సూక్తులు
1. 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
2. అంతరాత్మ మనలను మందలించె పనులు మనము చెయ్యకూడదు.
3. అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు.
4. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ త్వరలో అందాన్ని పొందుతాడు.
5. అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది. - ప్రేంచంద్.
6. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
7. అఙ్ఞానం అనేది అభివృద్దికి, మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే.
8. అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
9. అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
10. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
11. అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
12. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.
13. అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
14. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ. - థామస్ కార్ల్త్ల్
15. అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు; ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.
16. అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
17. అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
18. అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం కాలం.
19. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. - ఏ.జి. గార్డెనర్
20. అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
21. అసమానత్వంవల్ల హింస పెరుగుతుంది.
22. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
23. అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
24. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధీ.
25. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
26. ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
27. ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.
28. ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.
29. ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.
30. ఆదర్శవాదికి అందరూ విరోధులే.
31. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.
32. ఆరోగ్యం పరమ ప్రయోజనం.
33. ఆలూలేదు చూలూ అల్లుడు పేరు సోమలింగం.
34. ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.
35. ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.
36. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.
37. ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్
38. ఆశలేని వాని కగచాట్లులేవు.
39. ఆశించడంవల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
40. ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది. సోక్రటీస్
41. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
42. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
43. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
44. ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.
45. ఇతరులతో పంచుకున్నప్పుడూ తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే - రికార్డా హక్
46. ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే, వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్ధం.
47. ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.
48. ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
49. ఈ పని తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి.
50. ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.
51. ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .
52. ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.
53. ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్
54. ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
55. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏదైనా మంచిపనిలో సహాయపడే వారే నిజంగా గొప్పవారు.
56. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసే వారే గొప్పవారు.
57. ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి .
58. ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
59. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.
60. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.
61. ఎప్పుడూ ప్రార్ధించే పెదవులకన్నా సహాయం చేసే చేతులే మిన్న.
62. ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.
63. ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.
64. ఎవరి పని వారుచేసుకోవడం ఉత్తమ ధర్మం.
65. ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.
66. ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.
67. ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
68. ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
69. ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.
70. ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
71. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.
72. ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.
73. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.
74. ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.
75. ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు.అవి ఎప్పటికైనా బయటపడతాయి.
76. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
77. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
78. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.
79. ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.
80. ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది - చైనా సామెత
81. ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచిపజేస్తుంది - బైరన్.
82. ఒక్కక్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్కక్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
83. ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం
84. ఓపికతో వేచి ఉన్నవారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.
85. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
86. కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
87. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
88. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
89. కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.
90. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
91. కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
92. కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
93. 'కోపం' యమధర్మరాజు లాంటిది. 'తృష్ణ' వైతరణిలాంటిది. 'విద్య' కామధేనువులాంటిది. ఇక 'సంతృప్తి' దేవరాజైన ఇంద్రుడు నందనవనం లాంటిది - చాణుక్యుడు.
94. క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
95. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
96. గతమే వర్తమానానికి మార్గం.
97. గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
98. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.
99. గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం -మౌనం కార్ల్తెల్
100. గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.
- గొప్పపనులు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.
- గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
- గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
- ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.
- ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.
- ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.
- ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు.
- చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
- చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
- చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
- చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.
- చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది - స్వీడిష్ సామెత.
- చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది.
- చీకటిలో మీరు వ్యవహరించేతీరే మీ గుణం.
- చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
- చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే
- చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
- జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.
- జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.
- జీవితం నుండి ఆశిస్తే... ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
- జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
- జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.
- జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది - థామస్ హెన్రీ హక్స్‌లే
- జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
- జ్ఞాని మానవుడిలో దైవాన్ని చూస్తాడు. అజ్ఞాని దైవంలో మానవుణ్ణి చూస్తాడు.
- డబ్బును ఎలాగైతే సంతోషంగా స్వీకరిస్తామో, మంచిని కూడా అలాగే స్వీకరించాలి.
- తన అఙ్ఞాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
- తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
- తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం
- తప్పు చేయని వారు ధరణిలో లేరు.
- తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు - హెన్రీ ఫోర్డ్
- తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.
- తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.
- తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.
- తెలిసికోడం కాదు, ఆచరించడమే కష్టం. - షూకింగ్
- త్యాగమయ జీవితం మహత్తర జీవితం.
- దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
- దూరపు కొండలు నునుపుగా తోచు.
- దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది - రోస్‌పాల్.
- దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు - స్వామి వివేకానంద.
- దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు.
- దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది - షేక్స్పియర్.
- దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
- దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.
- ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది. తన మాతృదేశాన్ని ఉత్తమమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించినవాడే ఉత్తమ దేశభక్తుడు.
- నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.
- నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు - పండిట్ నెహ్రూ
- నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
- నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.
- నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
- నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.
- నిఘంటువులో మాత్రమే 'విజయం' , 'సాధనకు' ముందు వస్తుంది.
- నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
- నిజము నిలకడ మీద తెలియును.
- నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము - సి.సి. కోల్డన్
- నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
- నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
- నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
- నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
- నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.
- నిర్మలమైన మనస్సును కలిగి ఉండటాన్ని మించిన శాంతి మానవునికి లేనేలేదు .
- నిస్వార్దంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగినవాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
- నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
- నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.
- నీటితో శరీరం శుద్ది పొందినట్లే -, సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ది, విద్యచే ఆత్మశుద్ది కలుగుతాయి.
- నీతిగల వానికి నిందాభయం లేదు.
- నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
- నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.
- నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది - హెన్రీ ఫోర్డ్
- నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.
- పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.
- పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.
- పరిపూర్ణత అనేది ఎప్పుడూ ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది.
- పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ
- పరిస్థితులనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
- పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది - హెన్రీ ఫోర్డ్
- పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.
- పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
- పులిని చూచి నక్క వాత పెట్టుకొన్నట్టు.
- పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
- పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు.
- పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
- పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
- పెరుగుతున్న వయస్సుతో కాదు. చేసే సత్క్రియలతో జీవితం సార్ధకం అవుతుంది. - షెరిడాన్.
- పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది - స్కాట్.
- పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.
- ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్సాల్.
- ప్రగల్ఫాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.
- ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.
- ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోవడమే.
- ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు.
- ప్రపంచంలో ప్రతి మనిషీ ఏదో ఒక విధంగా పనికి వస్తాడు. ప్రతి జీవితానికి ఓ అర్ధం ఓ ప్రయోజనం ఉండి తీరుతాయి.
- ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
- ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.
- ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.
- ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాదిపైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.
- ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
- ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు - క్లియర్క్ గార్డ్
- ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్ళు అవుతారు.
- ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
- ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును - గురజాడ.
- 'ప్రేమ' పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్
- ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది కానీ ద్వేషం చేయలేదు - బుద్ద
- ప్రోపెల్లరు లేని స్టీమర్ ఎంత నిష్ప్రయోజనం అయిందో ప్రయత్నం చేయకుండా కోరే కోరికలు కూడా అంతే నిష్ప్రయోజనమైనవి. మంచిని బోధించడమే అన్ని మతాల లక్ష్యం.
- బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.
- బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
- బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర - విన్‌స్టన్ చర్చిల్.
- బావి లోతుకన్న మనసు లోతు మిన్న.
- భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.
- భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
- భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.
- మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.
- మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
- మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
- మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
- మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
- మతిలేని మాట శృతిలేని పాట.ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.
- మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనం స్వయంగా నష్టపోతాము.
- మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
- మనం ఇతరులలో లోపాన్ని ఎత్తిచూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.
- మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
- మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
- మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
- మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
- మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
- మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
- మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.
- మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
- మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.
- మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.
- మనలో చాలా మందికి ఎలా చెప్పకుండా ఉండాలో తెలుసు. అయితే కొంతమందికి చెప్పకుండా ఉండాలో తెలుసు.
- మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడికంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.
- మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
- మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
- మనస్సును చెదిరిచడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.
- మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.
- మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
- మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.
- మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.
- మనిషి ముసలివాడై చావుకు సిద్దమైనమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు.
- మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.
- మనిషికి నాలుక ఒకటేఅ; చెవులు మాత్రస్మ్ రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.
- మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.
- మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం.
- మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
- మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్
- మాట ఇవ్వటానికి తొదరపడకు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు.
- మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
- మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది,
- మితము తప్పితే అమృతమైనా విషమే.
- మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
- మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్
- మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే
- మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.
- మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
- మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
- మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ బుద్దిని వాడండి. కాని ఇతరుల సమస్యను పరిష్కరించడానికి మీ హృదయాన్ని వాడండి.
- మీభయాల్ని మీ దగ్గర ఉంచుకోండి. కానీ మీ ధైర్యాన్ని మాత్రం ఇతరులతో పంచుకోండి.
- మీరు చేయవల్సింది ఈ రోజే చేయండి. రేపటి వరకూ దేన్నీ వాయిదా వేయకండి.
- మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
- ముంజేతి కంకణానికి అద్దము కావలెనా.
- ముందు నుయ్యి వెనుక గొయ్యి .
- మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
- మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.
- మూర్తం కొంచెమైనా కీర్తి విస్తారము.
- మేటర్న్ తమను తాము హద్దుల్లో ఉంచుకున్నవారు ఇతరులను కూడా హద్దుల్లో ఉంచగలుగుతారు - విల్లియం హజ్‌లిట్.
- మొండివాడు రాజు కంటె బలవంతుడు.
- మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
- యథారాజా తథా ప్రజా.
- యదార్ధవాది లోకవిరోధి.
- యౌవనంలో కూడబెట్టు; వార్ధక్యంలో వాడుకో.
- రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.
- రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.
- రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
- రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.
- లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి! - స్వామి వివేకానంద.
- లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.
- లోభికి నాలుగు దిక్కులా నష్టం.
- వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేంస్ రసెల్ లోవెల్.
- వజ్రమును వజ్రము తోనే కోయవలయును.
- వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు; పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
- వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.
- వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
- విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.
- విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచి పెట్టేవాడు ఎన్నడూ జయించడు.
- విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.
- విద్య ఇచ్చిన తేజస్సు ... అందరినీ ఆకర్షిస్తుంది.
- విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.
- విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
- విద్య యొక్క నిజమైన పరమార్ధం ఉత్తమ వ్యక్తిని రూపొందింప చేయడమే.
- విద్య లేని వారికి కీర్తి లేదు.
- విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.
- వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.
- వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.
- వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.
- విశ్వాసం పరమ బంధువు.
- విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.
- విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.
No comments:
Post a Comment