Sunday, January 16, 2011

ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు

చిట్కాలు
ఆరోగ్యానికి సంబంధించినవి
  • ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని చేస్తుంది. బోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
  • కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి.
  • సోపు కూడా అజీర్తి సమస్యలకు, గ్యాస్‌కి చక్కగా పనిచేస్తుంది. అన్నం తినగానే ఒక టీస్పూను సొంపుని తినవచ్చు. లేదా మీరు మంచినీరు కాచి తాగేవారైతే ఆ నీటిలోనే సొంపుని వేసుకోవచ్చు.
  • కడుపు ఉబ్బరం కారణంగా కడుపునొప్పి ఉన్నప్పుడు కొంచెం వాముని వేడి చేసి ఒక కప్పు నీటిని జోడించి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు లేదా పంచదారని కలిపి తాగాలి. కాస్త వాముని ఉప్పుతో కలిపి నమిలినా అజీర్తి ఉపశమనంగా పనిచేస్తుంది.
  • పసుపు జీర్ణవ్యస్థలో సమస్యలను తగ్గించగలుగుతుంది. అరుగుదలకు మందుగా పని చేస్తుంది.
  • మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
  • పాలల్లో కాస్త పసుపు కలిపి కాచుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబుతో ముక్కు కారుతున్నప్పుడూ పసుపు కొమ్ముని కాల్చి ఆ వాసనని పీల్చాలి.
  • తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.
  • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
  • తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
  • దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
  • లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
  • లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
  • కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.
  • దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
  • యాలుకలు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి.
  • ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
  • కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
  • క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది.
  • పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల అరుగుదల, పొట్టలో పురుగులు నశించటం, శరీరంలోని విష పదార్ధాలు నశించటం, కొలెస్ట్రాల్ నియంత్రణ, తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి.
  • కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.
  • పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
  • విరేచనాలు అవుతున్నప్పుడు మెంతిపొడిని ఒక అరకప్పు నీటితో కలిపి పొద్దున్నే తాగాలి. ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
  • నీటిలో మెంతులు వేసి చేసిన టీ తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
  • అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.
  • ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
  • మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
  • కడుపు నొప్పిగా ఉండి, నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం కానపుడు కొంచెం జీలకర్రని తీసుకుని వేడి చేయండి. ఇఫ్ఫుడు వాటికి ఒక కప్పు నీటిని చేర్చి నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఈ నీటిలో రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసి తాగండి. అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అయితే తగ్గుతుంది. నొప్పి ఇంకా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించాలి.
  • ఒక చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని ప్రతి రోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్దం అవుతుంది.
  • మిరియాలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే మందుని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానె తాగండి. దీనిని సేవించడం వల్ల పైన చెప్పిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • తాగే నీటిలో సాజీరాను వేసి పది నిముషాల పాటు వేడి చేసి తాగితే పొట్టలో నులి పురుగులు, చెడు శ్వాస సమస్యలు తగ్గుతాయి.
  • తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది.
  • తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

No comments: