Thursday, February 3, 2011

ఏ వేళకు ఎలా?

ఏ వేళకు ఎలా?
ఆహారాన్ని టైం టేబుల్ ప్రకారం ఎలా తీసుకోవాలో సూచిస్తున్నాము... చూడండి.
ఉ.7-30: రాత్రంతా పడుకుని ఉదయం లేచేసరికి శరీరంలో నీటి శాతం పడిపోయి తేమ తగ్గుతుంది. అందుకని ఏడున్నర లోపు కాఫీ, టీలు తాగి ఊరుకోకుండా వీలైనన్ని నీళ్లు తాగాలి.
ఉ. 8-00: రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా పనిచేయాలంటే అల్పాహారం... అంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. ఏదో ఒకటి తిన్నామని కాకుండా మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు, పండ్లు, ఇలా ఏదైనా సరే. పిల్లల కైతే నూనె పదార్ధాలు కాకుండా పెరుగన్నం, ఇడ్లీ వంటివి అలవాటు చేస్తే మంచిది.
బస్సులోనో, బండిమీదో ఆఫీసుకు చేరతారు. కొంతసేపు కొలీగ్స్ తో కబుర్లు చెప్పిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఆ తర్వాత...
ఉ. 11-00: శరీరంలోని గ్లూకోజ్ ను మెదడు ఇరవై శాతం వరకు వినియోగించుకుంటుంది. కాబట్టి శరీరం మరికొంత శక్తిని కోరుకుంటుంది. అందుకని కొన్ని డ్రైఫ్రూట్స్ లేదా ఒక అరటిపండు, బిస్కెట్లు తినడం తప్పనిసరి!
మ. 1-00: పన్నెండు నుంచి ఒంటిగంట మధ్య చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారని పరిశోధనల్లో తేలింది. కనుక ఎంత బిజీగా ఉన్నా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనం చేయాలి.
మ. 3-00: మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందట ఈ సమయంలో. కనుక కొంచెం కష్టతరమైన పనులను పరిష్కరించుకోవడానికి ఇది అనువైన వేళ.
సా. 4-30: ఒక కప్పు కాఫీ లేదా టీ ఒక బిస్కెట్ తో తీసుకోవాలి.
సా. 5-30: అయ్యేసరికి శరీరంలోని శక్తి కూడా తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ సేపు పనిచేయాల్సివస్తే మాత్రం కొంచెం అల్పాహారం తీసుకోవాలి.
రోజంతా బయట ఉండటం వల్ల మీ శరీరం జిడ్డుగా మారుతుంది. కాబట్టి ఇంటికి రాగానే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. వీలైనంత త్వరగా రాత్రి భోజనం ముగించండి.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగండి. పడుకోవడానికి ముందు కాసేపు టీవి చూడండి. లేదా మంచి పుస్తకం చదవండి.

No comments: