Thursday, February 3, 2011

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

పేరు : దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది :

(తెలియదు).

పుట్టిన ప్రదేశం : పెనుగంచిప్రోలు.
చదివిన ప్రదేశం : బాపట్ల.
చదువు : యం.ఏ.
గొప్పదనం : హిందూ, ముస్లింల ఐక్యతను పెంపొందించటానికి ఆయన కృషి చేశాడు.
స్వర్గస్తుడైన తేది :

(తెలియదు).


స్వాతంత్ర యోధులలో ఇతడొక ప్రముఖ ఆంద్రుడు. ఇతనిని "ఆంద్రరత్న" అని అంటారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1889లో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు అనే గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఇతని తల్లిదండ్రులు మరణించారు. అందుకని ఇతని పినతండ్రి పోషణలో విద్యావంతుడైనాడు. ఇతనికి "దుర్గాభవానమ్మ"తో చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. ఇతడు బాపట్లలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందాడు. తర్వాత బాపట్ల తాలూకా కార్యాలయంలో గుమస్తాగా చేరాడు. కానీ, దానికి రాజీనామా చేశాడు. నాటి పరిస్థితుల్లో, ఒక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తా పదవిలో ఉండేకంటే బిచ్చగానిగా ఉండటం మేలని అతడు నమ్మాడు. బాపట్లలో ఉండగా "జాతీయ వినోదశాల"ను తన స్నేహితుల సహాయంతో స్థాపించి, నాటకాలను ప్రోత్సహించాడు. ఆ కాలంలో సముద్ర ప్రయాణం ఒక దురాచారంగా భావించేవారు. అయినా, ఉన్నత విద్య కోసం, యితడు ఇంగ్లాండ్‌కు రహస్యంగా కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇంగ్లాండు నుండి యం. ఏ డిగ్రీతో తిరిగి వచ్చాడు. తర్వాత రాజమండ్రిలోని ప్రభుత్వ శిక్షణా కళాశాలలో ఆచార్యునిగా చేరారు. దానికీ రాజీనామా చేసి, మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా చేరాడు.

ఆంద్ర జాతీయ కళాశాల ఒక స్వదేశీ జాతీయ సంస్థ. 1905 వందేమాతరం ఉద్యమంలో స్వదేశీ సంస్థలకూ, వస్తువులకూ ప్రోత్సాహం వచ్చింది. విదేశీ వస్తువులకంటే స్వదేశీ వస్తువులు ఉత్తమమైనవిగా ఎంపిక చేయబడ్డవి. ఇలా, కొన్ని వేలమంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నుండి జాతీయ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, చేరేవారు. గోపాలకృష్ణయ్య జాతీయ కళాశాల వైస్ ప్రిన్స్‌పాల్‌గా చేరాడు. కాకతీయ వ్యాప్తికి అతడు యీ విధంగా నాయకత్వం వహించాడు.

ఇతడు మహాత్మాగాంధీ అనుచరులలో ఒకడు. బ్రిటీషు పరిపాలన నుండి స్వేచ్ఛ కోసం జరిగిన భారత పోరాటంలో యితడు పాల్గొన్నాడు. ఈ పోరాటంకు ఇతని ప్రముఖమైన సేవ ఏమనగా చీరాల-పేరాల పోరాటంలో యితడు పాల్గొన్నాడు. ఈ రెండు గ్రామాలను కలిపి ఒక పురపాలక సంఘంగా మార్చవలెనని నాటి బ్రిటీషు ప్రభుత్వం తలచింది. ఇందువల్ల ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది. అందువల్ల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఈ గ్రామాల వాళ్ళ ఆలోచనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వబలప్రయోగం చేయగా, గ్రామస్తులు వేరే ప్రదేశానికి వెళ్ళి తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్నారు. దీనిని రామనగరం అన్నారు. ఈ చీరాల - పేరాల పోరాటంకు సాయంగా గోపాలకృష్ణయ్య వాలంటీర్ల దళాన్ని " రామదండు" అనే పేరుతో ఏర్పరచాడు.

అహింసా భావనలోనూ, అహింసాయుతమైన ఆందోళనలోనూ, ఆయనకు నమ్మకం కుదిరింది. హిందూ, ముస్లిం ఐక్యతను పెంపొందించటానికి కూడా ఆయన కృషి చేశాడు.


No comments: