Thursday, February 3, 2011

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్
పేరు : మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 1888.
పుట్టిన ప్రదేశం : సౌదీ అరేబియా దేశంలోని 'మక్కా' లో జన్మించాడు.
చదివిన ప్రదేశం :

(తెలియదు).

చదువు :

(తెలియదు).

గొప్పదనం : భారతదేశాన్ని మతప్రాతిపదికన విడదీయడాన్ని భరించలేని మౌలానా
ఛలో ఆవో తుమ్హే దిఖాయే(
జో బచ్చా హై మహ్తల్ - ఇ - పెషర్ మె
అహల్ - ఇ - సిదాక్ కితుర్బతై(
అంటూ వాపోయాడు.
స్వర్గస్తుడైన తేది : 1958.

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయునిగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాలకొరకు కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్.

సౌదీ అరేబియా దేశంలోని 'మక్కా' లో 1888 సంవత్సరంలో భారతీయ వ్యక్తి, అరబ్ యువతిల సంతానంగా మౌలానా అబుల్ కలామ్‌ జన్మించారు. మహమ్మదీయ సాంప్రదాయ పద్దతిలో విద్యాభ్యాసం జరిపినప్పటికి మౌలానా రహస్యంగా ఆంగ్లం కూడా నేర్చుకున్నారు. ఇస్లామిక్ సాంప్రదాయ పద్దతిలో పెరిగినప్పటికీ, విద్యాభ్యాసం చేసినప్పటికీ మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ ఏనాడూ మతమౌఢ్యానికి లోనవలేదు. అంతేకాక, మతప్రాతిపదికన భారతదేశాన్ని విడదీయాలన్న జిన్నా వంటి ప్రముఖులతో విభేదించారు. 'ముస్లింలీగ్' పార్టీ మొత్తం ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహిస్తోందన్న అపవాదును తుడిచివేయడానికి మౌలానా 'నేషనలిస్ట్ ముస్లిం లీగ్' పార్టీని కాంగ్రెస్‌లో అంతర్భాగంగా స్ధాపించారు. స్వాతంత్ర్యం కోసం మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ వంటి పలువురు నాయకులు చేసిన విశేష కృషి గాంధీ, నెహ్రూ లాంటి ప్రజాకర్షక నేతల మధ్య మరుగున పడిపోయింది.

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా 10 సం||ల పాటు బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన మౌలానా ఆజాద్ గారిని నెహ్రూ 'సంస్కృతి' ధైర్యాలకు ప్రతీక గా కీర్తించారు. 'యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌' (UGC) ని మౌలానా ఆజాద్‌గారే స్ధాపించారు. సాంకేతిక విద్యకు ప్రోత్సాహకంగా 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌' ను స్ధాపించారు. సైకలాజికల్ స్టడీస్‌పై విద్యార్ధుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు మౌలానాగారు కృషి చేశారు.

అటు విద్యారంగంలో శాస్త్ర, సాంకేతిక, స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేస్తూనే, కళారంగంలో తన ఆసక్తిని ప్రదర్శించారు మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌గారు. సంగీత, సాహిత్యాలను అమితంగా అభిమానించే మౌలానా అబుల్‌కలామ్‌ ఆజాద్ 'సాహిత్య అకాడమీ', 'సంగీత నాటిక అకాడమీ', 'లలిత కళా అకాడమీ' లను స్ధాపించారు. 'లలితకళా అకాడమీ' ను స్ధాపించినపుడు దానికి భవనం లేకపోవటంతో తన నివాసంలో కొంత భాగాన్నిచ్చారు. విద్యా, సాహిత్య రంగాల్లో అభివృద్ధికి విశిష్ట కృషి చేసిన మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ గారిని పలు సాంస్కృతిక సంస్ధలు తగురీతిన సన్మానించాయి. ఇస్లాంను పరిపూర్ణంగా నమ్మి, ఆచరించిన మౌలానా ఆజాద్ మతపరమైన జీవన విధానానికి ఉదాహరణగా నిలువదగిన వ్యక్తి.

భారతదేశాన్ని మతప్రాతిపదికన విడదీయడాన్ని భరించలేని మౌలానా

ఛలో ఆవో తుమ్హే దిఖాయే(

జో బచ్చా హై మహ్తల్ - ఇ - పెషర్ మె

అహల్ - ఇ - సిదాక్ కితుర్బతై(

అంటూ వాపోయాడు. మౌలానా అబుల్‌ కలామ్‌ రచించిన "India Wins Freedom" పుస్తకంలో భారతదేశ విభజనకు గురికావడానికి కాంగ్రెస్‌ వారిని, మహమ్మద్ అలీ జిన్నాను సమానంగా నిందిస్తూ, బాధ్యులను చేస్తాడు. అటువంటి మౌలానా తన భౌతిక జీవితాన్ని ఆదర్శవంతంగా గడిపి 1958 వ సంవత్సరంలో మరణించారు.


No comments: