Thursday, February 3, 2011

సి. రాజగోపాలాచారి

సి. రాజగోపాలాచారి

సి. రాజగోపాలాచారి
పేరు : సి. రాజగోపాలాచారి.
చదివిన ప్రదేశం : మద్రాస్‌.
తండ్రి పేరు : అయ్యంగార్‌.
తల్లి పేరు : సింగారమ్మ.
పుట్టిన తేది : 10-12-1878.
పుట్టిన ప్రదేశం : "హొసూర్"‌ తాలూకాలోని (తొరాపల్లి) గ్రామంలో జన్మించాడు.
చదువు : మద్రాస్‌ నగరంలో గ్రాడ్యుయేషన్‌.
గొప్పదనం : స్వతంత్ర్య భారత దేశానికి తొలిగవర్నర్ జనరల్‌గా రాజాజీ
బాధ్యతలు స్వీకరించారు. తనకు లభించిన ప్రతి అవకాశాన్ని దేశసేవకే వినియోగించిన
మహనీయుడు రాజాజీ.
స్వర్గస్తుడైన తేది : 1972.

రాజగోపాలాచారి అంటే ఎవరికైనా తెలియకపోవచ్చు. కానీ, 'రాజాజీ' అంటే తెలియనివారు దాదాపుగా ఉండరు. స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ - జనరల్‌గా చక్రవర్తుల రాజగోపాలాచారి గారు బాధ్యతలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ అందించిన సమర్ధవంతమైన నాయకులలో రాజాజీ ఒకరు.

హొసూర్‌ తాలుకాలోని తొరాపల్లి గ్రామంలో 10 డిశంబర్‌ 1878వ సంవత్సరం చక్రవర్తుల అయ్యంగార్‌, సింగారమ్మ దంపతులకు రాజగోపాలాచారిగారు జన్మించారు. మద్రాస్ నగరంలో గ్రాడ్యుయేషన్, లా పూర్తి చేసిం తర్వాత, సాలెంలో 1900సం|| నుంచి ప్రాక్టీస్ ప్రారంభించారు. దాదాపుగా రాజాజీగారు వాదించిన కేసులన్నీ గెలవడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి. రాజాజీ 1919వ సంవత్సరంలో గాంధీజీని కలవడం తటస్థించింది., తరువాతి కాలంలో వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి, దక్షిణాది నాయకుల్లో గాంధీజీ అమితంగా అభిమానించి ఆదరించే నాయకునిగా రాజాజీని పరిగణించే స్థాయికి చేరింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దక్షిణాదికి సంబంధించి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారిలో, పలు ఉద్యమాలకు సమర్ధవంతంగా నాయకత్వం వహించిన రాజాజీ, ఆ కారణంగానే పలుమార్లు ఆంగ్లేయుల చేత అరెస్టు చేయబడి, జైలు శిక్షననుభవించారు. 1923వ సంవత్సరంలో 'జెండాసత్యాగ్రహం' (Flag Satyagraha) ను సమర్ధంగా నిర్వహించిన, రాజాజీ ఉప్పుసత్యాగ్రహం సమయంలో తిరుచ్చి నుండి వేదారణ్యం వరకు దాదాపు 150 మైళ్ళు దూరం 98 మంది సత్యాగ్రహిలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. హిందూ - ముస్లింల మధ్య విభేదాలు తొలగించడానికి కూడా రాజాజీగారు చాలా కృషి చేశారు. ఆ కృషి కారణంగానే రాజాజీ స్వతంత్ర భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు గవర్నర్‌గా నియమించబడ్డారు. రాజాజీ అత్యంత సరళమైన భాషలో, సులువుగా అందరికీ అర్థమయ్యే తరహాలో రచించిన రాజాజీ మహాభారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత, మన సంస్కృతి వంటి పలురచనలు పలువురు మేధావుల, విమర్శకుల ప్రశంసలు పొంది, సామాన్య జనంలో కూడా ఆదరణ పొందాయి.

లార్డ్ మౌంట్ బాటన్ పదవీకాలం పూర్తయింతర్వాత, స్వతంత్ర్య భారత దేశానికి తొలిగవర్నర్ జనరల్‌గా రాజాజీ బాధ్యతలు స్వీకరించారు. తనకు లభించిన ప్రతి అవకాశాన్ని దేశసేవకే వినియోగించిన మహనీయుడు రాజాజీ. 1972వ సంవత్సరంలో పరమపదించారు.


No comments: