Thursday, February 3, 2011

అటల్‌ బిహారి వాజ్‌పేయి

అటల్‌ బిహారి వాజ్‌పేయి

అటల్‌ బిహారి వాజ్‌పేయి
పేరు : అటల్‌ బిహారి వాజ్‌పేయి.
చదివిన ప్రదేశం : కాన్పూర్‌.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 25-12-1924.
పుట్టిన ప్రదేశం : " గ్వాలియర్ ‌" అనే గ్రామంలో (మధ్యప్రదేశ్‌) లో జన్మించాడు.
చదువు : న్యాయశాస్త్రంలో డిగ్రీ.
గొప్పదనం : కవిత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తానని పేర్కొనే వాజ్‌పేయి ప్రసంగంలో (కవితా) ఛమక్కులు ఆయన ప్రత్యర్ధులను కూడా ఆకట్టుకుని అభిమానించేలా చేస్తాయి.

1995వ సంవత్సరం‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనాంతరం దేశం రాజకీయ అస్థిరతకు గురైనపుడు, సుస్థిర ప్రభుత్వాన్ని అందించి దేశాన్ని అభివృద్ది దిశగా నడిపించిన నేతగా వాజ్‌పేయి సుప్రసిద్దులు. రాజకీయంగా అత్యంత ఉన్నత స్థానాలకు ఎదిగినప్పటికీ, రాజకీయ నాయకుని కంటే ఎక్కువగా ఆయనలో ఒక కవి. దార్శనికుడు, సామాజిక వాది గోచరిస్తారు. శాంతి స్థాపనకు విశిష్ట సేవ చేసిన వాజ్‌‌పేయి పలువురి ప్రశంసలందుకున్నారు. " సింధువు లాంటి హిందూలో నేనొక బిందువును . . . " అనే వాజ్‌పేయి ఉదార హిందూవాదిగా పేరుగాంచినప్పటికీ, ఆయనలో ప్రజాస్వామిక లక్షణాలు ఎక్కువ కాబట్టే పలువురు యితర పార్టీల నాయకులు ఆయనపై విశ్వాసం ఉంచి, పరిపూర్ణ మద్దతునిచ్చారు.

యువకుడిగా కమ్యూనిజం భావాలకు ప్రభావితుడైనప్పటికీ, కమ్యూనిస్టులు భారతదేశ విభజనను సమర్ధించడంతో వాజ్‌పేయి కమ్యూనిజానికి దూరమయ్యారు. హిందువులధర్మ పరిరక్షణ కొరకు, అభ్యున్నతికి పాటుపడుతున్న "రాష్ట్రీయ స్వయం సేవక్‌" (RSS) సంఘ‌భావాలకు, సిద్ధాంతాలకు ప్రభావితమైన వాజ్‌పేయి తన చదువును వదిలి ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరి, ప్రచురణ విభాగంలో ఎడిటర్‌గా చేరారు.

RSS సభ్యుడిగా వుంటూనే, శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జిగారు స్థాపించిన "భారతీయ జనసంఘ్‌" లో చేరారు. 1957వ సంవత్సరం‌లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన వాజ్‌పేయి అప్పటినుంచి పలుమార్లు లోక్‌సభ, రాజ్యసభ (రెండుసార్లు) సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1977వ సంవత్సరంలో ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల తరువాత స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో వాజ్‌పేయి విదేశీ వ్యవహారాల శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ' హిందీ 'లో ప్రసంగించి సంచలనం సృష్టించారు.

ఇదంతా ఒక ఎత్తైతే 1980వ సంవత్సరంలో మరికొందరితో కలిసి 'భారతీయ జనతా పార్టీ' ని స్థాపించడం మరొక ఎత్తు. భారతీయ జనతా పార్టీ స్థాపన వాజ్‌పేయి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1984వ సంవత్సరంలో ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో వీచిన సానుభూతి పతనాలు వల్ల బిజెపి కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, 1991వ సంవత్సరం నాటీకి 117 స్థానాలు సాధించి జాతీయ పార్టీలలో కాంగ్రెస్‌కు విధ్వంస సంఘటన వల్ల పార్టీపై మతతత్వ ముద్ర పడింది. కానీ, వాజ్‌పేయి వంటి ఉదారవాది, మితవాదుల వల్ల బి.జె.పి. ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకోగలిగింది. 1996వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, కావలసిన మద్దతు సంఖ్యను పొందలేకపోవడంతో వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం 13 రోజుల్లోనే పతనమైంది. తరువాత రాజకీయ అస్థిరత ఏర్పడడం వల్ల మళ్లీ 1998వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో' జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance - NDA)గా యితరపార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి విజయం సాధించి వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా NDA విజయం సాధించి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ అనంతరం అత్యంత విజయవంతంగా, సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. కార్గిల్ విజయం, విదేశీ నిల్వలు, విదేశీ వ్యవహారాలు, పాక్‌తో శాంతియత్నాలు వంటి పలు విజయాలు వాజ్‌పేయి ప్రభుత్వం సాధించింది.

కవిత్వం అంటే అమితంగా యిష్టపడే వాజ్‌పేయి, పరిస్థితుల కారణంగా రాజకీయాల్లో కొనసాగవలసి వచ్చింది. అయినప్పటికీ వాజ్‌పేయి అప్పుడప్పుడు కవితలు రాశారు. రాజకీయాలకన్నా కవిత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తానని పేర్కొనే వాజ్‌పేయి ప్రసంగంలో (కవితా) ఛమక్కులు ఆయన ప్రత్యర్ధులను కూడా ఆకట్టుకుని అభిమానించేలా చేస్తాయి. వాజ్‌పేయి కవితలు "మేరీ ఇక్వావన్ కవితాయే" పేరుతో పుస్తకరూపంలో ప్రచురింపబడటమే కాకుండా, వాటిలో కొన్ని ఆల్బమ్‌గా కూడా రూపుదిద్దుకున్నాయి. వాజ్‌పేయిది పోరాటానికి వెరచే తత్వం కాదు. వాజ్‌పేయి గారి గురించి ఎక్కువగా చెప్పడం కంటే, ఆయన వ్రాసిన కవిత ఉదహరించడం బాగుంటుంది.


ఓటమిని అంగీకరించను

పోరాటాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను

విధిరాతను తిరగరాస్తాను.

కొత్తపాట పాడుతాను.


No comments: