Thursday, February 3, 2011

సుభాష్ చంద్రబోస్

సుభాష్ చంద్రబోస్

సుభాష్ చంద్రబోస్
పేరు : సుభాష్ చంద్రబోస్.
తండ్రి పేరు : జానకీనాథ్ బోస్.
తల్లి పేరు : శ్రీమతి ప్రభావతిదేవి.
పుట్టిన తేది : 23-1-1897.
పుట్టిన ప్రదేశం : ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండు.
చదువు : ఐ.పి.ఎస్.
గొప్పదనం : మాతృ దేశం ను దాస్యపు శృంఖలాల నుండి విడిపించడానికి తన ప్రాణాలను సైతం అర్పించాడు.
స్ధాపించిన సంస్థలు : "ఆజాద్ హింద్".
స్వర్గస్తుడైన తేది : 18-8-1945.

కొంతమంది వీరుల పేరు వింటేనే ఆంగ్లేయుల వెన్నెముకలో చలి పుట్టేది. అటువంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతి ముఖ్యుడు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు. తండ్రి జానకీనాథ్ బోస్, పేరొందిన న్యాయవాది. తల్లి ప్రభావతిదేవి, కాళికాదేవి భక్తురాలు. కొడుకు జిల్లాకలెక్టర్ కావాలని కోరుకుంటూండేది. హిందూ మతం గురించి, భారతీయ సంస్కృతి గురించి అతనికి బోధిస్తూ ఉండేది.

పరమ పవిత్రమైన భారత భూమిపై విదేశీయులు చేసిన దండయాత్రలు వారు నాశనం చేసిన సంపదల గూర్చి చెప్తూ ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తోటి స్నేహితులకు తల్లి చెప్పిన విషయాలను చెప్పి, వారిని విదేశీ దుస్తులతో కాకుండా సంప్రదాయ దుస్తులతో స్కూలుకు రమ్మని చెప్పేవాడు. ఆ వయసులో వారి దేశభక్తి చూపించుకోడానికి అంతకన్నా వేరే మార్గంలేదు. పిల్లలందరూ పంచెలు కట్టుకొని పాఠశాలకు రావటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తల్లి కోరిన ప్రకారం ఇంగ్లాండు వెళ్ళి ఐ.పి.ఎస్. పరీక్ష పాసై భారతదేశం వచ్చారు. కానీ భారతదేశంలో ఇంగ్లీషుదొరల అరాచకత్వం గురించి స్నేహితుల ద్వారా విని చలించిపోయాడు. రోజు రోజుకీ మితిమీరిపోతున్న హింసాకాండ, మహాత్మగాంధీ అహింసా పోరాటం గురించి విని, తాను కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరితే ఇంగ్లీషు దొరల బానిసగా పనిచేస్తూ... భారతీయులను హింస పెట్ట వలసి వస్తుందని భావించి ఆ ఉద్యోగంలో చేరడానికి నిరాకరించాడు.

ఆ రోజుల్లో ఒక భారతీయుడు ఐ.పి.ఎస్. (ఇప్పుడు ఐ.ఎ.ఎస్.లాగ) పాసవడం అరుదైన విషయం. కానీ సుభాష్ తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. 1920వ సంవత్సరంలో ఇండియన్ సివిల్ సర్వీస్‌లో రెండవ స్థానం పొంది ఉద్యోగం సంపాదించిన ఆయన మాతృదేశంపై మమకారంతో, పరాయి పాలనను అంతమొందించాలన్న ఆశయంతో ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి తిరిగి స్వదేశానికి వచ్చి 1921వ సంవత్సరంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

1938 మరియు 1939 వ సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షునిగా గెలిచిన ఈయన 1939లో మహత్మాగాంధీ నిలబెట్టిన అభ్యర్ధి పట్టాభి సీతారామయ్యా పై పోటీపడి గెలిచారు. కానీ గాంధీజీ మీద గౌరవంతో ఆ పదవికి రాజీనామా చేసి 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' పేరిట కొత్త పార్టీని ఏర్పరిచారు. మహాత్మా గాంధీ ని కలిసి భారతదేశ భవిష్యత్తును గురించి చర్చించాడు. ఆయన సలహా ప్రకారం కలకత్తాలో చిత్తరంజన్ దాస్‌ని ఆయనతో కలిసి అనేక ఉధ్యమాలు నడిపాడు. బ్రిటిష్ ప్రభుత్వం అతనిని అనేక సమయాలలో, అర్ధంలేని నేరాలను మోపి అరెస్టు చేశారు. 1931లో కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు జైలు నుంచే పోటీ చేసి నగర మేయర్‌గా ఎన్నికయ్యాడు. ప్రభుత్వం తప్పనిసరి అయి అతనిని విడుదల చేయవలసి వచ్చింది. పెషావర్, బెర్లిన్, మాస్కో, జపాన్, సింగపూర్ దేశాలు తిరిగి ఎందరో రాజకీయ నాయకులను కలిసి, అక్కడున్న భారతీయులకు ఆంగ్ల పాలకుల అరాచకం గురించి వివరించి, వారిలో చైతన్యం కలిగించి 1943 అక్టోబర్ 21 నాటికి "ఆజాద్ హింద్" సంస్థను ప్రారంభించగలిగాడు.

భారతదేశంలో బ్రిటీష్ వారి ప్రభుత్వాన్ని పడగొట్టి, స్వతంత్రదేశం చేయ్యాలని కంకణం కట్టుకొని తన జీవితాన్నే ఫణంగాపెట్టి "అజాద్ హింద్ ఫౌజ్" స్ధాపించి, సైన్యాన్ని తయారుచేసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అనేక ఉద్యమాలలో పాల్గొని మహాత్మా గాంధీకి సన్నిహితుడిగా మెలిగి, రాజద్రోహం నేరంపై అనేక పర్యాయాలు జైలు శిక్ష అనుభవించి, సుభాష్ చంద్రబోస్ తన దేశానికి స్వాతంత్ర్యం లభించాలని, తన మాతృదేశం దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందాలని, కలెక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని చివరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి ప్రాణం సైతం లెక్కచేయని నేతాజీ జీవిత చరిత్ర అందరూ తప్పక తెలుసుకోవాలి.


No comments: