Thursday, February 3, 2011

జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
మనలో ప్రతిఒక్కరి జీవితంలోనూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, సందర్భాలు వున్నాయి, వస్తూ వుంటాయి. అందరం ఎవరి స్థాయిలో వారు ఆ సందర్భాలను జరుపుకుంటూ వుంటాము. చాలాసార్లు ఇటువంటి సమయంలో ఏంచేయ్యవలెనో, ఎలా చేయ్యవలెనో, మన ప్రత్యేకతను ఎలా చాటుకోవాలనో ఆలోచిస్తూవుంటాం. సాంప్రదాయం ప్రకారం పాటించాలని మనసులో వున్నా, శక్తిసామర్ధ్యాలు వున్నా కొన్నిసార్లు పద్దతులు తెలియక, కావలసిన వస్తువులేవో తెలియక, చిన్న చిన్న విషయాలపైన అవగాహన లేకపోవడం వలన 'సరేలే' అని సర్దుకుపోతూ వుంటాం. ముఖ్యంగా, ఉద్యోగరీత్యా విడిగా అయినవారికి దూరంగా వుండేవారికి ఈ పరిస్థితి సాధారణం. ఇంట్లో పెద్దవారు సమయానికి లేకపోతే చాలామందికి ఇలానేవుంటుందికదా? అందుకే ఈ శీర్షిక. మీకోసం, మాకోసం, మన పిల్లల కోసం సందర్భానుసారంగా వీలైనన్ని వివరాలను సేకరించాలనేది మా ఆకాంక్ష.
  1. పాపో, బాబో పుట్టినప్పుడు
  2. అన్నప్రాసన
  3. చెవులు కుట్టించడం (పుట్ట పొంగళ్ళు)
  4. పుట్టిన రోజు
  5. అక్షరా భ్యాసం
  6. ఓణీలు ఇవ్వటం (లేదా) లుంగీలు ఇవ్వటం
  7. ఉపనయనం (ఒడుగు)
  8. అమ్మాయి పెద్దమనిషి అవ్వటం
  9. నిశ్చయతాంబూలాలు (నిశ్చితార్ధం)
  10. పెండ్లి కుమార్తెను/ కుమారుడిని చేయటం
  11. పెళ్ళి చేయటం
  12. నోములు తీర్చటం
  13. సారె పెట్టడం
  14. శ్రీమంతం
  15. పెళ్ళి రోజు
  16. షష్ఠిపూర్తి
  17. ఇంట్లో ఒకరు అందని ఎత్తుకు వెల్లిపోయినప్పుడు
  18. సంవత్సరీకం
  19. తద్దినం
  20. గృహప్రవేశం
  21. క్రొత్త వాహనం (బండి) కొనుక్కున్నప్పుడు
  22. నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు
ఈ సందర్భముల పద్దతుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే వుంటుంది. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము

No comments: