Sunday, January 16, 2011

ఏరోజు ఎటువైపు వెళ్ళాలి?

దూరతీర ప్రాంతాలకు వెళ్లేటపుడు మంచి చెడులు చూసి బయలు దేరమని మన పెద్దవాళ్లు చెపుతుంటారు. అసలు ఏ సమయంలో ప్రయాణాలు చేయాలన్నదానిపై జ్యోతిష శాస్త్రం వివరించింది. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలు దేరటం శ్రేయస్కరమని వివిధ గ్రథాలు తెలియజేస్తున్నాయి.

ముఖ్యంగా ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ,శనివారములు పాడ్యమి, రిక్త తిధులు, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు నిషిధ్దాలని కాళిదాసు వచనం తెలియజేస్తోంది. అదేవిధంగా భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ,విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, నక్షత్రాలు, స్థిర లగ్నాలు నిషేధించబడ్డాయి. అదే విధంగా తీర్థయాత్రలు దీర్ఘకాలిక ప్రయాణములను మౌఢ్యమునందు చేయకపోవటం మంచిది. కుజ,బుధ,శుక్రులున్న దిశకు ప్రయాణాలు చేయకూడదు.

సోమ, బుధ,గురు,శుక్ర వారాలు ప్రయాణానికి శుభప్రదాలు. అదేవిధంగా విదియయ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి శుభ తిథులుగా పరిగణించబడుతున్నాయి. అదేవియధంగా అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ,రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణించబడుతున్నాయి. ఇక శుభ లగ్నాల విషయానికి వస్తే... మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం శుభ లగ్నాలుగా చెప్పబడ్డాయి.

ప్రత్యేకించి కొన్ని వారాల్లో ప్రయాణాలు చేయరాదని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. గురువారం దక్షిణ దిక్కునకు శూలప్రదమని చెప్పబడింది. అదే విధంగా శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. మంగళ, బుధవారాలు ఉత్తర దిక్కుకు శూలకలిగించగలవు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు. ఈ వారాల్లో ప్రయాణాలు చేయకుండా మరో వరానికి మార్చుకోవటం ఉత్తమమని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది.

No comments: