Thursday, February 3, 2011

పొట్టి శ్రీరాములు

పొట్టి శ్రీరాములు

పొట్టీశ్రీరాములు
పేరు : పొట్టి శ్రీరాములు.
తండ్రి పేరు : గురవయ్య
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు
చదువు :

(తెలియదు).

రచనలు : (తెలియదు).
స్వర్గస్తుడైన తేది : డిసెంబర్ 15.
గొప్పదనం : నిరాహారదీక్ష చేసి మద్రాసు రాష్ట్రాం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినారు.

ఒకప్పుడు మన ఆంధ్రాప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉండేది. తమిళ సోదరులు, మనం ఎంతో ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగా, భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి! మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మద్రాసు రాష్ట్రంలో జనాభా ఎక్కువైయింది. వైశాల్యం కూడా ఎక్కువే. అందుచేత ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగువారు కోరుకునేవారు. కానీ అందుకు పాలకులు అంగీకరించలేదు. అనేక ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. చివరికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. యుద్దాలతో సాధించలేని కార్యాన్ని శాంతియుత పోరాటంతో సాధించిన శ్రీరాములు చిరస్మరణీయులు. ఆయన గురించి తెలుసుకుందాం.

పొట్టి శ్రీరాములు 1901 లో మద్రాసులో జన్మించాడు. ఆయన స్వస్థలం నెల్లూరు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి గురవయ్య మహాభక్తులు. శ్రీరాములుకు చిన్నతనము నుండి దేశభక్తి మెండు. మన దేశంలో తిష్ట వేసుకొని కూర్చున్న బ్రిటీష్ వారిని తిట్టుకోని రోజులేదు. "వ్యాపారం చేయడానికి మనదేశం వచ్చి, అక్రమ పద్దతులు అవలంబించి, మనలోమనకు మనస్పర్ధలు సృష్టించి, చివరకు మనమీద పెత్తనం చెలాయిస్తున్న బ్రిటీష్ ప్రభుత్వం పతనం అయ్యేవరకు నాకు శాంతిలేదు" అని అనుకునేవాడు.

పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒకసారి వకృత్వపు పోటీలలో 'నా దేశం' అనే విషయంపై మాట్లాడమని విద్యార్ధులను ఉపాధ్యాయులు ఆదేశించారు. మిగతా పిల్లలు 'నాదేశం' సస్యశ్యామలమైనది. కొండలు, చెట్లు, బంగారం, ఇనుము అంటూ దేశాన్ని పొగుడుతూ మాట్లాడారు. శ్రీరాములు మాత్రం అలా మాట్లాడలేదు. ఇంత వరకు నా సహొదరులు మన దేశం గురించి, పాడిపంటలను గురించి ఘనంగా చెప్పారు. అయితే, మన దేశంలో లభ్యమయ్యే పంటలు కానీ, ఖనిజాలుకానీ, మనవికావు. వాటిమీద వచ్చే లాభాలు బ్రిటీష్ వారు, వారి దేశానికి తరలిస్తున్నారు. అటువంటప్పుడు అవి మనవికావు. మనకు స్వాతంత్ర్యం లేదు. మనం బానిసల్లా బ్రతుకుతున్నాము. తెల్లవారి పరిపాలన అంతమొందించినప్పుడే అవి మన సొంతం అవుతాయి. ప్రతి భారతీయుడు మహాత్మాగాంధీ ఆదేశించినట్లుగా శాంతియుతంగా పోరాటం సలిపి, మన స్వాతంత్ర్యాన్ని దక్కించుకోవాలి, "వందేమాతరం" అని ముగించాడు. శ్రీరాములు ప్రసంగం అవుతుండగానే చరచరా తన క్లాసు గదిలోకి పోయి కూర్చుని వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. ప్రిన్సిపాల్ నుండి పిలుపొచ్చింది. ఏడుస్తూనే ఆయన యొద్దకువచ్చాడు. "నీ కెంత ధైర్యము రా! బహిరంగంగా బ్రిటీష్ దొరలను విమర్శిస్తావా? వకృత్వం పోటీల్లో నువ్వు అలా మాట్లాడితే బహుమతి వచ్చేస్తుందనుకున్నావా?'' అని గద్దించాడు. శ్రీరాములు తొణక్కుండా, "మీరిచ్చే బహుమతి కోసం నేను అలా మాట్లాడలేదు. నా మనసులో ఉన్నది నేను చెప్పాను. ఒక కుటుంబంలో ఒక క్రొత్త వ్యక్తి వచ్చి మాయమాటలతో మోస బుచ్చి వారి మీద పెత్తనం చెలాయిస్తే ఎలా వుంటుంది. మీ ఇంట్లోనే అలా జరిగితే మీరేంచేస్తారు?" అన్నాడు. ఆ ప్రిన్సిపాల్ కూడా భారతీయుడే కావడం వలన ఆ ప్రశ్నకు నిరుత్తరుడైపోయారు.

మహాత్మాగాంధీ అభిలషించిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చురుకుగా పాల్గొన్నాడు. తన సొంత ఊరైన నెల్లూరులో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం ఆయన నిరాహారదీక్ష పూనారు. హరిజనులకు సంబంధించిన రెండు శాసనాలను అమలులోకి తీసుకురావటానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. తెలుగు వారికి మద్రాసు రాష్ట్రంలో ఎంతో అన్యాయం జరుగుతున్నదని ఆయన ఎంతో బాధ పడుతుండేవారు. జనాభాపరంగాకానీ, భూ వైశాల్యం పరంగాకానీ ఎంతో పెద్దదయిన మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర దేశాన్ని వేరు చేయాలని ఆయన నిరశన వ్రతం పట్టాడు.

ఆయన చేసిన విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తన మిత్రులు కూడా ఆ ఆలోచనకు స్వస్తి చెప్పమని సలహా ఇచ్చారు. కానీ శ్రీరాములు తన పట్టు విడువలేదు. విన్నపాలు, వినతులు, లాభం లేదని నిర్ణయించుకొని ప్రత్యేక రాష్ట్రానికై ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. అలా 54 రోజుల పాటు చేయటం వలన శరీరం కృశించి క్రుంగి చివరికి డిశంబర్ 15న కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజల్లో ఎంతో ఉద్రేకం కలిగించింది. చివరకు ఆయన ఆశయం సిద్ధించింది.

పొట్టి శ్రీరాములు యుద్ధం చేయకుండా, కలహాలకు కాలుదువ్వకుండా శాంతంగా సమరం సాగించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఏదైనా శాంతంతో సాధించవచ్చు కదూ!


No comments: