ఆర్.కె. నారాయణ్
పేరు | : | రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి. |
తండ్రి పేరు | : | (తెలియదు). |
తల్లి పేరు | : | (తెలియదు). |
పుట్టిన తేది | : | 1906. |
పుట్టిన ప్రదేశం | : | మద్రాస్‌లో జన్మించాడు. |
చదివిన ప్రదేశం | : | మైసూర్. |
చదువు | : | భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించారు. |
గొప్పదనం | : | (తెలియదు). |
స్వర్గస్తుడైన తేది | : | 2001. |
'మాల్గుడి డేస్' గురించి తెలియని సాహిత్యప్రియులు వుండరంటే అది అతిశయోక్తికాదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్.కె.నారాయణ్‌కు 'మాల్గుడి డేస్' కీర్తిప్రతిష్ఠల నార్జించిపెట్టింది. భారతీయ ఆంగ్ల రచయితల్లో ఆర్.కె. నారాయణ్ గారిది విశిష్ట స్ధానం.
1906వ సంవత్సరంలో మద్రాస్‌లో జన్మించిన ఆర్.కె. నారాయణ్ ప్రాధమిక విద్యాభ్యాసం మద్రాస్‌లోనూ, ఉన్నత విద్యాభ్యాసం మైసూర్‌లోనూ పూర్తిచేసారు. జర్నలిస్ట్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నారాయణ్, నవలా రచనలో తనదైన శైలితో ఆకట్టుకున్నారు. ఆర్.కె. నారాయణ్ రచనల్లో ఎక్కువగా భారతీయ సంస్కృతి, ఆచారవ్యవహారాలు, 'మాల్గుడి' అన్న కాల్పనిక ప్రదేశంలో ప్రస్ధావన, వర్ణన ఉంటుంది. ఆర్.కె.నారాయణ్ రచించిన పలు నవలలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుని, ఆయనకు అజరామరమైన కీర్తినిచ్చాయి.
సులభశైలిలో, సాధారణ పాఠకుడిని సైతం ఏకబిగిన చదివించగలిగే స్ధాయిలో వుండే ఆర్.క్.నారాయణ్ రచనలు సంచలనం సృష్టించాయి, పాఠకులు ఆయన రచనల కోసం ఎదురు చూసే పరిస్ధితిని కల్పించాయి.
ఆర్.కె. నారాయణ్ రచనల్లో 'The Guide' హిందీలో 'ఎవర్‌గ్రీన్' హీరో దేవానంద్ హీరోగా రూపొందించబడి సంచలనం సృష్టించింది. సాధారణ టూరిస్ట్ గైడ్‌కు, ఒక నర్తకికి మధ్య జరిగిన భావోద్వేగ భరిత సంఘటనల సమాహారమే 'The Guide', ఒక చక్కని రొమాంటిక్ క్లాసిక్. ఆ చిత్రం, నవల చరిత్రలో నిలిచిపోయాయి.
నవలలు, కధాసంకలనాలు, వ్యాస సంకలనాలు, ట్రావెలోగ్స్ (యాత్రాదర్శినిలు), వంటివి పలు రచించి ఆర్.కె.నారాయణ్ భారత సాహిత్య చరిత్రలో స్ధిరస్ధానం పొందారు. స్వామి అండ్ ఫ్రెండ్స్, దిడార్క్ రూమ్, ది ఇంగ్లీష్ టీచర్, వెయిటింగ్ ఫర్‌ది మహాత్మా, ఎ టైగర్ ఫర్ మాల్గుడి, టాకిటివ్ మాక్, ఎ పెయింటింగ్ ఆఫ్ సైన్స్ వంటి నవలలు, ఎ హోర్స్ అంట్ టు గోట్స్, యాన్ ఆస్ట్రాలజర్స్ డే, మాల్గుడి డేస్, ది గ్రాండ్ మదర్స్ టేల్ వంటి కధా సంకలనాలు, మై డేటలెస్ డైరీ, ఎమరాల్డ్ రూట్స్ వంటి ట్రావెలోగ్స్, నెక్స్‌ట్ సండే, రిలక్టంట్‌గురు, ఎ రైటర్స్ నైట్‌మేర్, స్టోరీ టెల్లర్స్ వరల్డ్ వంటి వ్యాస సంకలనాలు కాక 'ది రామాయణ', 'ది మహాభారత', 'గాడ్స్', 'డెమాన్ అండ్ అదర్స్' వంటి పలు సుప్రసిద్ధ రచనలు వెలువరించిన ఆర్.కె. నారాయణ్ చిరస్మరణీయులు.
ఆర్.కె. నారాయణ్ సాహితీ ప్రస్ధానంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. ఎ.సి. చెప్పన్ అవార్డ్, సాహిత్య అకాడమీ అవార్డు (The Guide రచనకు 1958వ సంవత్సరంలో) వంటి అవార్డులు రాజ్యసభ సభ్యత్వం (1989వ సంవత్సరం) వంటివి ఆర్.కె. నారాయణ్ కీర్తిని ఇనుమడింపచేశాయి.
గ్రహమ్‌గ్రీన్స్ సలహాతో ఆర్.కె. నారాయణ్‌గా మారిన రాశిపురం క్రిష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి సాహితీరంగంలో సుస్ధిరస్ధానాన్ని, కీర్తిని పొంది 2001 వ సంవత్సరంలో పరమపదించారు.
సుప్రసిద్ధ కార్టూనిస్ట్, చిత్రకారుడు అయిన ఆర్.క్. లక్ష్మణ్, ఆర్.కె. నారాయణ్ గారి సోదరులు.
No comments:
Post a Comment