులకు పని చెప్పకూడదు. లేత రంగులు వేసుకుంటే 25 నిముషాలు ఆరనిస్తే చాలు.
  • ఇంటి పని వంట పని తో గట్టిపడే అరచేతులకి కమలా రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి.
  • వంట, ఇంటి పనితో గట్టి పడిన చేతులకు బంగాళదుంపలు ఉడకపెట్టి ఆ గుజ్జును రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.
  • ఒక అరకప్పు ఆవనూనెని వేడి చేసి దానిని మోకాళ్ల మీద మృదువుగా మర్దనా చేస్తే జాయింట్ల నొప్పులు తగ్గుతాయి.
  • కూరగాయలు కోసేటప్పుడు చేతులకు మరకలయితే నిమ్మకాయ డిప్పతో రుద్దండి. మరకలు ఊరికేపోతాయి.
  • చేతి వేళ్ళకు అంటిన ఆహారపదార్ధాల తాలూకు మరకలు పోవాలంటే పచ్చి బంగాళదుంప ముక్కతో రుద్ది కడగాలి.
  • పసుపు, వెల్లుల్లి కలిపి నూరి అరిచేతులు, అరికాళ్ళకు రాస్తే కాళ్ళూ, చేతులు చల్లబడటం తగ్గుతుంది.
  • నిమ్మరసం, పంచదార కలిపి మిశ్రమంతో ముందుగా పాదాలను శుభ్రపరచాలి. ఇది స్క్రబ్ లా పనిచేసి చర్మం పై పేరుకున్న మృతకణాలన్ని తొలగిపోతాయి. ఆ తర్వాత నాలుగు చెంచాల పాలు, తేనె, గోధుమపిండి ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా చేసి పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
  • కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనె లో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.
  • నెయిల్ పాలిష్ వేసుకునే ముందు కాలి వేళ్ల మధ్య దూదిని గుండ్రంగా చేసి పెట్టుకుంటే నెయిల్ పాలిష్ అటూ ఇటూ అంటకుండా ఉంటుంది.
  • బొప్పాయి కాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకులా నూరి ఆ ముద్దని అరికాళ్ళు ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.
  • అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
  • బరువు తగ్గటానికి మందులేమి ఉండవు. పీచు పదార్దాలనే నిపుణులు బరువు తగ్గడానికి ఉపయోగపడే మ్యూజిక్పిల్స్ గా పేర్కొంటారు.
  • లావుగా ఉన్న వారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేత ములగాకు రసం తాగుతూ ఉండాలి.
  • తేనె నిమ్మకాయ రసం కలిపి తాగినా లావుగా ఉన్నవారు సన్నబడతారు. అయితే ఎసిడిటి ఉండకూడదు.
ఆరోగ్యం
  • వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది.
  • తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

No comments: