ఎం.ఎస్. స్వామినాధన్
పేరు | : | ఎం.ఎస్. స్వామినాధన్. |
తండ్రి పేరు | : | సామిశివన్ స్వామినాధన్. |
తల్లి పేరు | : | (తెలియదు). |
పుట్టిన తేది | : | 7-8-1925. |
పుట్టిన ప్రదేశం | : | "తమిళనాడు" రాష్ట్రంలోని కుంభకోణంలో జన్మించాడు. |
చదువు | : | (తెలియదు). |
గొప్పదనం | : | ఆధునిక విధానాల ద్వారా అధిక దిగుబడి, ఆదాయాలు పొందేవిధంగా తీర్చిదిద్దిన "హరితవిప్లవ పిత" డా|| ఎమ్.ఎస్. స్వామినాధన్ గారు అభినందనీయులు. |
"హరిత విప్లవ పిత" గా పేరొనబడే ఎమ్.ఎస్. స్వామినాధన్ భారత వ్యవసాయరంగంలో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం.
వ్యవసాయధారిత దేశమైన భారతదేశానికి స్వామినాధన్ పరిశోధనలు ఆలంబనలుగా నిలిచాయి. స్వామినాధన్ పరిశోధనలు ఫలితంగా వ్యవసాయంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు దిగుబడులు పెరిగాయి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్ధను కూడా ప్రభావితం చేసి, అభివృద్ధి చెందేలా చెంది, తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంలో 1925వ సంవత్సరం ఆగస్ట్ 7వ తేదీన జన్మించిన ఎమ్.ఎస్. స్వామినాధన్ తండ్రి సామిశివన్ స్వామినాధన్ జాతీయవాద భావాలుకల వైద్యుడు. వ్యవసాయాధారమైన భారతదేశంలో వ్యవసాయరంగ దిగుమతులు తగ్గిపోవడం గమనించిన ఎమ్.ఎస్. స్వామినాధన్ వ్యవసాయరంగంలో అభివృద్ధి సాధించడమే ప్రధాన ధ్యేయంగా శ్రమించారు.
వ్యవసాయరంగ అభివృద్ధి కోసం అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరిపారు. పాశ్చాత్యదేశాల్లో నార్మన్ బోర్లాగ్ ప్రభావంతో ప్రారంభమైన 'హరిత విప్లవం' (Green Revolution) చేత ప్రభావితుడైన ఎమ్.ఎస్. స్వామినాధన్, భారతదేశంలో హరిత విప్లవస్ధాపనకు తద్వారా వ్యవసాయరంగంలో అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేసారు.
వ్యవసాయరంగం లో అభివృద్ధి కొరకు నిర్దేశించబడిన పలు పధకాలు, ప్రాజెక్టుల రూపకల్పనలో ఎమ్. ఎస్. స్వామినాధన్‌గారు చురుకైన పాత్రపోషించారు. స్వామినాధన్‌గారి అవిశ్రాంత కృషి కారణంగా భారతదేశం లో ఆహారధాన్యాల కొరత దాదాపుగా తగ్గిపోయింది. 'హరిత విప్లవం' (Green Revolution) ఉద్యమ రూపకర్త అయిన డా|| నార్మన్ బోర్లాగ్‌గారు కూడా డా|| ఎమ్.ఎస్. స్వామినాధన్‌గారు భారతదేశంలో వ్యవసాయరంగం అభివృద్ధికొరకు చేసిన ప్రశంసించారు.
1990వ సంవత్సరంలో మద్రాస్ (నేటి చన్నై) సమీపంలో తనకు వివిధ అవార్డులు, బహుమతుల ద్వారా లభించిన డబ్బుతో "ఎమ్.ఎస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్ధాపించారు. స్వామినాధన్ గారి కృషి, రీసెర్చిసెంటర్ సాధించిన విజయాలు అంతర్జాతీయ స్ధాయి ప్రశంసలందుకున్నాయి. స్వామినాధన్‌గారి సేవలను గుర్తించిన UNESCO వారు దక్షిణాసియాకు సంబంధించిన 'Eco - Techonology' ఛైర్‌పర్సన్‌గా స్వామినాధన్‌గారిని నియమించారు. సామాన్య గ్రామీణ భారత రైతుకు నూతన విధానాలను అందుబాటులోకి తీసుకురావడానికి, నూతన వ్యవసాయ పద్దతుల గురించి గ్రామీణ రైతుల్లో చైతన్యం తీసుకురావడంకోసం స్వామినాధన్‌చేసిన కృషి కారణంగా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి పెరగడమే కాక, ఆదాయం పెరగడం జరిగింది.
భారతదేశంలో 'హరితవిప్లవా' న్ని వ్యాప్తం చేసిన డా|| ఎమ్.ఎస్. స్వామినాధన్‌గారి కృషికి గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ బహుమతులు, బిరుదులు అందుకున్నారు. పద్మశ్రీ (1967), పద్మ భూషణ్ (1992), మెగసెసే అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్ షిప్ (1971), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డ్ (1991), జపాన్ దేశం యిచ్చే హోండా ఇన్ అగ్రికల్చర్ (1997), వోల్వో ఇంటర్నేషనల్ ఎన్విరాన్‌మెంట్ అవార్డ్ (1999), UNESCO గాంధీ గోల్డ్ అవార్డ్ (1999). . . యింకా యిలా వ్రాస్తూపోతే ఎన్నో అవార్డులు డా|| ఎమ్.ఎస్. స్వామినాధన్‌గారి కృషికి తగిన గుర్తింపును యివ్వడానికి పోటీపడ్డాయి.
భారతదేశ ఆర్ధికవ్యవస్ధకు వెన్నుముకగా పరిగణింపబడుతున్న వ్యవసాయంరంగంలో పలు మార్పులను తీసుకువచ్చి, ఆధునిక విధానాల ద్వారా అధిక దిగుబడి, ఆదాయాలు పొందేవిధంగా తీర్చిదిద్దిన "హరితవిప్లవ పిత" డా|| ఎమ్.ఎస్. స్వామినాధన్ గారు అభినందనీయులు.
No comments:
Post a Comment