Thursday, February 3, 2011

బరువు తగ్గించేందుకు పంచసూత్రాలు

బరువు తగ్గించేందుకు పంచసూత్రాలు
కళ్లెదురుగా ఘుమఘుమ వాసనల వేపుళ్లు... సమోసాలు... కాని తింటే బరువు పెరుగుతామన్న బాధ... అయినా సరే తినాలన్న కోరికకు కళ్లెం వేయలేక కేలరీలు పెంచుకునేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి పదార్థాలు కనిపించకుండా జాగ్రత్త తీసుకోవడం మేలు కదూ. అతిగా తినడాన్ని ప్రోత్సహించే పరిసరాలు లేకుండా చూస్తే చాలావరకుబరువు తగ్గించుకునేందుకు వీలవుతుంది. కేలరీలు పెంచే ఆహరం తీసుకోవాలనే కోరికను అదుపులో ఉంచడానికి సహయపడేందుకే ఈ అయిదు చిట్కాలు...
  • కేలరీలను పెంచేవి, మీకు బాగా ఇష్టమైనవి అయిన పదార్థాలను అన్నింటికన్నా వెనక్కి మీకు అందనంత దూరంలో ఉంచండి. లేదా అక్కడి నుంచి తీసుకోవడం అసౌకర్యంగా ఉండే ప్రదేశంలో పెట్టండి.
  • చిరుతిళ్లను ఎప్పుడైనా సరే పెద్ద పాత్రలో నుంచి తీసుకుంటూ తినకుండా ప్లేట్లలో పెట్టుకుని తినండి. పెద్ద పెద్ద ప్లేట్లు కాకుండా చిన్నగా ఉండే పాత్రలను ఎంచుకోండి. దానివల్ల తినడం ఎక్కడ ఆపేయాలో సులభంగా అర్ధమవుతుంది.
  • ఏవైనా ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లినప్పుడు కేలరీలను బట్టి తినడానికి కుదరదు. మనం ఎంత తింటున్నామో చూసుకోవడానికి కూడా వీలుండదు. కాబట్టి వెళ్ళేముందుగానే ఇంతే తినాలన్న నిబంధన పెట్టుకోండి. అదేవిధంగా ఏ క్రికెట్ మ్యాచో, సినిమానో చూడడానికి వెళ్లే ముందు కూడా తిండి విషయంలో మీకు మీరే పరిమితులు విధించుకోండి.
  • నలుగురిలో కూర్చుని తింటున్నప్పుడు అందరి కన్నా తక్కువగా, ఆరోగ్యమైన ఆహారాన్ని ఎవరు తింటున్నారో గమనించి వాళ్లను అనుకరించే ప్రయత్నం చేయండి.
  • మీరు తీసుకునే ఆహారంలో మీకు ఇష్టమైన ఒకే రకమైన కూరగాయ బదులుగా రకరకాల కూరగాయలతో వైవిధ్యమైన వంటకాలు ఉండేలా జాగ్రత్తపడండి. ఇష్టమైన వంటకమైతే సహజంగానే ఎక్కువ తినేస్తాం. కాబట్టి ఎంత ఇష్టమున్నా సరే దానితో పాటుగా అన్ని రకాల పదార్ధాలను రుచి చూడండి.

No comments: