Thursday, February 3, 2011

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్‌
పేరు : మొరార్జీ దేశాయ్ .
తండ్రి పేరు : రంచోడ్డి దేశాయ్.
తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 29-2-1896.
పుట్టిన ప్రదేశం : గుజరాత్.
చదివిన ప్రదేశం : గుజరాత్.
చదువు : బి.ఏ.
గొప్పదనం : పేదవారి విషయంలో అత్యంత శ్రద్ద చూపి వారి అభివృద్దికి ఎంతో పాటుపడ్డారు.
స్వర్గస్థుడైన తేది : 7-5-1924.

రంచోడ్డి మురార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్ లో జన్మించాడు. తండ్రి రంచోడ్డి దేశాయ్ బడిపంతులు. ఆయన ఏడుగురి సంతానంలో మురార్జీ మొదటివాడు. బతకలేక బడిపంతులు అన్నట్లు ఆ రోజుల్లో మురార్జీ తండ్రి సంపాదన ఇంటికి ఏ మాత్రం సరిపోయేది కాదు. ఆయన చిన్నతనంలో కడుపునిండా భోజనం తిన్న రోజులు వేళ్ళమీద లెక్క పెట్టవచ్చునని మురార్జీ ఒక పత్రికా సమావేశంలో అన్నారు. మురార్జీ తెలివైన విద్యార్థి కావటం వలన భావనగర్ మహారాజు నెలకు పది రూపాయలు స్కాలర్ షిప్పు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ పదిరూపాయలతో తల్లి, ఏడుగురు పిల్లలు ఎంతో గుంభనంగా సంసారం సాగించేవారు. మురార్జీ ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా పెరిగాడు.

పాఠశాలలో తెలివైన విద్యార్థిగా ఉంటూ, ఉపాధ్యాలు, స్కూలు యాజమాన్యం అభిమానాన్ని పొంది, వారి సహాయంతో సాయంత్ర సమయాలలో ట్యూషన్లు చెప్తూ కొంత ఆదాయాన్ని సంపాదించి తల్లికి ఇచ్చేవాడు. పాఠశాల చదువు అనంతరం కాలేజీలో చేరి బి.ఏ. ప్రధమ శ్రేణిలో పాసయి, ఆంగ్లేయుల ప్రశంశలు పొందాడు. డిగ్రీ అనంతరం ఉద్యోగ వేటలో పడ్డాడు. ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అధికారి తన మార్కులు చూసి ముచ్చటపడి "నీకు తప్పక ఉద్యోగమిస్తాను, కానీ నీ ప్రవర్తన గురించి ఎవరైనా ఒక దొర నుండి రికమండేషన్ లెటర్ తెచ్చుకో" అన్నాడు. దాంతో తోక తొక్కిన పాములా లేచి మురార్జీ నిర్మొహమాటంగా "నా గురించి, నా ప్రవర్తనగురించి మరెవడో చెప్తేనే ఇచ్చే నీ ఉద్యోగం నాకు అవసరంలేదు" అని చెప్పి చరచరా వచ్చేశాడు. మురార్జీకి చిన్నప్పటి నుంచి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడటం అలవాటు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ పటేల్ వంటి మహానాయకులు కూడా మురార్జీ మాటకు ఎంతోవిలువనిచ్చేవారు. "ముక్కుసూటిగా పోయేమనిషి" అని అనేవారు.

మురార్జీ స్వయంకృషితో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పేదవారి విషయంలో అత్యంత శ్రద్ద చూపి వారి అభివృద్దికి ఎంతో పాటుపడ్డారు. చిన్నతనంలో తను అనుభవించిన కష్టాలు మరెవ్వరికీరాకూడదని కోరుకునేవాడు. రోజు రోజుకూ పేద ప్రజానికానికి సన్నిహితుడవుతున్నాడని గ్రహించిన బ్రిటీషు ప్రభుత్వం అతనిపైఎన్నో నేరాలను మోపి, ఉద్యోగం నుండి తీసివేయాలని ప్రయత్నించింది. ఈ విషయం గ్రహించిన మురార్జీ తనకు బ్రిటీషు ప్రభుత్వంలో న్యాయం జరగదన్న నిరాశతో రాజీనామా చేసి రాజకీయాలలో చేరాడు.

స్వాతంత్ర్యం లభించే వరకూ అనేక ఉధ్యమాలు నిర్వహించి, నిరాహారదీక్షలు సలిపి ఏడుసార్లకు పైగా జైలు శిక్షను అనుభవించి క్రమశిక్షణగల ఉత్తమ రాజకీయవేత్తగా కీర్తింపబడిన మురార్జీ దేశాయ్ స్వాతంత్ర్యం తరువాత దేశంలో అనేక ఉన్నత పదవులను అలంకరించి తన వంతు సేవ చేశాడు.


No comments: