Sunday, January 16, 2011

ఉంగరాన్ని నాలుగో వేలుకే ఎందుకు పెడతారు?

ఈ మధ్య ఒక సైట్లొ ఈ పొస్ట్ చూశానండి, మీకు తెలియజేస్తే బావుంటుండి అని అనిపించింది…….
పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.
తెలుసుకుందామా. ఇది పెళ్ళయినవాళ్ళకి, పెళ్ళికాబోయేవాళ్ళకి
ఉపయోగకరము. చూద్దామా సంగతేంటో.

బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
మధ్యవేలు-మనకోసం
ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి
ఆసక్తిగా ఉందికదా……..
marraige-ring.jpg
ఈ విధంగా చేయండి. రెండు అర చేతులను తెరచి, మధ్య వేళ్లు
రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి. ఇప్పుడు
మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.

మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి. అవి విడిపోతాయి.
అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు. అలాగే
మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.

ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి
కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల
సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.

ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.
అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత
జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.

ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.
ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు. ప్రయత్నించినా మిగతా
వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా
భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే
వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.
అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.
ప్రయత్నించి చూడండి

1 comment:

Unknown said...

Excellent. May be it is true. any how one good matter is posted..

Bangaru Shiva Kumar aks OM KUMAR, HYD.